Dhoni: ధోనీ రిటైర్మెంట్ అపుడే అట..
Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ధోనీ తాజా వ్యాఖ్యలు ఒకవైపు ఊరటగా మారినా..మరోవైపు మరోసారి ఉత్కంఠను రేపాయి.

Dhoni
చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ధోనీ (Dhoni)తాజా వ్యాఖ్యలు ఒకవైపు ఊరటగా మారినా..మరోవైపు మరోసారి ఉత్కంఠను రేపాయి. ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన తర్వాత తన భవిష్యత్ గురించి నెలకొన్న ఊహాగానాలకు చెక్ పెడుతూ ధోనీ ఓ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ రిటైర్‌మెంట్ ప్రకటిస్తారా? అనే ప్రశ్నకు మాత్రం మళ్లీ క్లారిటీ ఇవ్వకుండానే సమాధానంతో దాటవేశారు.
తన భవిష్యత్ గురించి స్పందిస్తూ ధోనీ(Dhoni).. నిర్ణయం తీసుకోవడానికి ఇంకా సమయం ఉంది. కానీ చెన్నై జెర్సీ గురించి మాట్లాడితే… నేను ఎప్పుడూ పసుపు జెర్సీలోనే ఉంటాను. ఆటగాడిగా కాదనుకోండి… కానీ సీఎస్కే(CSK)లో భాగంగా మాత్రం తప్పకుండా ఉంటాను. నా ఆటకు ముగింపు వచ్చిందా లేదా అనేది నా నిర్ణయమే. కానీ అభిమానులు భావోద్వేగంతో తలచుకునే రిలేషన్ మాత్రం ఎప్పటికీ కొనసాగుతుంది’’ అని ధోని చెప్పుకొచ్చారు.
2025 ఐపీఎల్ సీజన్‌లో గాయాల బారిన పడిన రుతురాజ్ గైక్వాడ్‌కు బదులుగా ధోనీ మళ్లీ కెప్టెన్సీ తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఈసారి సీఎస్కే ప్రదర్శన అనూహ్యంగా నిరుత్సాహం కలిగించేలా సాగింది. పాయింట్ల పట్టికలో జట్టు అట్టడుగున పడిపోవడంతో, అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈ ఫలితాలతో ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.

తాజా ప్రదర్శనలపై ధోనీ స్పష్టంగా స్పందిస్తూ, ‘‘మేము ఆశించిన విధంగా ఆడలేకపోయాం. తప్పులు చేశాం. కానీ వాటినుంచి పాఠాలు నేర్చుకుంటాం. గత ఏడాది కూడా మా ప్రదర్శనపై ఇదే ప్రశ్న వచ్చింది. కానీ ఈసారి ఆత్మవిశ్లేషణ అవసరం. మా దారిలో తిరిగి నిలబడతాం’’ అని ధోని చెప్పారు
ఐపీఎల్( IPL) ప్రారంభమైన 2008లో నుంచి చెన్నై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధోనీ, మొత్తం ఐదు టైటిళ్లు గెలిపించిన ఘనత సాధించారు. కెప్టెన్ కూల్ ధోనీ లీడర్‌షిప్ చాప్టర్ ఐపీఎల్‌లో చరిత్రలో నిలిచిపోతుంది. చెన్నై జట్టు తనకిచ్చిన స్థానం, అభిమానుల ప్రేమ గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘ఈ నగరం నాకు ఎంతో నేర్పింది. నేను ఒక ఆటగాడిగా మాత్రమే కాకుండా, వ్యక్తిగా ఎదగడానికి ఇది నాకు ఎంతో తోడ్పడింది. నేను సీఎస్కేకు ఎంతగానో అప్పగించాను, అదే విధంగా సీఎస్కే కూడా నన్ను తయారు చేసింది’’ అన్నారు.
ధోనీ తాజా మాటలు చూస్తే – తన ఆటగాడిగా పాత్ర ముగియకపోయినా, ముగిసినా… చెన్నై సూపర్ కింగ్స్‌తో తన అనుబంధం మాత్రం అసాధారణంగా కొనసాగనుందని స్పష్టమవుతోంది. ఆయన ఆట లేకపోయినా మెంటర్‌గా, సలహాదారుగా, లేదా మేనేజ్‌మెంట్‌లో కీలక బాధ్యతలో కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Also Read: Tirumala : ఇక శ్రీవారి దర్శనానికి క్యూలైన్లు అవసరం లేదు..
2 Comments