Solar Roof Top: సోలార్ రూఫ్ టాప్ ..కరెంట్ బిల్లుల భారం నుంచి విముక్తి వస్తుందా?
Solar Roof Top: ప్రభుత్వం మూడు కిలోవాట్ల వరకు సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకునే వారికి ..గరిష్టంగా 78 వేల రూపాయల వరకు సబ్సిడీని డైరక్టుగా మీ బ్యాంకు అకౌంట్‌లోనే జమ చేస్తుంది.
Solar Roof Top
మిడిల్ క్లాస్ కుటుంబాలకు నిత్యావసరాలే కాదు.. ప్రతి నెలా వచ్చే కరెంట్ బిల్లు ఒక పెద్ద భారంగానే మారుతోంది. వేసవి కాలం వచ్చిందంటే చాలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్స్ వాడకం పెరిగి బిల్లులు తడిసి మోపెడవుతుంటాయి. వేలల్లో వస్తున్న కరెంటు బిల్లులు కట్టలేక నానా తంటాలు పడుతుంటారు. అయితే ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ యోజన ఒక గొప్ప వరమని చెప్పొచ్చు.
పీఎం సూర్య ఘర్ పథకం కింద మీ ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్(Solar Roof Top) కనుక ఏర్పాటు చేసుకుంటే.. నెలకు దాదాపు మూడు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును పొందొచ్చు. దీనివల్ల మధ్యతరగతి ఇళ్లకు కరెంట్ బిల్లుల నుంచి శాశ్వత విముక్తి లభించినట్లే అవుతుంది. కేంద్ర ప్రభుత్వం మూడు కిలోవాట్ల వరకు సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకునే వారికి ..గరిష్టంగా 78 వేల రూపాయల వరకు సబ్సిడీని డైరక్టుగా మీ బ్యాంకు అకౌంట్‌లోనే జమ చేస్తుంది.
చాలామంది సోలార్ రూఫ్ టాప్ (Solar Roof Top)ఏర్పాటు చేసుకోవడానికి అయ్యే ఖర్చు చూసి ముందే భయపడి వెనకడుగు వేస్తుంటారు. కానీ సబ్సిడీ పోను మిగిలిన మొత్తాన్ని ఒక ఇన్వెస్ట్‌మెంట్‌గా భావిస్తే, అది కేవలం 3,4 ఏళ్లలోనే మనకు ఆదా అయిన కరెంట్ బిల్లుల రూపంలో ఆ డబ్బులు తిరిగి వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇరవై ఐదు ఏళ్ల పాటు కరెంట్ బిల్ ఖర్చు లేకుండా హాయిగా ఉండొచ్చు.

సోలార్ ప్యానెల్స్ వల్ల పర్యావరణానికి మంచి జరగడమే కాకుండా, మీ ఇంటి విలువ కూడా బాగా పెరుగుతుంది. పైగా పగటిపూట తయారైన ఎక్స్‌ట్రా పవర్‌ను మీరు గ్రిడ్‌కు పంపడం ద్వారా తిరిగి గవర్నమెంటుకే కరెంటును విక్రయించవచ్చు. దీనివల్ల బిల్లు సున్నా అవ్వడమే కాకుండా అదనపు ఇన్కమ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ప్రతీ మిడిల్ క్లాస్ ఇల్లు సోలార్ వైపు అడుగులు వేస్తే మంచిది. దీని కోసం గవర్నమెంట్ అపీషియల్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించింది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



