Sachin Tendulkar : ముంబైలో మెస్సీ మ్యాజిక్.. క్రికెట్ గాడ్ తో సాకర్ స్టార్
Sachin Tendulkar :యువ సాకర్ ప్లేయర్స్ ను గుర్తించే ప్రాజెక్ట్ మహాదేవాను మెస్సీ అధికారికంగా ప్రారంభించాడు. అనంతరం గాళ్స్ సాకర్ టీమ్స్ తో కాసేపు ఫుట్ బాల్ ఆడాడు.
Sachin Tendulkar
అర్జెంటీనా సాకర్ స్టార్ లియోనెల్ మెస్సీ భారత్ పర్యటన ఉత్సాహంగా సాగుతోంది. తొలిరోజు కోల్ కతాలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పటకీ, హైదరాబాద్ లో మాత్రం మెస్సీ టూర్ సూపర్ సక్సెస్ అయింది. ఇక్కడ నుంచి ముంబై వెళ్లిన ఈ సాకర్ స్టార్ కు అభిమానులు బ్రహ్మరథం పెట్టారు. సాకర్ ను అమితంగా ఇష్టపడే కొన్ని నగరాల్లో ఒకట ఉన్న ముంబై ఫ్యాన్స్ సాకర్ దిగ్గజానికి అపూర్వ స్వాగతం పలికారు.
చారిత్రక వాంఖేడే స్టే అభిమానులతో నిండిపోయింది. కోల్ కత్తా ఘటన దృష్ట్యా ముంబైలో భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారమే.. మెస్సీ పర్యటన ప్రశాంతంగా ముగిసేలా చేయడంలో అటు నిర్వాహకులు, ఇటు పోలీసులు విజయవంతమయ్యారు. మిత్రా స్టార్స్, ఇండియా స్టార్స్ మధ్య జరిగిన ఎగ్జిబిషన్ ఫ్రెండ్లీ మా అలరించింది. ఇండియా స్టార్స్ టీమ్ లో సెలబ్రిటీలు టైగర్ ప్రాఫ్, డినో మోరియా, హాక్ ప్లేయ బాలాడేవి ఆడారు.

మహారాష్ట్ర సీఎం దేవంద్ర ఫడ్నీవస్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, క్రికెటర్ హర్భజన్ సింగ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.. మెస్సీ స్టేడియంలోకి రాగానే అభిమానులు స్టాండింగ్ ఒవేషన్ తో వెల్ కమ్ చెప్పారు. అనంతరం సీఎం ఫడ్నీవస్ తో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)ను మెస్సీ కలిసాడు. ఈ సందర్భంగా సచిన్ మెస్సీకి తన టీమిండియా జెర్సీని కానుకగా అందజేశాడు. అలాగే మెస్సీ తాను ఆటోగ్రాఫ్ చేసిన ఫుట్ బాల్ ను బహుమతిగా అందించాడు. వీరిద్దరి జెర్సీ నెంబర్లు 10 కావడం, ఇద్దరు దిగ్గజాలు ఒకే చోట కనిపించడంతో స్టేడియం మొత్తం కేరింతలతో హోరెత్తిపోయింది.
ఈ సందర్భంగా యువ సాకర్ ప్లేయర్స్ ను గుర్తించే ప్రాజెక్ట్ మహాదేవాను మెస్సీ అధికారికంగా ప్రారంభించాడు. అనంతరం గాళ్స్ సాకర్ టీమ్స్ తో కాసేపు ఫుట్ బాల్ ఆడాడు. వారితో ముచ్చటించిన మెస్సీ స్టేడియం అంతటా తిరుగుతూ అభిమానులను పలకరించాడు. వారి పైకి ఫుట్ బాల్స్ కిక్ చేసి జోష్ పెంచాడు. ఈవెంట్ ప్రశాంతంగా ముగియడంతో నిర్వాహకులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. చివరిరోజు సోమవారం మెస్సీ ఢిల్లీ వెళ్లనున్నాడు. అరుణ్ జైట్ స్టేడియంలో ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ కు హాజరై పలువురు ప్రముఖులతో భేటీ కానున్నాడు. చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్ బాల్ క్లినిక్స్ నూ ప్రారంభించనున్నాడు. చివరిగా ప్రధాని నరేంద్రమోదీతో మెస్సీ సమావేశం కానున్నాడు.



