HealthJust LifestyleLatest News

Hangover: హ్యాంగోవర్‌ నుంచి తప్పించుకోవాలా? ఇంటి చిట్కాలివే..

Hangover: తల పట్టేసినట్లుగా ఉండటం, తలనొప్పి, వికారం, వాంతులు , ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు దీనిలో కనిపిస్తాయి.

Hangover

హ్యాంగోవర్(Hangover) అనేది రాత్రిపూట ఆల్కహాల్ అధికంగా తీసుకున్న తర్వాత ఉదయం ఎదురయ్యే ఒక అసౌకర్య పరిస్థితి. తల పట్టేసినట్లుగా ఉండటం, తలనొప్పి, వికారం, వాంతులు , ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు దీనిలో కనిపిస్తాయి. హ్యాంగోవర్ కారణంగా ఏ పనిపైనా దృష్టి పెట్టలేరు. అయితే, ఈ సమస్యను త్వరగా తగ్గించుకోవడానికి సహాయపడే కొన్ని శక్తివంతమైన ఇంటి చిట్కాలు (Home Remedies) ఉన్నాయి.

హ్యాంగోవర్ తగ్గించడానికి సహాయపడే శక్తివంతమైన పద్ధతులు..

  • టమోటా జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ,విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఆల్కహాల్ వలన శరీరంలో ఏర్పడిన వాపును (Inflammation) తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
  • ఇది కండరాల నొప్పులు, తలనొప్పి, వికారం/వాంతుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. టమోటాలో ఉండే పోషకాలు కాలేయాన్ని శుభ్రపరచడంలో కూడా సహాయపడతాయి.
  • వీరికి కొబ్బరి నీళ్లు (Coconut Water)అద్భుత ఔషధం. ఆల్కహాల్ వల్ల శరీరం కోల్పోయిన కీలకమైన ఎలక్ట్రోలైట్‌లను (Electrolytes) తిరిగి నింపడంలో కొబ్బరి నీళ్లు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.
  • ఇందులో పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఉదయం లేవగానే ఈ నీటిని తాగితే హ్యాంగోవర్ నుంచి త్వరగా బయటపడవచ్చు మరియు శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది.
Hangover
Hangover

కీరా నీళ్లు (Cucumber Water) తాగితే మంచిది. దోసకాయ ముక్కలను నీటిలో వేసి కొంత సమయం పాటు నానబెట్టి, ఆ నీటిని తాగాలి. కావాలంటే, ఇందులో కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. కీరాలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, అలాగే మెగ్నీషియం, పొటాషియం , ఎలక్ట్రోలైట్లు కూడా మెండుగా ఉంటాయి. ఇవి డీహైడ్రేషన్ లక్షణాల నుంచి ఉపశమనం అందిస్తాయి.

బచ్చలి కూర స్మూతీ (Spinach Smoothie) హ్యాంగోవర్‌కు బెస్ట్. బచ్చలి కూరను నీటితో కలిపి స్మూతీలా చేసుకుని తాగాలి. ఇది తాగడం వలన హ్యాంగోవర్ త్వరగా తగ్గుతుంది, ముఖ్యంగా శరీరానికి అవసరమైన బలాన్ని , విటమిన్లను అందించి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.

వికారం (Nausea) సమస్యతో బాధపడేవారికి అల్లం టీ అద్భుతంగా పనిచేస్తుంది. అల్లంలో ఉండే సహజ గుణాలు జీర్ణ వ్యవస్థను శాంతపరిచి, కడుపు తిప్పడం నుండి త్వరగా ఉపశమనం అందిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button