Just LifestyleLatest News

Valentines day:ప్రేముంటే సరిపోదా? జేబులో డబ్బు,బంధంలో క్లారిటీ కూడా కావాలా? నేటి ప్రేమికుల ఏం కోరుకుంటున్నారు?

Valentines day: సోషల్ మీడియాలో ఇతరుల పోస్టులు చూసి, తమ ప్రేమికుడు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నారు.

Valentines day

వాలెంటైన్స్ డే(Valentines day) రాగానే అందరూ ఎర్ర గులాబీలు, చాక్లెట్లు అనే రోజులు పోతున్నాయి. ఎందుకంటే ఈరోజుల్లో ప్రేమ కూడా ఒక ఆర్థిక భారంగా మారిపోతోంది. అవును ..ప్రేమ ఉంటే గంజి తాగైనా బతికేయొచ్చనే సినిమా డైలాగులకు కాలం చెల్లింది. ఎందుకంటే వాస్తవ జీవితంలో ఈఎంఐలు, కరెంట్ బిల్లులు, పెరిగిన ధరల మధ్య ప్రేమికుల లెక్కలు మారిపోతున్నాయి.

ఒకప్పుడు ప్రేమ అంటే మనసుల కలయిక మాత్రమే, కానీ ఇప్పుడు అది ఒకరి ఆర్థిక స్థితిగతులను బట్టి కూడా మారిపోతుంది. రిలేషన్ షిప్‌లో డబ్బు గురించి మాట్లాడటం అంటే స్వార్థం అనేవాళ్లు ఉన్నా..కానీ నిజానికి ప్రేమకు అవే స్థిరత్వం అనుకుంటున్నారు నేటి ప్రేమికులు.

అసలు ప్రేమ బంధాల్లో ఆర్థిక గొడవలు ఎందుకు ఎంటరవుతున్నాయనే ప్రశ్నే కనుక తీసుకుంటే..ఇప్పుడు చాలామంది తమ పార్ట్‌నర్ తమకు ఖరీదైన గిఫ్ట్‌లు ఇవ్వాలని, స్టార్ హోటల్స్‌లో లంచ్,డిన్నర్లు చేయించాలని అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇతరుల పోస్టులు చూసి, తమ ప్రేమికుడు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నారు.

నువ్వే కనుక నన్ను నిజంగా ప్రేమిస్తే నాకు అదెందుకు కొనలేదనే ప్రశ్న దగ్గర ప్రేమ చచ్చిపోయి.. ఆర్థిక గొడవలతో బేరసారాలు మొదలవుతున్నాయి. ఎప్పుడైతే పవిత్ర ప్రేమను వస్తువులతో కొలుస్తున్నారో, అప్పుడే ఆ బంధం పునాదులు కదిలిపోయినట్లు అవుతున్నాయి. డబ్బు లేకపోతే ప్రేమే ఉండదా అంటే ఉంటుంది. కానీ డబ్బు గురించి సరైన అవగాహన లేకపోతే మాత్రం ఆ ప్రేమలో గొడవలు ఖాయం.

సైకాలజీ ప్రకారం..జంటల మధ్య వచ్చే గొడవల్లో 70 శాతం వరకూ ఆర్థిక కారణాలే ఉంటున్నాయట. పెళ్లికి ముందు ప్రేమలో ఉన్నప్పుడు డబ్బు ఏముందిలే అని అనుకుంటారు కానీ, తీరా వారిద్దరూ కలిసి సాగించే జీవితంలో బాధ్యతలు మీద పడితే ఒకరినొకరు నిందించుకోవడం మొదలుపెడతారు.

Valentines day
Valentines day

అందుకే, ప్రేమలో ఉన్నప్పుడే ఆర్థిక స్పష్టత’ (Financial Transparency) ఉండటం ఇద్దరికీ కూడా చాలా ముఖ్యం అన్న భావనలో ఉంటున్నారు. నిజానికి కలిసి జీవితాన్ని పంచుకోవాలని అనుకున్నవాళ్లు .. పార్ట్‌నర్ ఎంత సంపాదిస్తున్నారన్న దగ్గర నుంచి వారికున్న అప్పులేంటి వరకూ తెలుసుకుంటేనే మంచిది అంటున్నారు నిపుణులు కూడా. భవిష్యత్తు గురించి వారి ఆర్థిక ప్రణాళికలు ఏంటి అనేవి చర్చించడం కూడా ఏమాత్రం తప్పు కాదంటున్నారు.

ఇది ఒకరినొకరు తక్కువ చేయడం కాదని..రేపు రాబోయే తుపాను నుంచి బంధాన్ని కాపాడుకోవడానికి వేసుకునే ఒక గొడుగు వంటిదని చెబుతున్నారు. ఎందుకంటే డబ్బు అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, కానీ అదే జీవితం కాకూడదు. ఆర్థిక స్పష్టతతో కూడిన ప్రేమ బంధం ఎప్పటికీ కూడా చెక్కుచెదరకుండా ఉంటుంది. ఎందుకంటే అక్కడ కేవలం మనసులే కాదు, వాస్తవ పరిస్థితులు కూడా ఒక్కటవుతాయి.

ప్రాక్టికల్ లవ్ అంటే ఒకరినొకరు వాడుకోవడం కాదు, ఒకరికొకరు ఆర్థికంగా కూడా అండగా ఉండటం అని ముందు తెలుసుకోవాలి. కాస్ట్‌లీ గిఫ్ట్‌లు ఇవ్వలేదని విడిపోయే బంధం కంటే, కష్ట కాలంలో నేనున్నానని భరోసా ఇచ్చే తోడు మిన్న. ఈ వాలెంటైన్స్ డే (Valentines day)సందర్భంగా ప్రేమికులు గుర్తుంచుకోవాల్సింది ఇదే.

0
తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనుకుంటున్నారు?

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button