HealthJust LifestyleLatest News
Amla seeds: ఉసిరి గింజలు పడేస్తున్నారా? అయితే ఈ ప్రయోజనాలు మిస్ అవుతున్నట్లే..
Amla seeds: ఉసిరి గింజల్లో విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాలు మన శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా, వివిధ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.

Amla seeds
ఉసిరి కాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలుసు. అయితే ఉసిరిని తిన్నాక దాని గింజలను చాలా మంది పడేస్తారు. కానీ, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉసిరి గింజలలో కూడా అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వాటిని తినడం వల్ల మన శరీరం అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందుతుంది.
మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఉసిరి గింజ(amla seeds)ల్లో విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాలు మన శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా, వివిధ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.

- ఉసిరి గింజల(amla seeds)ను పొడిగా చేసి ప్రతిరోజూ తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను నివారించడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ ఉసిరి గింజల పొడిని కలుపుకొని తాగితే జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది.
- ఉసిరి గింజల(amla seeds) పొడిలో కొద్దిగా తేనె కలిపి ఉదయాన్నే తీసుకుంటే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది జీవక్రియను వేగవంతం చేసి, అనవసరమైన కొవ్వును కరిగిస్తుంది.
- ఉసిరి గింజల పొడి వెక్కిళ్లను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తున్నప్పుడు కొంచెం ఈ పొడిని తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
- ఉసిరి గింజల పొడిని క్రమం తప్పకుండా తీసుకుంటే నిద్రలేమి సమస్య దూరమవుతుంది. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి మరియు మంచి నిద్రను పొందడానికి సహాయపడుతుంది.
- ఉసిరి గింజల పేస్ట్‌ను కంటి కింద రాసుకోవడం వల్ల కళ్ల కింద ఏర్పడే నల్ల వలయాలు తగ్గుతాయి. అంతేకాకుండా, ఇది చర్మాన్ని తాజాగా ఉంచి, ముఖానికి ఒక కొత్త కాంతిని ఇస్తుంది. ఈ పేస్ట్‌ను ముఖంపై రాసుకుంటే మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి.
- జుట్టు రాలడం సమస్య ఉన్నవారు ఉసిరి గింజల పొడిని పెరుగులో కలిపి తలకు ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.
- శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ముక్కు నుంచి రక్తం కారే సమస్య కొందరిలో కనిపిస్తుంది. ఉసిరి గింజల పేస్ట్‌ను ముక్కుపై అప్లై చేయడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఉసిరి గింజలు ఒక సాధారణ వ్యర్థ పదార్థంలా అనిపించినా, వాటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అందుకే ఉసిరి కాయ తిన్న తర్వాత దాని గింజలను పడేయకుండా, వాటిని పొడిగా చేసి లేదా పేస్ట్ రూపంలో ఉపయోగించుకోవడం మంచిది.