Star: భారతదేశంలో ఒక నక్షత్రం.. ఆకాశంలో కాదు భూమిపైనే ఉంది!
Star: కర్ణాటకలోని మంజరాబాద్ కోట, దీన్నే స్థానికులు నక్షత్ర కోట అని పిలుస్తారు.
Star
ఆకాశంలో మెరిసే నక్షత్రాలు చూసి మనం ఆశ్చర్యపోతుంటాం. కానీ, భూమిపైన కూడా ఒక నక్షత్రం ఉంది. అదే కర్ణాటకలోని మంజరాబాద్ కోట, దీన్నే స్థానికులు నక్షత్ర కోట అని పిలుస్తారు. చరిత్ర, నిర్మాణ వైభవం, ప్రకృతి అందాలు.. ఈ మూడింటి కలయికతో పర్యాటకులను ఆకర్షించే ఈ కోట గురించిన ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆకాశంలోని నక్షత్రాలను మనం తల పైకెత్తి చూస్తాం, కానీ నేలపై ఉన్న నక్షత్ర కోటను చూడాలంటే మాత్రం ఒక సాహస యాత్ర చేయాల్సిందే. కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఉన్న మంజరాబాద్ కోటను దాని ఆకారం కారణంగానే దీనిని నక్షత్ర కోట అని పిలుస్తారు. 1792లో టిప్పు సుల్తాన్ ఈ కోటను ఫ్రెంచ్ ఇంజనీర్ల సహాయంతో నిర్మించారు, ఇది యూరోపియన్ శైలిలో ఉంటుంది. ఈ కోట 3,241 అడుగుల ఎత్తైన కొండపై దృఢమైన గ్రానైట్ రాళ్లతో నిర్మించబడింది.

ఈ కోటను సందర్శించడం నిజంగా ఒక సాహస యాత్ర. ఇక్కడ ఏడాది పొడవునా చల్లగా ఉంటుంది. దారిలో కాఫీ తోటల పరిమళం, పశ్చిమ కనుమల పచ్చదనం మనసును ఆహ్లాదపరుస్తాయి. కొండల నుంచి ప్రవహించే స్వచ్ఛమైన నీరు పాదాలను తాకుతుంటే చెప్పలేని ఆనందం కలుగుతుంది. మండు వేసవిలో కూడా ఈ కోటలోని గదులు చల్లగా ఉండటం దీని ప్రత్యేకత.
నక్షత్ర(Star) ఆకారంలో నిర్మించిన ఈ కోట మధ్యలో సరిగ్గా ప్లస్ ఆకారంలో ఒక బావి ఉండటం మరో వింత. వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పటికీ, ఈ బావిలో ఇప్పటికీ నీళ్లు ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ కోట గోడలు వాలుగా నిర్మించబడటం దీని నిర్మాణ శైలికి నిదర్శనం. మంజరాబాద్ కోట చరిత్ర, ప్రకృతి సౌందర్యం, మరియు సాహస ప్రియులకు ఒక అద్భుతమైన గమ్యస్థానం.




One Comment