HealthJust LifestyleLatest News

Nutritional deficiency:ఈ లక్షణాలు కనిపిస్తే మీలో పోషకాహార లోపం ఉన్నట్లే!

Nutritional deficiency:మన శరీరం కొన్ని స్పష్టమైన సంకేతాల ద్వారా పోషకాహార లోపాలను తెలియజేస్తుంది. వాటిని ముందుగానే గుర్తించి, సరైన చర్యలు తీసుకోవడం ద్వారా మనం అనారోగ్యాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

Nutritional deficiency

మన శరీరం ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండాలంటే విటమిన్లు, మినరల్స్ చాలా అవసరం. శరీరానికి తగినంత పోషణ(Nutritional deficiency) లభించకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే, మన శరీరం కొన్ని స్పష్టమైన సంకేతాల ద్వారా పోషకాహార లోపాలను తెలియజేస్తుంది. వాటిని ముందుగానే గుర్తించి, సరైన చర్యలు తీసుకోవడం ద్వారా మనం అనారోగ్యాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. వైద్య నిపుణులు చెప్పిన కొన్ని సంకేతాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

గొంతు వాపు లేదా మెడ భాగం ఉబ్బినట్లు అనిపిస్తే అది హైపో థైరాయిడిజమ్ సమస్యకు సంకేతం. దీనికి ప్రధాన కారణం అయోడిన్ లోపమే. అయోడిన్ లోపం థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రభావితం చేస్తుంది. గోళ్ళపై తెల్లని మచ్చలు కనిపిస్తే, శరీరంలో జింక్ లోపించినట్లు భావించాలి. అదేవిధంగా, గోళ్లు మెత్తగా, బలహీనంగా మారి త్వరగా విరిగిపోతుంటే అది మెగ్నీషియం లోపానికి సూచన.

ముఖం ఎర్రగా మారడం, చర్మం పొరలుగా ఊడిపోవడం వంటివి విటమిన్ B2 లోపం వల్ల సంభవించవచ్చు. నుదురు మరియు ముక్కు చుట్టూ తరచుగా మొటిమలు వస్తుంటే అది విటమిన్ B6 లోపానికి సంకేతం కావచ్చు. నాలుక రంగు మారడం కూడా పోషకాహార లోపాన్ని సూచిస్తుంది. నాలుక పాలిపోయినట్లుగా, తెల్లగా ఉంటే ఐరన్ లోపం ఉన్నట్లు, ఎర్రని, నొప్పిగా ఉండే పుండ్లు ఏర్పడితే విటమిన్ B3 లోపం ఉందని అర్థం చేసుకోవాలి. నాలుక వాపు నొప్పిగా ఉంటే ఫోలిక్ యాసిడ్ లోపించినట్లు భావించాలి.

Nutritional deficiency
Nutritional deficiency

రాత్రిపూట లేదా వ్యాయామం చేసినప్పుడు కాలి పిక్కలు, మోకాలి కీళ్ళు పట్టుకుపోయినట్లు అనిపిస్తే, శరీరంలో మెగ్నీషియం స్థాయిలు తగ్గినట్లు గుర్తించాలి. అంతేకాకుండా, కళ్ళ కింద నల్లటి వలయాలు (డార్క్ సర్కిల్స్) ఏర్పడటం ఐరన్, విటమిన్ B12, విటమిన్ E , విటమిన్ K వంటి పోషకాల లోపానికి సంకేతం. కళ్లు ఎప్పుడూ అలసటగా, నిర్జీవంగా కనిపిస్తుంటే అది కూడా పోషకాహార లోపమే కావచ్చు.

ఈ సంకేతాలను గుర్తించినప్పుడు, రక్త పరీక్షల ద్వారా శరీరంలో లోపించిన పోషకాల(Nutritional deficiency) గురించి స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత, వైద్యుల సలహాతో సరైన ఆహారపు అలవాట్లు లేదా మందుల ద్వారా ఆ లోపాలను సరిచేసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button