Shibhu Soren: తెలంగాణ రాష్ట్ర సాధన అనే ఆలోచనకు ఆదర్శం..అతను !
Shibhu Soren: తెలంగాణ రాష్ట్ర సాధనకు పునాది ఆలోచనగా నిలిచిన నాయకుల్లో ఎవ్వరినైనా ప్రస్తావించినా శిభు సోరెన్ పేరు ముందే వస్తుంది. ఎందుకంటే

Shibhu Soren
తెలంగాణ రాష్ట్ర సాధనకు పునాది ఆలోచనగా నిలిచిన నాయకుల్లో ఎవ్వరినైనా ప్రస్తావించినా శిభు సోరెన్ పేరు ముందే వస్తుంది. ఎందుకంటే “ప్రత్యేక రాష్ట్రం” కోసం దశాబ్దాల (decades) పాటు అశ్రంతమైన పోరాటం సాగించిన నాయకుడు.. శిభు సోరెన్(Shibhu Soren). జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం వేసిన ఆయన ప్రయాణం, తెలంగాణ ఉద్యమానికి స్పష్టమైన మార్గదర్శకంగా నిలిచింది.
తెలంగాణలో ఎంతోమంది ఉద్యమకారులు, విద్యార్థులు, నేతలు కూడా అప్పట్లో శిభు సోరెన్(Shibhu Soren) నడిపిన జార్ఖండ్ ఉద్యమం నుంచే స్ఫూర్తి పొందారు. ఎందుకంటే ఆయన చూపిన తెగువ, రాజ్యాంగానుకూల మార్గం, ఢిల్లీ పెద్దల ముందు వేసిన ఒత్తిడి, పార్లమెంటులో లాబీయింగ్ పద్ధతులు అన్నీ కూడా తెలంగాణ సాధన దిశగా ఎంతో ఉపయోగపడ్డాయి.
భారతదేశంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి ఉద్యమానికి ఒక పునాదిలాంటి వ్యక్తి ఉంటారు. అలాగే జార్ఖండ్ ఉద్యమానికి అర్థం చెప్పే పేరు కూడా శిభు సోరెన్‌దే. ఆయన పేరు వినగానే మొదట గుర్తుకు వచ్చే అంశం, ఆదివాసీల కోసం సాగించిన సంకల్పయుక్త పోరాటం. గురూజీగా ఆదరింపబడిన శిభు సోరెన్ (Shibhu Soren), ఓ సామాన్య కుటుంబంలో జన్మించి, అసామాన్య నాయకుడిగా ఎదిగారు.
1944 జనవరిలో బిహార్ రాష్ట్రంలోని నెమ్రా గ్రామంలో జన్మించిన శిభు సోరెన్, తన తండ్రి మాహాజనుల చేత హత్యకు గురయ్యాడన్న విషయంతో తీవ్రంగా చలించిపోయారు. అదే సంఘటన ఆయనను సామాజిక న్యాయ బాటలోకి నడిపించింది. ఈ పరిణామం కేవలం వ్యక్తిగత బాధగా ఆగిపోకుండా .. ఆయన చుట్టూ ఉన్న ఆదివాసీ సమాజానికి ఒక ఆశగా మారింది.

1972లో జార్ఖండ్ ముఖ్తి మోర్చా స్థాపన, 1980లో ఎంపీగా ఎన్నికయ్యాక జాతీయ స్థాయిలో ఆదివాసీ హక్కులు, భూముల సాధన కోసం ఆయన నడిపిన ఉద్యమం .. జాతీయ రాజకీయాల్లో దృష్టిని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వైపు మళ్లించింది. ప్రత్యేక రాష్ట్రాల ఆవశ్యకతపై పార్లమెంటులో చేసిన చర్చల్లో ఆయన వాదనలు తెలంగాణ ఉద్యమకారులకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి.
మూడు సార్లు జార్ఖండ్(Jharkhand) ముఖ్యమంత్రిగా, మూడుసార్లు కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన శిభు సోరెన్, అధికారంలో ఉన్నా .. తన జన్మభూమికి అంకితంగా ఉన్న నేతగా పేరు సంపాదించారు. కేంద్రంలో కోయిలా మంత్రిగా ఉన్నప్పుడూ, రాష్ట్రం కోసం పోరాటం ఆపలేదు.
తెలంగాణ ఉద్యమంలో భాగంగా పనిచేసిన నాయకులు, సంఘాలు.. అప్పట్లో జార్ఖండ్ ఉద్యమాన్ని ఉదాహరణగా చెప్పుకునేవారు. అక్కడ సాధ్యమైతే, మాకెందుకు కాదని?” అన్న నమ్మకాన్ని ప్రజల్లో నింపిన నాయకుడు శిభు సోరెన్. ప్రత్యేక రాష్ట్రం సాధ్యం అనే అభిప్రాయానికి ఆయన జీవితం ఒక నిదర్శనంగా మారింది.
అన్ని రాజకీయ జీవితాల్లాగే శిభు సోరెన్ ప్రస్థానంలోనూ వివాదాలున్నాయి. 1975నాటి అల్లర్ల కేసు, 1994 కార్యదర్శి హత్య కేసు… ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నారు. కానీ చివరకు ఎక్కువ కేసుల్లో ఆయన నిర్దోషి అని తేలింది. 2008, 2010లలో కోర్టులు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చాయి.
మొత్తంగా శిభు సోరెన్ జీవితమే ఒక ఉద్యమ గ్రంథం. ఆదివాసీ హక్కుల కోసం రాజీ పడని నేతగా, జార్ఖండ్ గుండె చప్పుడిగా గుర్తుండిపోయే నాయకుడిగా చరిత్రలో నిలిచారు. వివాదాలు వచ్చినా ఆయన చేసిన సేవలు, సాధించిన విజయాలు తార్కికంగా ఆయన్ని జార్ఖండ్ మౌన శంఖనాదంగా నిలబెట్టాయి.
Also Read: Liquor : మందుబాబులకు గుడ్ న్యూస్: ఏపీలో కొత్త మద్యం పాలసీ రెడీ