New Year: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు ప్లాన్ చేస్తున్నారా? ఇక్కడ వేడుకలు చేసుకుంటే ఆ కిక్కే వేరంట ఓ సారి చూడండి
New Year: సాధారణంగా న్యూ ఇయర్ అంటే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు గోవా. , గోవాలోని అంజనా బీచ్, వాగేటర్ బీచ్‌లలో జరిగే సైకెడెలిక్ ట్రాన్స్ పార్టీల జోష్ మరెక్కడా కూడా దొరకదు.
New Year
కొత్త ఏడాది(New Year) వస్తోందంటే చాలు.. మనసులో ఏదో తెలియని ఉత్సాహం. 2025 జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ 2026(New Year)కి ఘనంగా స్వాగతం పలికేందుకు చాలామంది రెడీ అవుతుంటారు. దేశంలోని అద్భుతమైన ప్రదేశాలకు వెళ్లి అక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తుంటారు. అయితే పార్టీ ప్రేమికులకు, ప్రకృతి ఆరాధకులకు, ప్రశాంతతను కోరుకునే వారికి వారి టేస్టుకు తగ్గట్లు.. భారత్‌లో ప్రతి ఒక్కరికీ సరిపోయే విభిన్నమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.
సాధారణంగా న్యూ ఇయర్(New Year) అంటే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు గోవా. , గోవాలోని అంజనా బీచ్, వాగేటర్ బీచ్‌లలో జరిగే సైకెడెలిక్ ట్రాన్స్ పార్టీల జోష్ మరెక్కడా కూడా దొరకదు. పలోలెం బీచ్‌లోని సైలెంట్ డిస్కో పార్టీలు ఒక ప్రత్యేక అనుభవం. హెడ్‌ఫోన్లు పెట్టుకుని ఇసుక తిన్నెలపై డ్యాన్స్ చేయడం యూత్‌కు ఒక క్రేజ్. అయితే ఈ సమయంలో ఇక్కడ రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ముందే ప్లాన్ చాలామంది ప్లాన్ చేసుకుని వెళ్తే బెటర్.

గోవా రద్దీ నచ్చని వారికి కర్ణాటకలోని గోకర్ణ ఒక స్వర్గం అనే చెప్పొచ్చు. దశాబ్దాల క్రితం గోవా ఎలా ఉండేదో, ఇప్పుడు గోకర్ణ ఎటువంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. కుడ్లే బీచ్‌లోని కేఫ్‌లు, ఫ్రెష్ సీ ఫుడ్ మీ న్యూ ఇయర్ విందును భలే అమోఘంగా మారుస్తాయి. ఇవేమీ కాకుండా సిటీ లైఫ్ ఇష్టపడే వారు అయితే ముంబైలోని మెరైన్ డ్రైవ్ , గేట్‌వే ఆఫ్ ఇండియా దగ్గర వేలాది మందితో కలిసి బాణసంచా వేడుకలను చూడొచ్చు.

ఒకవేళ మీకు మరీ హడావుడి ఉన్న బీచ్‌లకు బదులు మంచుతో నిండిన పర్వతాల మధ్య న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవాలని ఉంటే, హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి , కసోల్ సరైన ఎంపికలు. చలి ఎక్కువగా ఉన్నా, సోలాంగ్ వ్యాలీలో స్కీయింగ్ చేస్తూ, ఓల్డ్ మనాలి కేఫ్‌లలో భోగి మంటల మధ్య సంగీతాన్ని ఆస్వాదించడం ఒక మరుపురాని అనుభవంగా మిగిలిపోతుంది. కసోల్‌లోని పార్వతి నది ఒడ్డున క్యాంపింగ్ చేస్తూ నక్షత్రాల కింద కొత్త ఏడాదికి స్వాగతం పలకడం భలేగా ఉంటుంది.

రాజసం ఉట్టిపడేలా వేడుకలు జరుపుకోవాలనుకునే వారు మాత్రం రాజస్థాన్‌లోని ఉదయపూర్, జైపూర్ వైపు వెళ్లొచ్చు. ఇక్కడి ప్యాలెస్ డిన్నర్లు, పిచోలా సరస్సుపై పేలే బాణసంచా కాంతులు మిమ్మల్ని ఒక్కసారిగా రాజుల కాలానికి తీసుకెళ్తాయి. హెరిటేజ్ హోటళ్లలో జానపద ప్రదర్శనల మధ్య గాలా డిన్నర్ ఎంజాయ్ చేయడం ఒక లగ్జరీ అనుభవంగా మీ జ్ఞాపకాలలో మిగిలిపోతుంది.

ప్రశాంతత , ఆధ్యాత్మికతతో కూడిన వేడుకలను ఇష్టపడే వారికి పాండిచ్చేరి , రాన్ ఆఫ్ కచ్ అద్భుతమైన ప్రదేశాలు అని చెప్పొచ్చు. పాండిచ్చేరిలోని వైట్ టౌన్ వీధులు ఫ్రెంచ్ సంస్కృతిని తలపిస్తూ మిరిమిట్లు గొలిపే లైట్లతో వెలిగిపోతుంటాయి. ఆరోవిల్లెలో ధ్యానం చేస్తూ ప్రశాంతంగా కొత్తగా ఏడాదిని ప్రారంభించవచ్చు. అలాగే గుజరాత్‌లోని తెల్లని ఎడారి రాన్ ఆఫ్ కచ్‌లో చంద్రకాంతిలో జానపద సంగీతాన్ని వింటూ న్యూ ఇయర్‌కు వెల్కమ్ చెప్పడం మరో ఎత్తు.



