Just SportsLatest News

Virat Kohli: కోహ్లీ 17 ఏళ్ల జర్నీ.. ఒక ప్లేయర్ కాదు, ఒక ఎమోషన్!

Virat Kohli:విరాట్ తన ఆటలో ఒక బలమైన ముద్రను వేశాడు. ప్రత్యర్థులను స్లెడ్జింగ్ చేసేటప్పుడు, తన బ్యాట్‌తోనే వారికి పవర్‌ఫుల్ ఆన్సర్ ఇవ్వడం అతని ట్రేడ్ మార్క్.

Virat Kohli

విరాట్ కోహ్లీ.. ఒక పేరు కాదు, ఒక ఫైర్! ఒక ప్లేయర్ కాదు, ఒక ఎమోషన్! కోట్లాది మంది కలలకు సరికొత్త నిర్వచనం చెప్పిన శక్తి..2008లో ఫస్ట్ బాల్ ఆడింది మొదలుకొని, ఈ 17 ఏళ్ల జర్నీలో కోహ్లీ కేవలం రికార్డులే బ్రేక్ చేయలేదు, ఒక కొత్త మైండ్ సెట్ క్రియేట్ చేశాడు. పడిలేచిన కెరటంలా..మాటలతో కాదు, తన బ్యాట్ తోనే స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చి యూత్ కాన్ఫిడెంట్‌గా మారాడు. ఇది ఓ క్రికెటర్ ప్రయాణం కాదు.. ఒక తరం కలలకు దారి చూపిన ఒక కథ!

విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటగాడుగానే కాకుండా ఒక భావోద్వేగంగా మారాడు. అతని బ్యాటింగ్, ఆట తీరు చూసిన ప్రతీ ఒక్కరికీ అతను తమలోని ఒకడిలానే అనిపిస్తాడు. మ్యాచ్ కీలక దశల్లో కోహ్లీ బ్యాటింగ్‌ చూసినప్పుడు అది ఒక కళాఖండంలా ఉంటుంది. అతను క్రీజులో ఉన్నాడంటే.. ఎన్ని పరుగులు కావాలన్నా, ఎంత ఒత్తిడి ఉన్నా.. ఆఖరి బంతి వరకు పోరాడు అనే భావన మనల్ని వదలదు.

Virat Kohli
Virat Kohli

కోహ్లీ (Virat Kohli)విజయ ప్రస్థానం ఒక వారసత్వంతో వచ్చింది కాదు. కేవలం అతని ప్రతిభ, హార్డ్ వర్క్, డెడికేషన్తోనే పైకి ఎదిగిన ఆటగాడు. అందుకే యువతకు ఒక ఐకాన్‌గా మారాడు. ఫీల్డ్, రన్నింగ్, ఫిట్‌నెస్… ఇలా ప్రతి విషయంలోనూ ఒక కొత్త ఫిట్‌నెస్ కల్చర్‌ను అతను దేశానికి పరిచయం చేశాడు. అతన్ని చూసి ఎంతో మంది యువకులు క్రికెటర్లే కాదు, అసలైన అథ్లెట్స్‌గా మారారు. ఫామ్ కోల్పోయినప్పుడు రెండు కోట్ల ట్రోల్స్‌కి గట్టిగా సమాధానం చెప్పకుండా, నిశ్శబ్దంగా తన ఆటతోనే సమాధానం చెప్పి విజయాన్ని సాధించిన ఇన్‌స్పిరేషన్.

విరాట్ తన ఆటలో ఒక బలమైన ముద్రను వేశాడు. ప్రత్యర్థులను స్లెడ్జింగ్ చేసేటప్పుడు, తన బ్యాట్‌తోనే వారికి పవర్‌ఫుల్ ఆన్సర్ ఇవ్వడం అతని ట్రేడ్ మార్క్. ఆటలో భావోద్వేగాలను అతను ఎప్పటికీ వదిలిపెట్టడు. ఒక రన్-ఛేజ్ సమయంలో, ఆఖరి బంతి వరకు పోరాడే తత్వం అతనిది. అందుకే అతను ‘రన్-ఛేజ్ కింగ్’ అయ్యాడు. విరాట్ క్రీజులో ఉన్నంతవరకూ భారత్ గెలుస్తుందనే ఒక ప్రత్యేకమైన మ్యాజిక్ ఉంటుంది. కెప్టెన్‌గా అతను మొదట తనను తాను ఆడాలనే ఆలోచన ఉండదు.. జట్టును ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నదే అతని ప్రధాన లక్ష్యం.

Virat Kohli
Virat Kohli

విదేశీ మైదానాల్లో, ప్రత్యర్థులు స్లెడ్జింగ్‌తో రెచ్చగొడుతున్నప్పుడు, మీ బౌలింగ్‌ను కూడా ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు” అన్నట్టు తన బ్యాట్‌తోనే సమాధానం ఇవ్వడం కోహ్లీకి తెలిసినంతగా మరే ఆటగాడికి తెలీదంటే అది అతిశయోక్తి కాదు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి కఠినమైన పిచ్‌లపై కూడా అతను తిరుగులేని పోరాట పటిమను చూపించాడు.

విరాట్ కోహ్లీ (Virat Kohli)17 ఏళ్ల పాటు క్రికెట్‌లో కేవలం రన్స్‌ మాత్రమే కాదు.. లక్షల మందికి ఆశను, వందల మందికి మార్గదర్శక శక్తిని ఇచ్చాడు. అతను తన కష్టంతో, క్రమశిక్షణతో ప్రతీ ఒక్కరికీ ప్రేరణగా నిలిచాడు. అందుకే ఈ రోజు అతను కేవలం ఆటగాడు కాదు, భారత క్రికెట్‌కు స్ఫూర్తిగా.. యావత్ యువతకి ఒక ఐకాన్‌గా నిలుస్తున్నాడు.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button