HealthJust LifestyleLatest News

Rice Starch:పారబోసే గంజి పది రోగాలకు మందు.. పూర్వీకుల బలం వెనుక ఉన్న సీక్రెట్ ఇదే

Rice Starch: ఇప్పటి తరానికి అసలు గంజి అంటే ఏంటో కూడా తెలీని పరిస్థితి కనిపిస్తోంది.

Rice Starch

ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా అందరూ ప్రెజర్ కుక్కర్లతోనే రైస్ వండుతున్నారు. బియ్యం కడిగి కుక్కర్‌లో పెడితే ..అన్నం తయారవుతుంది కానీ, అందులోని అసలైన పోషక విలువలు గంజి రూపంలో ఏ మాత్రం బయటకు రావు. పూర్వం అన్నం వార్చినప్పుడు వచ్చే ఆ గంజిని అమృతంతో సమానంగా భావించేవారు. ఇప్పటి తరానికి అసలు గంజి అంటే ఏంటో కూడా తెలీని పరిస్థితి కనిపిస్తోంది.

పూర్వకాలంలో వండినట్లుగా ..అన్నం వండిన తర్వాత వార్చిన ఆ వేడి వేడి గంజి(Rice Starch)లో కాస్త ఉప్పు, నిమ్మరసం కలుపుకుని తాగితే.. వచ్చే ఆ రుచి, ఆరోగ్యం మరే డ్రింక్‌లోనూ దొరకవు. మన తాతలు, ముత్తాతలు, అమ్మమ్మలు వందేళ్ల వరకు బలంగా ఉండటానికి అప్పట్లో వాళ్లు తాగిన ఈ గంజి నీళ్లే కారణం. ఇందులో బి, సి, ఇ విటమిన్లతో పాటు శరీరానికి అవసరమైన ఖనిజాలు ఎన్నో ఉంటాయి.

ఇంకా చెప్పాలంటే గంజి(Rice Starch) నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో మాటల్లో చెప్పలేం. ముఖ్యంగా ఈ గంజి జీర్ణ సంబంధిత సమస్యలకు ఒక దివ్యౌషధం. ఎవరైనా కడుపునొప్పితో కానీ, విరేచనాలతో కానీ ఇబ్బంది పడుతుంటే ఒక చిన్న గ్లాసు గంజి తాగితే వెంటనే రిలీఫ్ వస్తుంది. గంజిలో ఉండే పిండి పదార్థం పొట్టలో బైండింగ్ ఏజెంట్‌గా పనిచేసి ఈ పొట్టనొప్పి, విరేచనాలను అరికడుతుంది.

దీనిలో ఉండే ఎలక్ట్రోలైట్స్ సమతుల్యతను కాపాడటం ద్వారా బాడీకి డీహైడ్రేషన్, అలసట కలగకుండా చూస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఎంతో మంచిది. గంజి తాగడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు, పైగా ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు కంట్రోల్‌లో ఉంటుంది.

Rice Starch
Rice Starch

మహిళలకు , పసిపిల్లలకు కూడా గంజి ఒక సంజీవనిలా పనిచేస్తుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పులను తగ్గించడంలోనూ గంజిలోని రిలాక్సింగ్ గుణాలు బాగా ఉపయోగపడతాయి. అలాగే పాలు సరిగ్గా తాగని చిన్న పిల్లలకు గంజి నీటిని తాగించడం వల్ల.. వారికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలను తిరిగి పొందొచ్చు. అనారోగ్యంతో నీరసించిన వారికి గంజి నీళ్లు ఇస్తే వెంటనే శక్తి వస్తుంది.

అంతేకాకుండా అన్నాన్ని వార్చి వండడం వల్ల …దానిలోని అధిక పిండి పదార్థం బయటకు పోయి డయాబెటిస్ వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే కుక్కర్లను పక్కన పెట్టేయండి. బయట మార్కెట్లలో గంజి వార్చే పాత్రలు కూడా దొరుకుతున్నాయి. దీంతో ఈజీగా గంజిని వార్చుకోవచ్చు. అన్నాన్ని వార్చి ఆ గంజిని తాగే పాత అలవాటును మళ్లీ మొదలు పెట్టి మీ ఆరోగ్యానికి మీరే కాపాడుకోండి.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button