Shop :భారతదేశం చివరి దుకాణం ఎక్కడో తెలుసా?
Shop :ఒకప్పుడు చిన్న టీ స్టాల్‌గా ఉన్న ఈ దుకాణం ఇప్పుడు ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా మారింది.

Shop
మీరు ఎప్పుడైనా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, అత్యంత ప్రత్యేకమైన ప్రదేశంలో టీ తాగాలని కలలు కన్నారా? అయితే మీలాంటివారికోసం హిమాలయాల మధ్య, మంచు కొండల అంచున, భారత్-చైనా సరిహద్దు దగ్గర ఉన్న ఒక చిన్న టీ స్టాల్ ఉంది. మరి దీని కథ ఏంటి దీని విషయాలు ఏంటో చూద్దామా..
భారతదేశం చివరి అంచున, హిమాలయాల మధ్యలో ఒక చిన్న టీ దుకాణం(shop)ఉంది. దీని పేరు “హిందుస్థాన్ కీ అంతిమ్ దుకాణ్” (భారత్ చివరి దుకాణం). ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉన్న ఈ దుకాణాన్ని(shop) చందర్ సింగ్ బద్వాల్ అనే వ్యాపారి 25 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. ఈ గ్రామంలో ఇదే మొట్టమొదటి టీ దుకాణం.
Revanth Reddy: వారి వెనుక నేనెందుకు ఉంటాను.. రేవంత్ రెడ్డి

ఒక ప్రత్యేకమైన ప్రదేశం..ఈ టీ స్టాల్ 3,118 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ నిలబడి చూస్తే అద్భుతమైన మంచు శిఖరాలు, ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. ఈ దుకాణం చైనా సరిహద్దుకు కొన్ని మీటర్ల దూరంలో ఉంది, అందుకే దీనిని భారత్-చైనా సరిహద్దులో ఉన్న చివరి దుకాణం అని పిలుస్తారు.
పర్యాటక కేంద్రంగా మార్పు..ఒకప్పుడు చిన్న టీ స్టాల్‌గా ఉన్న ఈ దుకాణం ఇప్పుడు ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా మారింది. ఇక్కడికి వెళ్లే పర్యాటకులు బద్వాల్ టీ స్టాల్‌లో టీ తాగుతూ, దాని ముందు సెల్ఫీలు తీసుకుంటారు.
అంతేకాకుండా, ఇక్కడ దొరికే రుచికరమైన మ్యాగీని తినడానికి పర్యాటకులు చాలా ఆసక్తి చూపుతారు. సోషల్ మీడియాలో ఈ ప్రదేశం బాగా వైరల్ కావడంతో, ఈ చిన్న టీ స్టాల్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.