Hydrogen Train: భారత్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ వస్తోంది..ఆక్సిజన్-నీటితో నడిచే ఈ రైలు రహస్యాలు
Hydrogen Train: భారతీయ రైల్వేలు, పరిశోధన, రూపకల్పన, ప్రమాణాల సంస్థ (RDSO) నిర్దేశించిన స్పెసిఫికేషన్లతో ఈ హైడ్రోజన్ పవర్ ట్రైన్‌ను పైలట్ ప్రాతిపదికన తయారు చేశాయి.
Hydrogen Train
పర్యావరణహిత రవాణా దిశగా భారత్ మరో కీలకమైన అడుగు వేసింది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ (Hydrogen) శక్తితో నడిచే రైలు అతి త్వరలోనే పట్టాలెక్కనుంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ సభ వేదికగా ఈ చారిత్రక ఆవిష్కరణ వివరాలను వెల్లడించారు. ఇది కేవలం దేశీయంగా తయారు చేయబడిన (Made In India) రైలు మాత్రమే కాదు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన , పొడవైన హైడ్రోజన్ రైలు సెట్‌లలో ఒకటిగా నిలవనుంది.
హైడ్రోజన్ రైలు (Hydrogen Train)ప్రత్యేకతలు.. భారతీయ రైల్వేలు, పరిశోధన, రూపకల్పన, ప్రమాణాల సంస్థ (RDSO) నిర్దేశించిన స్పెసిఫికేషన్లతో ఈ హైడ్రోజన్ పవర్ ట్రైన్‌ను పైలట్ ప్రాతిపదికన తయారు చేశాయి.
ప్రపంచ రికార్డు.. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత పొడవైన (10 కోచ్‌లు) మరియు అత్యంత పవర్‌ఫుల్ (2400 kW) బ్రాడ్ గేజ్ హైడ్రోజన్ రైలు సెట్.
ఈ రైలు సెట్‌లో 2 డ్రైవింగ్ పవర్ కార్లు (DPCs) ఉంటాయి. ఒక్కో పవర్ కార్‌కు 1200kW సామర్థ్యం ఉండగా, మొత్తంగా 2400 kW పవర్ జనరేట్ చేస్తుంది.
🚨India's Hydrogen train project advances as Railways completes manufacturing of first pilot train-set. pic.twitter.com/qlQUkHjSDa
— Indian Infra Report (@Indianinfoguide) December 10, 2025
పర్యావరణ హితం (Zero Emission-Hydrogen Train).. ఈ సాంకేతికతకు అత్యంత ముఖ్యమైన అంశం జీరో ఉద్గారాలు. ఈ రైలు హైడ్రోజన్ ఇంధన కణాల ద్వారా నడుస్తుంది. హైడ్రోజన్ వాయువు ఆక్సిజన్‌తో రసాయన చర్య జరిపి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియలో ఉప ఉత్పత్తులుగా కేవలం నీరు, నీటి ఆవిరి మాత్రమే విడుదల అవుతాయి. అంటే ఈ రైలు నుంచి పర్యావరణానికి హానికరమైన కార్బన్ డయాక్సైడ్ (CO2) ఉద్గారాలు ఏవీ వెలువడవు.

హైడ్రోజన్ రైలు(Hydrogen Train) నిర్వహణకు అవసరమైన హైడ్రోజన్‌ను సరఫరా చేసేందుకు భారత రైల్వేలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.
గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్.. రైలు కోసం అవసరమైన హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి హర్యానాలోని జింద్‌లో విద్యుద్విశ్లేషణ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది స్థిరమైన మరియు పర్యావరణ అనుకూల ఇంధన సరఫరాకు హామీ ఇస్తుంది.
నీటి వినియోగం.. రసాయన ప్రక్రియల కోసం ఈ రైలుకు గంటకు సుమారు 40,000 లీటర్ల నీరు అవసరం అవుతుంది, ఇది రైలు సెట్‌లో పునఃచక్రీయం (Recycle) చేయబడుతుంది.
హైడ్రోజన్ ట్రాక్షన్ టెక్నాలజీ అభివృద్ధి వరకు భారతీయ రైల్వేల మొదటి ప్రయత్నమని రైల్వే మంత్రి పేర్కొన్నారు. ఇది రాబోయే తరాలకు ఉద్గారరహితమైన, క్లీన్ ,గ్రీన్ రవాణా వ్యవస్థకు నాంది పలకనుంది. ప్రస్తుతం ఇది పైలట్ ప్రాజెక్ట్ అయినా కూడా.. భవిష్యత్తులో సాంప్రదాయ డీజిల్ ట్రాక్షన్ వ్యవస్థలకు ఇది గొప్ప ప్రత్యామ్నాయంగా నిలవనుంది.



