HealthJust LifestyleLatest News

Head injury: తలకు గాయం తర్వాత ఈ లక్షణాలు పెరుగుతున్నాయా? జాగ్రత్త..

Head injury: తల బరువుగా అనిపించడం, కొద్దిగా తల తిరగడం, ఎక్కువగా నిద్ర రావడం వంటివి గాయం వల్ల కలిగే సాధారణ లక్షణాలు.

Head injury

ఒక చిన్న ప్రమాదం వల్ల తలకు గాయం అయినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. తల బరువుగా అనిపించడం, కొద్దిగా తల తిరగడం, ఎక్కువగా నిద్ర రావడం వంటివి గాయం వల్ల కలిగే సాధారణ లక్షణాలు. ఇవి ఒక కన్‌కషన్ (Concussion) వల్ల వస్తాయి. అంటే, మెదడులో చిన్నపాటి కుదుపు లాంటిది అన్నమాట. ఈ లక్షణాలు కొన్ని రోజుల్లో సాధారణంగా తగ్గిపోతాయి. కానీ, ఇవి తగ్గుముఖం పట్టకపోగా, మరింత పెరుగుతుంటే మాత్రం ఇది ప్రమాదానికి సంకేతం కావచ్చు.

తల గాయం(Head injury) తర్వాత మీరు తప్పనిసరిగా గమనించాల్సిన కొన్ని అత్యవసర లక్షణాలు (రెడ్ ఫ్లాగ్స్) కొన్ని ఉంటాయి. తీవ్రమైన వాంతులు అంటే ఒకటి రెండు సార్లు కాకుండా, పదే పదే వాంతులు కావడం, సాధారణంగా వచ్చే తల తిరుగుడు కాకుండా, కళ్లు ఎక్కువగా తిరగడం ఉంటాయి.

స్పష్టంగా మాట్లాడలేకపోవడం అంటే మాట తడబడటం, లేదా మాటలు సరిగా పలకలేకపోవడం అలాగే అధిక నిద్ర, స్పృహ కోల్పోవడం కనిపిస్తాయి. ఎంత పిలిచినా స్పందించకపోవడం, నిద్రపోయిన మనిషిని లేపలేకపోవడం ఉంటాయి.

Head injury
Head injury

చేతులు, కాళ్లలో బలహీనతగా మారతాయి. ఒక చెయ్యి లేదా కాలు బలహీనంగా మారడం, లేదా అవి సరిగా పనిచేయకపోవడం కనిపిస్తాయి. ఎక్కడున్నామో, ఏమి మాట్లాడుతున్నామో తెలియకపోవడం, లేదా ఇటీవల జరిగిన విషయాలను మర్చిపోవడం.

ఈ లక్షణాలు కనిపించడానికి కారణం, తలకు గాయం(Head injury) అయినా కూడా లోపల హెమటోమా (Hematoma), అంటే మెదడులో రక్తస్రావం జరగడం. ఇది చిన్న గాయంతోనే జరగొచ్చు. బయటికి కనిపించని ఈ రక్తస్రావం మెదడుపై ఒత్తిడి పెంచుతుంది. అందుకే గాయం అయిన తర్వాత మొదటి 24 నుంచి 72 గంటలు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో లక్షణాలు మారాయేమో, లేదా పెరిగాయేమో నిరంతరం గమనిస్తుండాలి. ఎందుకంటే, మెదడులో రక్తస్రావం నెమ్మదిగా జరగవచ్చు.

Health: మైండ్‌ఫుల్‌నెస్, ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం మీ చేతుల్లోనే!

తల గాయం(Head injury) తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే..ఆహారం, నీరు, మందులు సరిగా తీసుకోండి. ఎక్కువ నిద్ర వస్తే, నిద్రలో ఉన్న వ్యక్తి స్పృహలో ఉన్నాడా లేదా అని అప్పుడప్పుడు లేపి మాట్లాడి చూడాలి . పైన చెప్పిన ఏ లక్షణం కనిపించినా, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. అవసరాన్ని బట్టి డాక్టర్లు సీటీ స్కాన్ లేదా ఇతర పరీక్షలు చేసి సమస్యను గుర్తిస్తారు. తల గాయం చిన్నదని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. మన ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button