Just NationalLatest News

Bridge: ప్రకృతి అద్భుతం.. చెట్ల వేళ్లతో ఏర్పడిన వంతెన

Bridge: అడవుల్లో సహజంగా పెరిగే రబ్బరు చెట్ల వేళ్ల ద్వారా స్థానిక ప్రజలు దశాబ్దాల పాటు పెంచి, మలచిన వంతెనలు.

Bridge

భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ప్రపంచాన్ని అబ్బురపరిచే ఒక అద్భుతం ఉంది – అవే ‘లివింగ్ రూట్ బ్రిడ్జెస్’ (జీవన వేళ్ళ వంతెనలు-Bridge). ఇవి మనుషులు కాంక్రీటుతో నిర్మించినవి కావు, అడవుల్లో సహజంగా పెరిగే రబ్బరు చెట్ల వేళ్ల ద్వారా స్థానిక ప్రజలు దశాబ్దాల పాటు పెంచి, మలచిన వంతెనలు.

ఖాసీ తెగల జీవ ఇంజనీరింగ్.. నిర్మాణ రహస్యం: మేఘాలయలోని ఖాసీ తెగల ప్రజలు, ముఖ్యంగా చిరపుంజి (ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం) చుట్టుపక్కల నివసించేవారు, ఈ అద్భుతమైన జీవ ఇంజనీరింగ్‌ను సృష్టించారు. ‘ఫైకస్ ఎలాస్టికా’ (Ficus elastica – రబ్బరు చెట్టు) వేర్లను పక్కన ఉన్న నది లేదా లోయను దాటడానికి వీలుగా, బోలుగా ఉండే అరెకా గింజ చెట్టు (Betel Nut Tree) కాండం ద్వారా అడ్డంగా మలుస్తారు.

Bridge
Bridge

నిర్మాణ సమయం.. వంతెన(Bridge)గా మారడానికి ఈ వేళ్లకు సుమారు 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. ఇవి కాంక్రీటు వంతెనల కంటే వందల రెట్లు దృఢంగా మరియు బలపడతాయి.

ప్రత్యేకత.. ఈ వంతెనలు కాలంతో పాటు మరింత బలంగా పెరుగుతాయి. వర్షాలు ఎంత ఎక్కువ పడితే, వేళ్లు అంత బలంగా మారతాయి. ఈ వంతెనల్లో అత్యంత ప్రసిద్ధి చెందినది ‘ఉమశియాంగ్ డబుల్ డెక్కర్ రూట్ బ్రిడ్జ్’ (Umshiang Double Decker Root Bridge). ఈ వంతెనలకు స్థానికులు ‘జింగ్‌కియెంగ్ డియెంగ్ జ్రి’ అని పేరు పెట్టారు.

ఈ జీవన వంతెనలు పర్యావరణ పరిరక్షణకు, స్థానిక సంస్కృతికి ,ప్రకృతితో మనిషి సహజీవనానికి గొప్ప ప్రతీకగా నిలుస్తున్నాయి.

Employment for prisoners: దేవాలయ వ్యర్థ పుష్పాల నుంచి అగరబత్తుల తయారీ – అక్కడ ఖైదీలకు గౌరవప్రదమైన ఉపాధి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button