Just LifestyleHealthLatest News

Stay Fit:ఫిట్‌గా ఉండాలంటే ఈ మూడు అలవాట్లు మానుకోండి..

Stay Fit:ఈ కొత్త ఏడాదిలో ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టే వారు ముఖ్యంగా మూడు అలవాట్లను వదిలించుకోవాలి.

Stay Fit

మారుతున్న జీవనశైలి, ఒత్తిడి వల్ల ఈ సమయంలో గుండెపోటు కేసులు చిన్న వయసులోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. 2026లో మనం శారీరకంగా, మానసిక ఆరోగ్యం( Stay Fit)గా ఉండాలంటే కొన్ని అనారోగ్యకరమైన అలవాట్లకు స్వస్తి చెప్పడం చాలా ముఖ్యం.

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మనం రోజూ చేసే కొన్ని చిన్న పొరపాట్లు దీర్ఘకాలంలో ప్రాణాపాయానికి దారితీస్తాయి. ఈ కొత్త ఏడాదిలో ఫిట్‌నెస్‌( Stay Fit)పై శ్రద్ధ పెట్టే వారు ముఖ్యంగా మూడు అలవాట్లను వదిలించుకోవాలి.

మొదటిది, ‘సెడెంటరీ లైఫ్ స్టైల్’ అంటే గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం. ఆఫీసు పనుల వల్ల లేదా టీవీలు చూస్తూ కదలకుండా ఉండటం వల్ల రక్తప్రసరణ తగ్గి, గుండెపై భారం పడుతుంది. ప్రతి గంటకు ఒక ఐదు నిమిషాలు నడవడం అలవాటు చేసుకోవాలి.

రెండోది, అర్ధరాత్రి భోజనం , నిద్రలేమి.. రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల జీర్ణక్రియ దెబ్బతినడమే కాకుండా, ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. రోజుకు కనీసం 7-8 గంటల గాఢ నిద్ర లేకపోతే శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి ఒత్తిడి పెరుగుతుంది. ఇది నేరుగా గుండెపైన ప్రభావం చూపుతుంది.

Stay Fit
Stay Fit

మూడోది, అత్యంత ప్రమాదకరమైనది ‘ప్రాసెస్డ్ ఫుడ్’ తీసుకోవడం. చిప్స్, బిస్కెట్లు, ఇన్స్టంట్ నూడుల్స్ వంటి ప్యాక్ చేసిన ఆహారాల్లో ఉప్పు, చక్కెర , ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును పెంచుతాయి. వీటికి బదులుగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

అలాగే, రోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం లేదా యోగా చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన అలవాట్లు పాటిస్తేనే మనం 2026లో హుషారుగా ఉండగలం.

Japanese:జపనీస్ సమురాయ్ వంశంలో పవన్ కళ్యాణ్‌కు చోటు.. ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్‌ ఎలా అయ్యారు?

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button