Indian Army : రాత పరీక్ష లేదు-నెలకు రూ.1.77 లక్షల జీతం..ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు గోల్డెన్ ఛాన్స్
Indian Army : ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ లేకుండానే ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎంపికైన వారికి శిక్షణ సమయంలోనే స్టయిపెండ్ అందిస్తూ, ఉద్యోగంలో చేరాక భారీ శాలరీని చెల్లిస్తారు.
Indian Army
దేశ సేవ చేయాలనే తపనతో పాటు..ఉన్నత స్థాయి హోదాను కోరుకునే యువకులకు ఇండియన్ ఆర్మీ (Indian Army) ఒక తీపి కబురు చెప్పింది. 67వ షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC Tech) కోర్సులో భాగంగా టెక్నికల్ విభాగంలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ Indian Army ఉద్యోగాల ప్రత్యేకత ఏంటంటే.. ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ లేకుండానే ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎంపికైన వారికి శిక్షణ సమయంలోనే స్టయిపెండ్ అందిస్తూ, ఉద్యోగంలో చేరాక భారీ శాలరీని చెల్లిస్తారు.
మొత్తం 350 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ , మెకానికల్ వంటి ప్రధాన ఇంజనీరింగ్ విభాగాల్లో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసిన యువకులు దీనికి అర్హులు. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి – అర్హతలు.. అభ్యర్థుల వయస్సు 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1999 అక్టోబర్ 1 నుంచి 2006 సెప్టెంబర్ 30 మధ్య జన్మించి ఉండాలి. ఎంపిక విధానం విషయానికొస్తే.. అప్లికేషన్ చేసుకున్న వారిని మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, నేరుగా ఎస్‌ఎస్‌బీ (SSB) ఇంటర్వ్యూకి పిలుస్తారు. శారీరక ప్రమాణాల పరంగా 10.30 నిమిషాల్లో 2.4 కిలోమీటర్ల పరుగును పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఎంపికైన వారికి ఏడాది పాటు ఇండియన్ ఆర్మీ(Indian Army)లో ట్రెయినింగ్ ఉంటుంది. ట్రయినింగ్ పీరియడ్‌లో నెలకు రూ. 56,100 స్టైపెండ్ లభిస్తుంది. విధుల్లో చేరాక లెఫ్టినెంట్ హోదాతో నెలకు సుమారు రూ. 1,77,500 వరకు జీతం అందుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్ ద్వారా జనవరి 7 నుంచి ఫిబ్రవరి 5, 2026 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.




One Comment