Dhvani Hypersonic Missile: బ్రహ్మోస్ ను మించిన ధ్వని మిస్సైల్ మరో భారీ అస్త్రాన్ని రెడీ చేస్తున్న భారత్
Dhvani Hypersonic Missile: రక్షణ రంగంలో మన సొంత మిస్సైల్స్ శక్తిని ఇప్పటికే ప్రపంచానికి చాటిచెప్పిన భారత్ కొత్తగా తయారుచేయబోయే ప్రాజెక్టుకు ధ్వని క్షిపణిగా నామకరణం చేసింది.

Dhvani Hypersonic Missile
మన దేశరక్షణ రంగాన్ని బలోపేతం చేయడంలో ఎప్పటికప్పుడు మన శాస్త్రవేత్తలు సరికొత్త అస్త్రాలను సిద్ధం చేస్తూనే ఉన్నారు. తాజాగా భారత అమ్ములపొదిలో మరో అద్భుతమైన అస్త్రం చేరబోతోంది. ఇప్పటి వరకూ అత్యుత్తమ క్షిపణిగా ఉన్న బ్రహ్మాస్త్రను మించిన మిస్సైల్(Dhvani Hypersonic Missile) తయారీకి శ్రీకారం చుట్టారు.
రక్షణ రంగంలో మన సొంత మిస్సైల్స్ శక్తిని ఇప్పటికే ప్రపంచానికి చాటిచెప్పిన భారత్ కొత్తగా తయారుచేయబోయే ప్రాజెక్టుకు ధ్వని క్షిపణిగా నామకరణం చేసింది. అత్యాధునిక క్షిపణి వ్యవస్థలు, ఫైటర్ జెట్స్ తో పాటు మానవరహిత డ్రోన్ ప్రాజెక్టులపై ఎప్పటినుంచో భారత్ ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా ఇప్పుడు ప్రపంచాన్ని వణికించేలా హైపర్‌సోనిక్ క్షిపణిలను సిద్ధం చేసే ప్రయోగాలను ముమ్మరం చేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ధ్వని హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికల్‌ప్రాజెక్టును ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నట్టు వెల్లడించింది.

మన రక్షణ వ్యవస్థలో ఇప్పటికే బ్రహ్మోస్ వంటి మిస్సైల్స్ ప్రత్యర్థులకు వణుకు పుట్టించి ఆపరేషన్ సింధూర్ వంటి వాటిలో భారీ విజయాలను అందించాయి. కొత్తగా తయారు చేయబోయే ధ్వని మిస్సైల్ అంతకుమించిన శక్తితో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ ధ్వని క్షిపణి భారత రక్షణవ్యవస్థకు సరికొత్త అస్త్రంగా మారడమే కాకుండా అత్యంత బలాన్ని ఇస్తుందని అంచనా వేస్తున్నారు. ఇతర మిస్సైల్స్ తో పోలిస్తే ధ్వని క్షిపణి వేగం(Dhvani Hypersonic Missile) ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగే వంగా విషయంలోనూ గత వాటి కంటే ఎంతో ఎక్కువగా ఉంటుందని సమాచారం. సుమారు గంటకు సుమారు 7 వేల కిలోమీటర్ల వరకూ ఉంటుందని చెబుతున్నారు.
ఈ అసాధారణ వేగంతో 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఇది అత్యంత ఖఛ్చితంగా ఛేదిస్తుంది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే శతృస్థావరాలను నామరూపాల్లేకుండా ధ్వంసం చేసే కెపాసిటి ధ్వని మిస్సైల్ కు ఉంది. అలాగే వేగమే కాకుండా అది వెళ్ళే దారిలో దిశను తనంతట తానుగా మార్చుకునే ప్రత్యేకత దీని సొంతమని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు.
ఈ కారణంగానే శతృవులు దాడిచేసిన తప్పించుకునేందుకు దీనికి వీలుంటుంది. అయితే సాధారణ క్షిపణుల్ల తరహాలో కాకుండా రాకెట్ బూస్టర్ సాయంతో ధ్వని మిస్సైల్ అత్యంత ఎత్తుకు పంపిస్తారు. అక్కడ బూస్తర్ నుంచి విడిపోయి తన లక్ష్యం దిశగా వెళుతుంది. ముఖ్యంగా రాడార్లకు సైతం చిక్కకుండా ప్రయాణించడం దీని మరో ప్రత్యేకత. మొత్తం మీద ధ్వని మిస్సైల్ ఏడాది చివరికల్లా సిద్ధం చేసి మరోసారి ప్రపంచానికి మన రక్షణవ్యవస్థ సత్తాను భారత్ చూపించబోతోంది.