Aadhaar card :ఆధార్ కార్డు చిటికెలో డౌన్‌లోడ్ .. ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన పని కూడా లేదు
Aadhaar card :కేవలం ఆధార్ మాత్రమే కాకుండా పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, టెన్త్ క్లాస్ మార్క్స్ మెమోలను కూడా ఇదే పద్ధతిలో పొందొచ్చు.
Aadhaar card
భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు (Aadhaar card)అనేది అత్యంత కీలకమైన ఐడెండిటీ కార్టు అని తెలిసిందే. బ్యాంకు పనుల నుంచి ప్రభుత్వ పథకాల వరకు ప్రతిదానికీ ఆధార్ కార్డు(Aadhaar card ) తప్పనిసరి. అయితే, చాలా సందర్భాల్లో మనం బయటకు వెళ్లినప్పుడు ఆధార్ కార్డు వెంట తీసుకెళ్లడం మర్చిపోతుంటాం .. ఒరిజినల్ కార్డు పోయే అవకాశం ఉంటుంది.
ఇలాంటి సమయాల్లో మీ ఫోన్‌లోనే ఆధార్ కార్డు(Aadhaar card )ను డౌన్‌లోడ్ చేసుకోవడం ఇప్పుడు మరింత ఈజీ అయిపోయింది. గతంలో దీని కోసం నెట్ సెంటర్లకు వెళ్లాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు మీ వాట్సాప్ ద్వారానే కేవలం కొన్ని సెకన్లలో ఆధార్ కార్డును పొందొచ్చు.
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘డిజిలాకర్’ (DigiLocker) సేవలను ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా వినియోగించుకోవచ్చన్న విషయం ఇంకా చాలామందికి తెలియడం లేదు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక హెల్ప్ డెస్క్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ముందుగా మీ మొబైల్‌లో ప్రభుత్వ అధికారిక నెంబర్ అయిన 9013151515ను సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి ఆ నెంబర్‌కు హాయ్(Hi) లేదా నమస్తే( Namast) అని మెసేజ్ పంపాలి. వెంటనే మీకు కొన్ని ఆప్షన్లు వస్తాయి. అందులో డిజీ లాకర్ సర్వీసెస్(DigiLocker Services)ను ఎంచుకోవాలి. మీ వద్ద డిజిలాకర్ అకౌంట్ ఉంటే ఎస్ (Yes) అని, లేకపోతే కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలని అడుగుతుంది.

ఆ తర్వాత మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను దానిలో ఎంటర్ చేయాలి. వెంటనే మీ ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ (OTP) వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే, మీ ఆధార్ కార్డు పీడీఎఫ్ (PDF) రూపంలో మీకు వాట్సాప్‌లో పంపబడుతుంది.
దీనిని మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రింట్ తీసుకోవచ్చు లేదా అధికారులకు దానిలోనే చూపించొచ్చు. ఇది పూర్తి సురక్షితమైన పద్ధతి. కేవలం ఆధార్ మాత్రమే కాకుండా పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, టెన్త్ క్లాస్ మార్క్స్ మెమోలను కూడా ఇదే పద్ధతిలో పొందొచ్చు.
దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, ఎక్కడికి వెళ్లినా మీ డాక్యుమెంట్స్ మీ ఫోన్ లోనే భద్రంగా ఉంటాయి. ఇప్పటికే చాలామంది Venezuela:చమురు దోచుకునేందుకే ఈ ప్లాన్..ట్రంప్‌పై వనిజులా ప్రెసిడెంట్ ఫైర్ దీనిని వాడుతున్నారు. కానీ ఇంకా చాలామందికి డిజీ లాకర్‌పై అవగాహన పెంచుకోవాలని అధికారులు చెబుతున్నారు.
Venezuela:చమురు దోచుకునేందుకే ఈ ప్లాన్..ట్రంప్‌పై వెనిజులా ప్రెసిడెంట్ ఫైర్




One Comment