Cherries: చెర్రీస్‌తో మధుమేహం, నిద్రలేమికి చెక్ పెట్టొచ్చట..
Cherries: డయాబెటిక్ రోగులకు పండ్ల వినియోగం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాంటి వారి కోసం ఎర్రటి చెర్రీస్ అద్భుతమైన పండు.

Cherries
మధుమేహ (Diabetes) వ్యాధిగ్రస్తులు తమ ఆహారాన్ని చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. ఆహారంలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (Glycemic Index) ఉన్న పదార్థాలు, చక్కెర నియంత్రణలో ఉన్న వాటిని మాత్రమే తీసుకోవడం చేస్తుంటారు. డయాబెటిక్ రోగులకు పండ్ల వినియోగం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాంటి వారి కోసం ఎర్రటి చెర్రీస్ అద్భుతమైన పండు. షుగర్ నియంత్రణకు చెర్రీస్ తీసుకోవడం చాలా మేలు చేస్తుంది.
చెర్రీస్(cherries)లోని పోషకాలు, ప్రయోజనాలు: చెర్రీని శృంగార పండ్లలో ఒకటిగా పరిగణించే ఈ పండులో శరీరానికి మేలు చేసే థయామిన్, రిబోఫ్లావిన్, విటమిన్ ఎ, బి, సి, కె, ఇ, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా:

మధుమేహం నియంత్రణ..చెర్రీస్(cherries)లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండడం వల్ల ఇవి రక్తంలో షుగర్ నియంత్రణలో బాగా సహాయపడతాయి. USDA తాజా పరిశోధనల ప్రకారం, ఒక కప్పు చెర్రీస్‌లో కేవలం 52 కేలరీలు, 12.5 గ్రాముల పిండి పదార్థాలు మాత్రమే ఉంటాయి. మధుమేహ బాధితులు వీటిని తీసుకుంటే వారి రోగనిరోధక శక్తి (Immunity) పెరుగుతుంది.
జీర్ణక్రియకు మేలు.. ఫైబర్ అధికంగా ఉండే చెర్రీస్ సులభంగా జీర్ణమవుతాయి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. వీటితో మలబద్ధకం (Constipation) సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు.
నిద్రలేమి సమస్యకు పరిష్కారం.. రాత్రి సరిగా నిద్రపోని వారు, పడుకునే ముందు చెర్రీస్ తినడం మంచిది. చెర్రీస్‌లో సహజసిద్ధంగా ఉండే మెలటోనిన్ (Melatonin) అనే హార్మోన్ అధికంగా ఉంటుంది. ఈ మెలటోనిన్ నిద్రలేమి (Insomnia) సమస్యలను దూరం చేసి, మంచి నిద్ర పట్టేందుకు సహాయపడుతుంది.
వ్యాధుల నివారణ.. విటమిన్ సి పుష్కలంగా ఉండే చెర్రీస్ తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి.
Asteroid :భూమిపై జీవం పుట్టుకకు కీలకం ..బెన్యూ గ్రహశకలం నమూనాల్లో కార్బన్, నీటి మాలిక్యూల్స్ గుర్తింపు