Dark circles: డార్క్ సర్కిల్స్‌కు గుడ్ బై..సింపుల్ చిట్కాలు చాలు
Dark circles: నిద్ర, జీవనశైలి..నల్లటి వలయాలకు ప్రధాన కారణం నిద్రలేమి. అందుకే రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం.

Dark circles
కళ్ల కింద నల్లటి వలయాలు (డార్క్ సర్కిల్స్) వస్తే, ఎంత ఫ్రెష్‌గా ఉన్నా అలసటగా, అనారోగ్యంగా కనిపిస్తారు. దీనికి కారణాలు సరైన నిద్ర లేకపోవడం, స్ట్రెస్, పోషకాహార లోపం, వయసు పెరగడం. ఈ సమస్యకు పరిష్కారాలు చాలా సులభంగా ఉంటాయి.
నిద్ర, జీవనశైలి..నల్లటి వలయాలకు ప్రధాన కారణం నిద్రలేమి. అందుకే రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. నిద్రలో మన శరీరం, చర్మం రిపేర్ అవుతాయి. అలాగే, ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి.
దోసకాయ ముక్కలు.. దోసకాయలో ఉండే కూలింగ్ ఎఫెక్ట్, వాపును తగ్గిస్తుంది. దోసకాయ ముక్కలను కళ్లపై 15 నిమిషాలు ఉంచుకోవడం వల్ల కళ్ల చుట్టూ ఉన్న భాగం చల్లబడి, నల్లటి వలయాలు తగ్గుతాయి.

బంగాళాదుంప.. బంగాళాదుంపలో ఉండే సహజ బ్లీచింగ్ ఏజెంట్ కళ్ల కింద నలుపును తగ్గిస్తుంది. బంగాళాదుంప రసాన్ని దూది సహాయంతో అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
ఉపయోగించిన టీ బ్యాగ్స్.. గ్రీన్ టీ లేదా కామోమైల్ టీ బ్యాగ్స్‌ను ఫ్రిజ్‌లో చల్లబరిచి కళ్లపై పెట్టుకుంటే, అవి రక్త ప్రసరణను మెరుగుపరిచి, నలుపును తగ్గిస్తాయి.
విటమిన్-కె, విటమిన్-ఈ ఉన్న ఆహారం (ఆకుకూరలు, బాదం) తీసుకోవడం వల్ల కళ్ల చుట్టూ ఉండే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
ఎక్కువ కెఫీన్, ఆల్కహాల్, ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. కంప్యూటర్, ఫోన్ స్క్రీన్‌లకు ఎక్కువ సమయం కేటాయించినప్పుడు మధ్యమధ్యలో కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే,డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి, మీ కళ్లు మరింత తాజాగా, అందంగా కనిపిస్తాయి.