HealthJust LifestyleLatest News

Hyperactive: మీ పిల్లలు హైపర్ యాక్టివ్‌గా ఉన్నారా.. డాక్టర్లు ఏం చెబుతున్నారు?

Hyperactive: ADHD అనేది మెదడు పనితీరులో వచ్చే తేడాల వల్ల ఉత్పన్నమయ్యే ఒక దీర్ఘకాలిక సమస్య. దీని ప్రధాన లక్షణాలు మూడు రకాలుగా ఉంటాయి.

Hyperactive

ఇప్పుడు చాలామంది పిల్లలు చాలా చలాకీగా యాక్టివ్‌గా ఉంటున్నారు. అయితే జాగ్రత్తగా గమనిస్తే అది హైపర్ యాక్టివిటీ అని అర్ధం అవుతుంది. పిల్లల్లో కనిపించే అతి చురుకుదనం లేదా హైపర్‌యాక్టివిటీ అనేది కేవలం అల్లరితనం కాదు. ఇది తరచుగా అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్ (Attention-Deficit/Hyperactivity Disorder – ADHD) అనే న్యూరోడెవలప్‌మెంటల్ పరిస్థితిలో భాగం కావచ్చని అంటున్నారు డాక్టర్లు. ADHD అనేది మెదడు పనితీరులో వచ్చే తేడాల వల్ల ఉత్పన్నమయ్యే ఒక దీర్ఘకాలిక సమస్య.

దీని ప్రధాన లక్షణాలు మూడు రకాలుగా ఉంటాయి.

ఆవేశపూరిత ప్రవర్తన (Impulsivity)..ఆలోచించకుండా మాట్లాడటం , దూకుడుగా పనులు చేయడం, తమ వంతు వచ్చే వరకు వేచి ఉండలేకపోవడం.

అశ్రద్ధ (Inattention).. ఏకాగ్రత లోపించడం,సూచనలను సరిగా పాటించకపోవడం, పనులు పూర్తి చేయడంలో ఇబ్బంది పడటం.

అతి చురుకుదనం (Hyperactivity).. అతిగా కదలడం, ఒకే చోట కూర్చోలేకపోవడం, నిశ్శబ్దంగా ఉండటంలో ఇబ్బంది పడటం.

సాధారణంగా, ఈ లక్షణాలు ఏడు సంవత్సరాల కంటే ముందుగా ప్రారంభమవుతాయి. పిల్లల రోజువారీ జీవితం, పాఠశాల , సామాజిక సంబంధాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ఇలాంటి లక్షణాలున్న పిల్లలను “హైపర్‌యాక్టివ్(Hyperactive) చిల్డ్రన్” లేదా వైద్య పరిభాషలో “ADHD ఉన్న పిల్లలు” అని అంటారు.

Hyperactive
Hyperactive

కరోనా మహమ్మారి తర్వాత పుట్టిన లేదా చిన్నతనంలో ఉన్న చాలా మంది పిల్లల్లో హైపర్‌యాక్టివిటీ(Hyperactive) లక్షణాలు పెరుగుతున్నాయని చాలామంది డాక్టర్లు చెబుతున్నారు. దీనికి కారణం, వారు పుట్టడం లేదా పెరగడం వల్ల కాదు, కానీ పుట్టడానికి ముందు తల్లి గర్భంలో కానీ, పుట్టిన తర్వాత వారిపై పడిన పర్యావరణ, మానసిక ఒత్తిడి (Environmental and Psychological Stressors) అంటున్నారు.

గర్భధారణ సమయంలో ఒత్తిడి.. కోవిడ్-19 సమయంలో తల్లులు అనుభవించిన మానసిక ఒత్తిడి, ఆందోళన (Anxiety), సామాజిక ఒంటరితనం, నిద్ర లేమి వంటివి శిశువు మెదడు అభివృద్ధిపై పరోక్షంగా ప్రభావం చూపి ఉండొచ్చు.

స్క్రీన్ టైమ్ పెరుగుదల.. తల్లిదండ్రులు ఇంటి నుంచి పనిచేయడం వల్ల, చాలా మంది పిల్లలకు చిన్న వయస్సులోనే ఎక్కువ స్క్రీన్ టైమ్ అలవాటయింది.ఇది వారి ఏకాగ్రత సామర్థ్యం , ప్రవర్తనపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇవన్నీ కలిసి, పిల్లల్లో ADHD లేదా ADHD వంటి లక్షణాలను (Hyperactive traits) పెంచడానికి దోహదపడాయి.

ADHD నిర్ధారణ అనేది సాధారణంగా పిల్లలకు నాలుగు నుంచి ఏడు సంవత్సరాల వయస్సు మధ్య జరుగుతుంది. అయితే, లక్షణాలను గుర్తించడం మూడు లేదా అంతకంటే చిన్న వయస్సు నుంచే ప్రారంభమవుతుంది.

3-5 సంవత్సరాలు (ప్రీ-స్కూల్).. ఈ వయసులో, ముఖ్యంగా బిహేవియరల్ థెరపీ (Behavioral Therapy) , తల్లిదండ్రుల శిక్షణ (Parent Training) సిఫార్సు చేయబడుతుంది. మందుల వాడకం సాధారణంగా చివరి ప్రయత్నంగా మాత్రమే సూచిస్తారు.

6 సంవత్సరాలు ఆపైన (స్కూల్ ఏజ్).. ఈ వయసులో, మెడిసిన్ (Medication)తో పాటు బిహేవియరల్ చికిత్స రెండింటి కలయికతో కూడిన ట్రీట్మెంట్ (Comprehensive Treatment Plan)ను డాక్టర్లు సిఫార్సు చేస్తారు.

ADHDకి కచ్చితమైన నివారణ లేదు, కానీ సరైన చికిత్స ద్వారా పిల్లలను ‘నార్మల్ పిల్లలుగా’ మార్చడం లేదా వారి లక్షణాలను అదుపులోకి తీసుకురావడం పూర్తిగా సాధ్యమవుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

డాక్టర్లు సిఫార్సు చేసే చికిత్స మరియు నిర్వహణ విధానాలు:

బిహేవియరల్ థెరపీ.. ఇది పిల్లలు తమ ప్రవర్తనను కంట్రోల్ చేసుకోవడానికి, సామాజిక నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి సహాయపడుతుంది. ఇందులో రివార్డు వ్యవస్థలు, స్పష్టమైన నియమాలు, డైలీ రొటీన్ పాటించడం వంటివి ఉంటాయి.

మెడికేషన్..మెదడులోని రసాయన సమతుల్యతను మెరుగుపరచడానికి స్టిమ్యులెంట్స్ లేదా నాన్-స్టిమ్యులెంట్ మందులు వాడతారు. ఈ మందులను కచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి.

పిల్లల ప్రవర్తనను సమర్థవంతంగా ఎలా నిర్వహించాలి, వారితో ఎలా వ్యవహరించాలి అనేదానిపై తల్లిదండ్రులకు కూడా ట్రైనింగ్ ఇస్తారు.

టీచర్ల సహకారం, ప్రత్యేకమైన సీటింగ్‌ ఏర్పాటు, పనిని చిన్న భాగాలుగా విభజించడం వంటి పద్ధతులు సహాయపడతాయి.

హైపర్‌యాక్టివ్ (Hyperactive)పిల్లలను నిర్వహించడంలో పెద్దల పాత్ర చాలా కీలకం. ప్రేమ,సహనం, స్థిరత్వం అనే మూడు అంశాలు ఇక్కడ ప్రధానం. పిల్లలు తప్పులు చేసినప్పుడు వాటిని పట్టించుకోకుండా..వారు చిన్న చిన్న విజయాలు సాధించినప్పుడు మాత్రం వెంటనే వారిని పొగడాలి, ప్రోత్సహించాలి.

పిల్లలకు ప్రతి రోజు స్థిరమైన నిద్ర, ఆహారం, ఆట సమయాన్ని పాటించే కచ్చితమైన దినచర్యను ఏర్పాటు చేయాలి. ఇది వారి మెదడుకు భద్రతా భావాన్ని ఇస్తుంది.

పిల్లలు తమ శక్తిని ఖర్చు చేయడానికి రోజువారీగా కనీసం 60 నిమిషాలు వ్యాయామం, ఆటలు ఆడించాలి. మొబైల్ ఫోన్లు, టాబ్లెట్‌లు ,టీవీని చూడటాన్ని రోజుకు ఒక గంటకు మించకుండా కంట్రోల్ చేయాలి.ఏదైనా పని చెప్పేటప్పుడు, ఒకేసారి ఒకే సూచనను, స్పష్టంగా, చిన్న వాక్యంతో వివరంగా చెప్పాలి.

ADHD అనేది ఒక సవాలుతో కూడిన ప్రయాణం అయినా కూడా, సరైన ట్రీట్మెంట్, కుటుంబ సపోర్ట్ ,ప్రవర్తనా మార్పులతో ఈ పిల్లలు నార్మల్ పిల్లలుగా మారతారు.

Sri Rama:శ్రీరాముడి ధర్మం, శ్రీకృష్ణుడి వ్యూహం.. కార్పొరేట్ ప్రపంచంలో వీరే మార్గదర్శకత్వం

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button