Diwali :దీపావళికి ఢిల్లీలో 4 రోజులు గ్రీన్ క్రాకర్స్ కు సుప్రీంకోర్టు అనుమతి
Diwali: ఢిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యం (Air Pollution) దృష్ట్యా, కోర్టు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఈ ఆదేశాలను వెలువరించింది.

Diwali
దీపావళి(Diwali) పండుగ సమీపిస్తుండటంతో.. దేశ రాజధాని ఢిల్లీలో టపాసుల వినియోగంపై సుప్రీంకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యం (Air Pollution) దృష్ట్యా, కోర్టు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఈ ఆదేశాలను వెలువరించింది. ఈ నిర్ణయం పండుగ సంప్రదాయాలను, పర్యావరణ హితాన్ని సమన్వయం చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది.
సుప్రీంకోర్టు తాజా ఆదేశాల ప్రకారం, ఢిల్లీలో ఈ దీపావళి సందర్భంగా పర్యావరణ హితమైన ‘గ్రీన్ క్రాకర్స్’ (Green Crackers) ను మాత్రమే వినియోగించుకోవడానికి అనుమతి లభించింది. అయితే, ఈ అనుమతి కేవలం పరిమిత కాలానికి మాత్రమే వర్తిస్తుంది.ఈ నెల అక్టోబర్ 18 నుంచి 21 వరకు నాలుగు రోజుల పాటు మాత్రమే టపాసుల వినియోగానికి అనుమతి ఉంటుంది.

ఈ నాలుగు రోజుల్లో కూడా సాధారణ టపాసులకు బదులుగా, కేవలం పొగ , కాలుష్యం తక్కువగా విడుదల చేసే గ్రీన్ క్రాకర్స్‌ను మాత్రమే కాల్చుకోవాలి.
సాధారణంగా ఢిల్లీ-ఎన్సీఆర్ (NCR) ప్రాంతాల్లో చలికాలం ప్రారంభంలో, ముఖ్యంగా దీపావళి సమయంలో, వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది.
టపాసుల నుంచి వెలువడే దట్టమైన పొగ , హానికరమైన రసాయనాలు పీఎం (PM) 2.5 స్థాయిలను విపరీతంగా పెంచి, ప్రజారోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తాయి.దీనివల్లే కొన్నేళ్లుగా ఢిల్లీలో టపాసుల వినియోగంపై సుప్రీంకోర్టు ,జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT) అనేక ఆంక్షలు విధిస్తూ వస్తున్నాయి.

గ్రీన్ క్రాకర్స్ అనేవి సంప్రదాయ టపాసుల కన్నా 40-50 శాతం తక్కువ హానికర రసాయనాలను, ధ్వనిని , పొగను విడుదల చేస్తాయి. వీటిని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) అభివృద్ధి చేసింది. ఈ పరిమిత వినియోగం వల్ల దీపావళి తర్వాత ఏర్పడే తీవ్రమైన వాయు కాలుష్యం కొంతవరకు అదుపులో ఉండే అవకాశం ఉంది.
ఢిల్లీ పోలీసులు ,పర్యావరణ ఏజెన్సీలు ఈ ఆదేశాలను కఠినంగా అమలు చేయాల్సి ఉంటుంది. గ్రీన్ క్రాకర్స్ కాకుండా ఇతర టపాసులు కాల్చినా లేదా నిర్దేశించిన రోజుల తర్వాత కాల్చినా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సంపూర్ణ నిషేధం కాకుండా, పరిమితంగానైనా నాలుగు రోజులు అనుమతి లభించడం పండుగను జరుపుకోవాలనుకునే వారికి కొంత ఉపశమనం కలిగించింది.
మొత్తంగా, సుప్రీంకోర్టు ఆదేశాలు దీపావళి(Diwali) సంబరాలను జరుపుకోవడంలో పర్యావరణ హితమైన (Eco-friendly) విధానాలను పాటించాల్సిన ఆవశ్యకతను మరోసారి గుర్తు చేశాయి.
One Comment