Millet Snacks:మిల్లెట్ స్నాక్స్ తయారీ.. చిరుధాన్యాలతో చిన్నపాటి వ్యాపారం ఎంత లాభమో!
Millet Snacks: చిరుధాన్యాలతో స్నాక్స్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి లక్షల రూపాయల పెట్టుబడి అవసరం లేదు.
Millet Snacks
ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన రోజురోజుకు పెరుగుతుంది . అందుకే తమ ఆరోగ్యం కోసం బయట దొరికే జంక్ ఫుడ్ స్థానంలో పోషక విలువలున్న ఆహారం కోసం వెతుకుతున్నారు. దీనిలో భాగంగానే 2026లో ‘మిల్లెట్ స్నాక్స్’ (Millet Snacks) కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది.
రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాలతో స్నాక్స్(Millet Snacks) తయారు చేసి అమ్మడం ఇప్పుడు ఒక గొప్ప బిజినెస్ ఐడియాగా మారిందంటున్నారు మార్కెటింగ్ నిపుణులు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇదే పని చేస్తున్నా, ఇంటి వద్ద తయారు చేసే ‘హోమ్ మేడ్’ ఉత్పత్తులకే ప్రజలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు.

ముఖ్యంగా ఈ చిరుధాన్యాలతో స్నాక్స్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి లక్షల రూపాయల పెట్టుబడి అవసరం లేదు. కేవలం నాణ్యమైన చిరుధాన్యాలను సేకరించడం.. వాటితో మురుకులు, లడ్డూలు, బిస్కెట్లు లేదా హెల్త్ బార్స్ వంటివి తయారు చేయడం వంటి చేస్తే చాలు.ముందుగా తెలిసిన వారికి, చుట్టు పక్కల వారికి అలవాటు చేసి కొనేలా చేసుకోండి.తర్వాత మెల్లమెల్లగా పెద్ద పెద్ద షాపులకు సప్లై చేయండి. అయితే వాటిని ఆకర్షణీయమైన ప్యాకేజింగ్‌తో మార్కెట్లోకి తీసుకువస్తే ఇంకా త్వరగా కొంటారు.
ముఖ్యంగా షుగర్ పేషెంట్లు, బరువు తగ్గాలనుకునే వారు చిరుధాన్యాల స్నాక్స్ కోసం ఎగబడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా మార్కెటింగ్ చేసుకుంటూ, స్థానిక ఆర్గానిక్ స్టోర్స్ లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్స్ ద్వారా వీటిని విక్రయించొచ్చు. అయితే నాణ్యత , రుచిపై దృష్టి పెడితే, తక్కువ సమయంలోనే స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే అద్భుతమైన వ్యాపారం అవుతుంది.



