Eat More: టెన్షన్‌లో ఉన్నప్పుడు ఎక్కువగా తింటున్నారా? మీ ఎమోషన్స్ కి, ఆకలికి ఉన్న లింక్ ఇదే!
Eat More: నిజానికి మనం తినే ఆహారంలో సగం కంటే ఎక్కువ మన ఆకలి కోసం కాదు, మన భావోద్వేగాల కోసం తింటాం.
Eat More
మనం ఎందుకు తింటాం(Eat More)? ఈ ప్రశ్నకు సమాధానం ‘ఆకలి వేసినప్పుడు’ అని అంతా చెబుతారు. కానీ నిజానికి మనం తినే ఆహారంలో సగం కంటే ఎక్కువ మన ఆకలి కోసం కాదని మన భావోద్వేగాల కోసం తింటాం అని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఆహారానికి , మన మెదడుకు మధ్య ఉన్న ఈ విడదీయరాని సంబంధాన్ని అధ్యయనం చేయడమే ‘ఫుడ్ సైకాలజీ’.అంటున్నారు.
మనం ఏ ఆహారాన్ని ఎంచుకుంటున్నాం, ఎంత తింటున్నాం, ఏ సమయంలో తింటున్నాం అనే విషయాలు మన మానసిక స్థితిని ప్రతిబింబిస్తాయట. అందుకే ఒక్కోసారి మన కడుపు నిండా(Eat More) ఉన్నా, మన మనసు మాత్రం ఏదో ఒకటి తినమని మనల్ని ప్రోత్సహిస్తుంది. దీన్నే ‘ఎమోషనల్ ఈటింగ్’ అంటారు.
మీకు ఎప్పుడైనా గమనించారా? బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా ఆందోళనగా ఉన్నప్పుడు ఐస్‌క్రీమ్, చాక్లెట్లు లేదా చిప్స్ వంటి జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది. దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉందని అంటున్నారు నిపుణులు.
మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు శరీరంలో ‘కోర్టిసాల్’ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది మనల్ని తీపి , కొవ్వు పదార్థాల వైపు మళ్లిస్తుంది.. ఈ పదార్థాలు తిన్నప్పుడు మెదడులో ‘డోపమైన్’ అనే హ్యాపీ హార్మోన్ విడుదలయ్యి, మనకు తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తుంది. అందుకే దీన్ని ‘కంఫర్ట్ ఫుడ్’ అంటారు. అయితే ఇది ఒక అలవాటుగా మారితే, అది ఊబకాయం , ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

కేవలం మన భావోద్వేగాలే కాదు, మనం తినే ప్లేట్ రంగు, సైజు , ఆహారం కనిపించే తీరు సైతం మన సైకాలజీని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు, పెద్ద ప్లేట్‌లో తక్కువ ఆహారం పెట్టుకుంటే మన మెదడుకు అది సరిపోదని అనిపిస్తుంది. అదే చిన్న ప్లేట్ నిండా ఆహారం ఉంటే, తక్కువ తిన్నా మన కడుపు నిండినట్లు మెదడు సంకేతాలు పంపిస్తుంది.
అలాగే మనం టీవీ చూస్తూ లేదా ఫోన్ చూస్తూ తిన్నప్పుడు మన మెదడు ఆహారం మీద దృష్టి పెట్టదు. దీనివల్ల కడుపు నిండింద(Eat More)నే సిగ్నల్ మెదడుకు అందక, మనం అవసరానికి మించి ఎక్కువగా తినేస్తాం (Mindless Eating). అందుకే మన పెద్దలు అన్నం తినేటప్పుడు మాటలు వద్దని, కేవలం భోజనం మీద దృష్టి పెట్టాలని చెబుతుంటారు.
ఆకలికి, ఆశకు (Cravings) మధ్య ఉన్న తేడాను గుర్తించడం ఫుడ్ సైకాలజీలో చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. నిజమైన ఆకలి మెల్లగా మొదలవుతుంది, ఏ ఆహారం తిన్నా తీరుతుంది. కానీ ఎమోషనల్ ఆకలి అకస్మాత్తుగా వస్తుంది .. దానికి నిర్దిష్టంగా పిజ్జా లేదా చాక్లెట్ మాత్రమే కావాలనిపిస్తుంది. ఈ తేడాను గమనించినప్పుడు మనం మన ఆహారపు అలవాట్లను కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే, చిన్నప్పుడు మనకు ఇష్టమైన వారు ప్రేమతో తినిపించిన పదార్థాలు మనకు పెద్దయ్యాక కూడా ఒక భద్రతా భావాన్ని ఇస్తాయి. అందుకే బాధలో ఉన్నప్పుడు చాలామందికి అమ్మ చేసిన వంట తినాలనిపిస్తుంది.
చివరిగా మనం తినే ప్రతి ముద్ద వెనుక ఒక ఆలోచన ఉంటుంది. మన ఆకలిని మనమే నియంత్రించుకోవాలంటే ముందు మన మనసును అర్థం చేసుకోవాలి. “నేను ఇప్పుడు ఆకలితో తింటున్నానా? లేక బోర్ కొట్టి తింటున్నానా?” అని ఒక్క నిమిషం ఆలోచిస్తే చాలు
మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. ఆహారం అనేది కేవలం కడుపు నింపే ఇంధనం మాత్రమే కాదు, అది మన మనసుతో ముడిపడి ఉన్న ఒక అనుభూతి అని గుర్తు పెట్టుకోవాలి. ఆ అనుభూతిని స్పృహతో ఆస్వాదించినప్పుడే మనకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.



