Income Tax: ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడం ఇక సో ఈజీ..
Income Tax: కొత్త ఆదాయపు పన్ను బిల్లులో పాత చట్టంలోని విషయాలనే అందరికీ అర్థమయ్యేలా, సింపుల్ లాంగ్వేజ్‌లో రాశారు.

Income Tax
ఇన్కమ్ ట్యాక్స్ (Income Tax)అంటే తలనొప్పి అనుకునేవారందరికీ ఒక గుడ్ న్యూస్. మన దేశంలో ఆరు దశాబ్దాల పాటు ఉన్న పాత ఇన్కమ్ ట్యాక్స్( Income Tax) చట్టం ఇకపై లేదు. 1961 నుంచి ఉన్న ఈ చట్టం పదే పదే సవరణలు జరగడం వల్ల, చాలా కన్ఫ్యూజింగ్గా ఉండేది. ఈ సమస్యకు చెక్ పెడుతూ, ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను (నం.2) బిల్లును తీసుకొచ్చింది. ఈ కొత్త బిల్లులో పాత చట్టంలోని విషయాలనే అందరికీ అర్థమయ్యేలా, సింపుల్ లాంగ్వేజ్‌లో రాశారు. దీనివల్ల ఇకపై ట్యాక్స్ ఫైలింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా మారనుంది.
ఈ కొత్త బిల్లుతో మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పాత చట్టంలో 700 సెక్షన్లు ఉంటే, కొత్త బిల్లులో వాటిని 536కు తగ్గించారు. అలాగే 823 పేజీల చట్టాన్ని 622 పేజీలకు కుదించారు. పాత చట్టంలో గత సంవత్సరం( Previous Year),అసెస్మెంట్ ఇయర్(Assessment Year) వంటి పదాలు చాలామందికి అయోమయాన్ని సృష్టించేవి. ఇప్పుడు వాటికి బదులుగా ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు వర్తించే ట్యాక్స్ ఇయర్ (Tax Year) అనే ఒకే పదాన్ని వాడుతున్నారు. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ కొత్త బిల్లులో కొత్తగా ఎలాంటి పన్నులు విధించలేదు. పన్ను శ్లాబులు, పన్ను రేట్లు, జరిమానాల్లో ఎలాంటి మార్పులూ లేవు.

కొత్త బిల్లు వల్ల పన్ను చెల్లింపుదారులకు కొన్ని మంచి సౌకర్యాలు లభిస్తాయి. మీరు రిటర్న్స్ ఫైల్ చేయడంలో లేట్ అయినా కూడా, రిఫండ్స్‌ని క్లెయిమ్ చేసుకోవచ్చు. టీడీఎస్ (TDS) దాఖలు ఆలస్యమైతే ఇకపై జరిమానాలు ఉండవు. అలాగే, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేనివారు ముందుగానే నిల్ సర్టిఫికెట్ (Nil Certificate) తీసుకోవచ్చు, ఇది NRIలకు కూడా వర్తిస్తుంది. కొంతమంది పెన్షనర్లు తమ కమ్యూటెడ్, లంప్సమ్ పెన్షన్ చెల్లింపులపై స్పష్టమైన పన్ను మినహాయింపు పొందవచ్చు.
గృహ ఆస్తుల నుంచి వచ్చే ఆదాయంపై పన్ను లెక్కించేటప్పుడు, 30 శాతం ప్రామాణిక మినహాయింపును ఇచ్చారు. దీంతో పాటు, హోమ్ లోన్ వడ్డీని కూడా ఆదాయం నుంచి తీసివేయవచ్చు. గ్రాట్యుటీ, పెన్షన్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి వాటిని వేతన సెక్షన్లోనే కలిపారు, దీనివల్ల లెక్కలు చాలా సింపుల్ అవుతాయి. ఈ మార్పులన్నీ పన్ను వ్యవస్థను మరింత పారదర్శకంగా, ఈజీగా మారుస్తాయి. మొత్తానికి, ఈ కొత్త బిల్లుతో ట్యాక్స్ పేయర్స్ అందరికీ ఒక పెద్ద రిలీఫ్ దొరికినట్లే.