Just LifestyleLatest News

Health: బరువు తగ్గాలా? రోజంతా చురుగ్గా ఉండాలా? అయితే ఇలా ట్రై చేయండి

Health: నువ్వులు , తేనె ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే శరీరానికి అదనపు శక్తి లభించి, రోజంతా చురుగ్గా ఉంటారు.

Health

అరవై ఏళ్ల వయసులో ఉండాల్సిన ఆరోగ్య(Health) సమస్యలు, ఇరవైలలోనే వస్తున్నాయని మనం తరచూ వింటూ ఉంటాం. ప్రత్యేకించి మూడు పదుల వయసు దాటిన మహిళల్లో బరువు పెరగడం, పొట్ట రావడం సర్వసాధారణమైపోయింది. ఈ సమస్యలకు సరళమైన, సంప్రదాయ పరిష్కారం కావాలంటే ఆయుర్వేద నిపుణులు ఒక అద్భుతమైన కలయికను సూచిస్తున్నారు. అదే నువ్వులు , తేనె ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే శరీరానికి అదనపు శక్తి లభించి, రోజంతా చురుగ్గా ఉంటారు.

నువ్వులు , తేనె రెండింటిలోనూ ఎన్నో అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. నువ్వులు కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, కాల్షియం, విటమిన్-బి, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలతో నిండి ఉంటాయి. ఈ పోషకాల గనిలోకి తేనెను కలిపితే మరిన్నిఆరోగ్య(Health) ప్రయోజనాలు పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ప్రతిరోజూ ఉదయం ఒక స్పూన్ తేనె, రెండు స్పూన్ల నువ్వులను కలిపి తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. దీనివల్ల నీరసం, అలసట వంటివి లేకుండా రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అంతేకాకుండా, ఈ మిశ్రమం రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

మహిళలకు ఈ మిశ్రమం ఒక వరమనే చెప్పాలి. నువ్వులు, తేనె (Sesame seeds and honey)కలిపి తీసుకోవడం వల్ల రుతు సమయంలో వచ్చే నొప్పులు, తిమ్మిర్లు, వాపులు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. మొటిమలు, మచ్చలు కూడా తగ్గిపోతాయి. అంతేకాకుండా, వెంట్రుకలు దృఢంగా, ఒత్తుగా పెరిగి చుండ్రు సమస్య దూరమవుతుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.

health
health

ఈ అద్భుతమైన మిశ్రమం ఎముకల ఆరోగ్యానికి(Nuvvulu and thene for health) కూడా ఎంతో మేలు చేస్తుంది. మహిళల్లో తరచుగా వచ్చే ఎముకల నొప్పులు, వెన్నునొప్పి వంటి సమస్యలను ఇది దూరం చేస్తుంది. ఎదిగే పిల్లలకు కూడా నువ్వులు, తేనె కలిపి ఇస్తే వారి శరీరానికి కావలసిన పోషణ సరిగ్గా అందుతుంది.

నువ్వులు, తేనె కలిపి తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది, దీనితో బరువు తగ్గడం సులభమవుతుంది. అలాగే రక్తహీనత సమస్య కూడా తగ్గిపోతుంది. మెదడు చురుగ్గా పనిచేసి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి. ఇలా ఎన్నో ఆరోగ్య (Health)ప్రయోజనాలను అందించే ఈ చిన్న చిట్కాను పాటించడం ద్వారా మీరు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Vitamin D: ఇలా చేస్తే పైసా ఖర్చు లేకుండానే కావాల్సినంత విటమిన్ డి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button