dogs : కుక్కలు రాత్రులు ఏడ్వటం అపశకునమా?
dogs : రాత్రివేళల్లో కుక్కలు ఒక రకంగా అరవడం, ఇంకా చెప్పాలంటే గుండెలు పగిలేలా ఏడ్చినట్లుగా అరవడం చాలాసార్లు వినిపిస్తుంది.

dogs : రాత్రివేళల్లో కుక్కలు ఒక రకంగా అరవడం, ఇంకా చెప్పాలంటే గుండెలు పగిలేలా ఏడ్చినట్లుగా అరవడం చాలాసార్లు వినిపిస్తుంది. వినడానికి భయంగా, హృదయ విదారకంగా ఉండటంతో చాలామందికి ఏదో తెలియని భయం పట్టుకుంటుంది. పెద్దలు చెప్పే మాటలు, నానుడులు ఈ భయాన్ని మరింత పెంచుతాయి. “కుక్కలు రాత్రిపూట తమ చుట్టూ ఆత్మలు కనిపిస్తే ఏడుస్తాయి”, “ఇంట్లో పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు ఏడిస్తే అశుభం”, “కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయి, మనుషులు చూడలేని నెగిటివ్ ఎనర్జీలను అవి చూడగలుగుతాయి” ఇలాంటి నమ్మకాలు(Myths) సమాజంలో బాగా పాతుకుపోయాయి.
dogs
అంతేకాదు, “రాత్రిళ్లు కుక్కలు ఏడిస్తే ఆ వీధిలోనో, లేదా వారి బంధువులు, స్నేహితుల్లో ఎవరైనా చనిపోతారు” అనే నమ్మకం చాలా మందిలో బలంగా ఉంటుంది. అయితే, దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాన్ని వెతికితే మాత్రం, ఈ విశ్వాసాలకు ఎలాంటి ఆధారమూ దొరకదు. కుక్కలు రాత్రిపూట ఎందుకు ఏడుస్తాయో తెలిస్తే ఎవరూ భయపడరని యానిమల్ డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. నిజానికి, దీని వెనుక ఎన్నో సాధారణ, శాస్త్రీయ కారణాలు(Scientific reasons) ఉన్నాయి
ముఖ్యంగా చలికాలంలో కుక్కలు(dogs) ఎక్కువగా ఏడుస్తుంటాయి. అవి తీవ్రమైన చలికి తట్టుకోలేక తమ బాధను ఏడుపు ద్వారా వ్యక్తపరుస్తాయి. కుక్కలు తమ ఏడుపు ద్వారా మిగిలిన కుక్కలకు సందేశాలను పంపడం కూడా ఒక కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది ఒక రకమైన కమ్యూనికేషన్ పద్ధతి.మనుషుల్లాగే కుక్కలకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. వాటికి కలిగే బాధ, కోపం, ఆవేదన, ఆందోళనను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాయి. ఈ భావోద్వేగాలను బయటపెట్టడానికే అవి ఏడుస్తుంటాయి. పగటిపూట గాయమైతే రాత్రిపూట ఎందుకు ఏడుస్తాయనే ప్రశ్నకు, చలికి రాత్రిపూట నొప్పి మరింత ఎక్కువ అవుతుంది. దాంతో ఆ నొప్పిని భరించలేక బిగ్గరగా ఏడవడం ప్రారంభిస్తాయి.
కేవలం దెబ్బల వల్లే కాదు, కుక్కలు బాగా ఆకలి(Hunger)తో ఉన్నప్పుడు కూడా ఏడుస్తాయి. శీతాకాలంలో రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వాటికి తినడానికి ఏమీ దొరకదు. అందుకే అవి ఆకలితో ఏడుస్తాయి. తమ పిల్లలు, లేదా తల్లి దూరమైనప్పుడు కుక్కలు ఏడుస్తుంటాయి. వీధి కుక్కలను వాటి గుంపు నుంచి కొన్ని కుక్కలను వేరు చేసినప్పుడు, లేదంటే పెంపుడు కుక్క దాని యజమాని నుంచి వేరైనప్పుడు కూడా అవి రాత్రిపూట బిగ్గరగా అరవడం, ఏడవడం చేస్తాయి. తమ ఒంటరితనాన్ని, ఆవేదనను మిగిలిన కుక్కలకు తెలియజేయడానికి కూడా కుక్కలు ఏడుస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు.వయస్సు పెరగడం వల్ల కూడా కుక్కలు ఆరోగ్య సమస్యలు, ఒంటరితనం, లేదా వినికిడి లోపాల వల్ల ఏడుస్తుంటాయి.
కుక్కలు ఏడిస్తే మనుషులు చనిపోతారన్న మాటల వెనుక ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు, పరిశోధకులు కచ్చితంగా చెబుతున్నారు. ఒకవేళ అలా జరిగినట్లు పెద్దలు కొన్ని ఉదాహరణలు చెప్పినా కూడా, అది కేవలం యాదృచ్ఛికం మాత్రమేనని, ఆయా సంఘటనలకు కుక్కల ఏడుపుతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు.
కాబట్టి, రాత్రిపూట కుక్కల ఏడుపు విని భయపడాల్సిన అవసరం లేదు. అవి తమ సహజమైన భావోద్వేగాలను, అవసరాలను వ్యక్తం చేయడానికి, లేదా తమ తోటి కుక్కలతో కమ్యూనికేట్ చేయడానికి అలా అరుస్తుంటాయి. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటే, అనవసరమైన భయాలను దూరం చేసుకోవచ్చు