Just LifestyleHealthLatest News

Expectations: నాకెవరూ లేరు..నన్నెవరూ పట్టించుకోవడం లేదు.. ఈ ఆలోచనలకు ముందు ఫుల్ స్టాప్ పెట్టండి

Expectations: నిజానికి మన బాధకు కారణం మనుషులు కాదు, వారిపై మనం పెంచుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రమే.

Expectations

మన జీవితంలో మనకు ఎవరైనా శత్రువు ఉన్నారంటే అది మన ఎక్స్‌పెక్టేషన్స్ (Expectations) మాత్రమే. అంటే మనం ఒకరికి సాయం చేసినప్పుడో లేదా ఒకరిని ప్రేమించినప్పుడు, వారు కూడా తిరిగి అలాగే ఉండాలని ఆశించడం. ఈ ప్రపంచంలో ఎవరి ఆలోచనా ధోరణి వారిది. మనకున్న సంస్కారం, మనకున్న మనస్తత్వం ఎదుటివారికి ఉండాలని లేదన్ననిజాన్ని అర్ధం చేసుకోవాలి.

అంతా బాగుంటే ఓకే కానీ.. కానీ వాళ్లకు నేను అప్పట్లో హెల్ప్ చేశాను, కానీ ఇప్పుడు వాళ్లు నన్నసలు పట్టించుకోవడం లేదని బాధపడ్డాం అంటే.. మన సంతోషం తాలూకు తాళం చెవులను ఎదుటివారి చేతిలో పెట్టినట్లే. ఈ ఎవరూ లేరు అనే ఫీలింగ్ మన దగ్గరకు రాకుండా ఉండాలంటే మనం కొన్ని నిజాలను అంగీకరించాలి.

ముందుగా అసలు ఎదుటివారు మనల్ని ఎందుకు పట్టించుకోవాలి? మన కాళ్లు, చేతులు బాగున్నాయి కదా, మనం స్వతంత్రంగా బతకగలం. అలాంటప్పుడు మన సంతోషం కోసం కూడా మరొకరి మీద ఆధారపడటం ఎందుకని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సైకాలజీలో దీనిని ఎమోషనల్ ఇండిపెండెన్స్ అంటారు. అంటే మన మూడ్, మన ప్రశాంతత కేవలం మన కంట్రో‌ల్‌లో మాత్రమే ఉండాలి. ఎవరి బతుకులు వాళ్లవి, ఎవరి పోరాటాలు వారివి అని తెలిసీ కూడా పక్కవాడు పలకరించలేదని దిగులు చెందడం వేస్ట్ అని తెలుసుకోవాలి.

సహాయం చేయి.. కానీ మర్చిపో అన్న సూత్రం ఫాలో అయిపోండి. ఎవరికైనా మీరు సాయం చేశారంటే అది మీ వ్యక్తిత్వం. అది మీకు చేతనైంది కాబట్టి చేశారు. అది అక్కడితో అయిపోయింది. దానిని ఒక పెట్టుబడిలా భావించి, భవిష్యత్తులో వారు తిరిగి ఏదో చేస్తారని ఆశించొద్దు. నేను వాళ్లకు సాయం చేశాను.. వాళ్లు ఆ రుణాన్ని తిరిగి తీర్చుకోవాలనే వ్యాపార దృక్పథం ఎలాంటి బంధాల్లోనూ ఉండకూడదు.

ఎక్స్‌పెక్టేషన్స్(Expectations) తగ్గించుకోవడం అన్నది మీ మనసుకు, మీకు మీరు ఇచ్చుకునే గిఫ్ట్ అనుకోండి. నిజానికి మన బాధకు కారణం మనుషులు కాదు, వారిపై మనం పెంచుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రమే. వాళ్లు మీ కోసం వస్తారని మీరు అనుకోకపోతే, వాళ్లు రాకపోయినా మీకు పెద్దగా బాధ కలగదు. ఒకవేళ వారే కనుక వస్తే అది ఒక సర్ప్రైజ్ వంటి సంతోషాన్నిస్తుంది అంతే.

అందుకే వీలయినంత వరకూ మీతో మీరు సమయం గడుపుకోండి. మీకు నచ్చిన పనిని చేసుకోండి, మీకు నచ్చిన పుస్తకం చదువుకోండి.. మీరు ఒకవేళ కనుక ఒంటరితనంగా ఫీలయితే దానినే ఒక ఏకాంతంలా మార్చుకోండి. ఎప్పుడైతే మీతో మీరు ఉండటాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తారో, అప్పుడు ప్రపంచం మొత్తం మిమ్మల్ని వదిలేసినా సరే మీకు ఏమీ అనిపించదన్న విషయం మీకే అర్ధం అవుతుంది.

Expectations
Expectations

మనుషుల స్వభావాన్ని అర్థం చేసుకోండి. మనుషులు సహజంగానే స్వార్థపరులు అయిఉంటారు. లేదంటే వారి వారి పనుల్లో వారు నిమగ్నమై ఉంటారు. ఇది వారి తప్పు కాదు, ఎందుకంటే వారికీ ఒక లైఫ్ ఉండాలని వారు కోరుకుంటారు . ఈ నిజాన్ని ఎంత త్వరగా అంగీకరిస్తే అంత ప్రశాంతత మీ సొంతమవుతుంది.

ప్రయారిటీ మార్చుకోవడం నేర్చుకోండి. మిమ్మల్ని పట్టించుకోని వారి గురించి ఆలోచించడం మానేసి.. మీ కోసం మీరు ఏం చేసుకోగలరు, మీ చుట్టూ ఉన్న చిన్న చిన్న సంతోషాలు ఏంటి అనే దానిపై దృష్టి పెట్టండి. ఇలా ఒక్కసారి మీ మైండ్ సెట్ మారితే, మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా ఆటోమేటిక్‌గా మారిపోతుంది.

ఈ ప్రపంచంలో ఎవరూ మీ కోసం పుట్టలేదు, మీరు ఎవరి కోసమో పుట్టలేదు. మీ ప్రయాణం మీదే. మీ బలం మీరే. ఎవరి దగ్గరో గుర్తింపు కోసం ఆరాటపడకుండా, మిమ్మల్ని మీరు ఒక ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకోండి. అప్పుడు మిమ్మల్ని పట్టించుకోని వాళ్లే, ఆ తర్వాత మీ దగ్గరకు రావడానికి క్యూ కడతారు. అప్పుడు కూడా మీకు వాళ్లతో పని ఉండదు, ఎందుకంటే మీకు మరే తోడుగా ఉండటం అప్పటికే అలవాటైపోతుంది. అన్నిటికంటే ముందు ఎక్స్‌పెక్టేషన్స్(Expectations) అన్న పదం మీ జీవితంలోంచి తీసేయడానికి అలవాటు పడిపోతారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button