Just SpiritualJust LifestyleLatest News

Camphor:దేవుడికిచ్చే హారతి కర్పూరం వెనుకున్న అసలు సైన్స్ ఇదే..ఇది ఆరోగ్యానికి మంచిదేనా?

Camphor: వర్షాకాలం, చలికాలంలో గాలిలో ఉండే తేమ వల్ల వచ్చే బ్యాక్టీరియాను అరికట్టడానికి కర్పూర హారతి ఒక నేచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్‌గా పనిచేస్తుంది.

Camphor

హిందూ సంప్రదాయంలో పూజ ముగిశాక దేవుడికి ఇచ్చే కర్పూర (Camphor ) హారతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే, మారుతున్న కాలంలో కర్పూరం వాడకంపై రకరకాల అనుమానాలు మొదలయ్యాయి. కర్పూరం వెలిగించినప్పుడు అది నేరుగా ఘనరూపం నుంచి వాయురూపంలోకి మారుతుంది (దీనిని సైన్స్ భాషలో సబ్లిమేషన్ అంటారు). దీనివల్ల వెలువడే పరిమళం మనసుకి ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. అయితే, ఇది కూడా ఒక మండే పదార్థమే కాబట్టి, ఇది కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తుందా? దీనివల్ల ఊపిరితిత్తులకు ఏమైనా ఇబ్బందా? అనే ప్రశ్నలు చాలామందిలో తలెత్తుతాయి.

నిజమైన పచ్చ కర్పూరం (Natural Camphor) చెట్ల నుంచి లభిస్తుంది. దీనిని వెలిగించినప్పుడు వచ్చే పొగలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇది గాలిలోని హానికరమైన సూక్ష్మజీవులను చంపేస్తుంది. అలాగే వర్షాకాలం, చలికాలంలో గాలిలో ఉండే తేమ వల్ల వచ్చే బ్యాక్టీరియాను అరికట్టడానికి ఇది ఒక నేచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్‌గా పనిచేస్తుంది. అందుకే ఊరు వెళ్లి వచ్చాక తలుపులు తీయగానే వచ్చే అదొకరకమైన వాసన పోవాలంటే కర్పూరం వెలిగించమని పెద్దలు చెబుతూ ఉంటారు.

Camphor
Camphor

అంతేకాదు, కర్పూర (Camphor )వాసన పీల్చడం వల్ల శ్వాసనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోవడంతో పాటు..జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అందుకే జలుబు వచ్చినపుడు చిన్న క్లాత్‌లో కర్పూరం మూటకట్టి పీల్చమని చెబుతుంటారు.అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచడంలో కూడా కర్పూరానికి సాటి లేదు.

కాకపోతే ఏదైనా పదార్థం కాలినప్పుడు ఆక్సిజన్‌ను గ్రహించి కార్బన్ డై ఆక్సైడ్‌ను రిలీజ్ చేయడం సహజం. కర్పూరం కూడా దీనికి మినహాయింపు కాదు. అయితే, మనం పూజలో వెలిగించే కర్పూరం చాలా అంటే చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది కాబట్టి.. దానివల్ల వచ్చే కార్బన్ డై ఆక్సైడ్ మనిషికి హాని చేసేంత పరిస్థితి ఉండదు.

కానీ, ఇక్కడ మనం గమనించాల్సింది కర్పూర రకం గురించి. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న కర్పూరంలో ఎక్కువ శాతం ‘సింథటిక్’ లేదా కెమికల్స్ కలిపినవే ఉంటున్నాయి. పెట్రో కెమికల్స్ తో తయారయ్యే ఈ కర్పూరాన్ని వెలిగించినప్పుడు కార్బన్ మోనాక్సైడ్ వంటి ప్రమాదకర వాయువులు కూడా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల కళ్లు మండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగొచ్చు.

చాలా మంది కర్పూరం( Camphor) వెలిగిస్తే ఇంట్లో ఆక్సిజన్ తగ్గిపోతుందని భయపడతారు. కానీ, హారతి ఇచ్చే ఆ రెండు నిమిషాల సమయంలో గాలిలోని ఆక్సిజన్ లెవల్స్ లో పెద్దగా మార్పు రాదు. మరికొందరైతే కర్పూరం పొగను ఎంత ఎక్కువ పీలిస్తే అంత మంచిదని భావిస్తారు. ఏదైనా సరే అతిగా పీలిస్తే ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపిస్తుంది. ఆస్తమా, అలర్జీ ఉన్నవారు కర్పూర పొగకు కొంచెం దూరంగా ఉండటమే వారి ఆరోగ్యానికి మంచిది.

మనం వాడేది సహజమైన పచ్చ కర్పూరం అయితే అది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. సంప్రదాయం ప్రకారం హారతిని కళ్లకు అద్దుకోవడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని కనుక చూస్తే.. ఆ వేడిని, పరిమళాన్ని మన ఇంద్రియాలకు అందించడం మన మనసులో ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేటం చేయడమే. అందుకే కెమికల్ కర్పూరానికి దూరంగా ఉండి, సహజమైన కర్పూరాన్ని వాడితే అది మనసుకు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Related Articles

Back to top button