Kavitha: కవితపై బీఆర్ఎస్ కౌంటర్ ఎటాక్.. కేసీఆర్ ఆదేశాలతోనే ఎదురుదాడి ?
Kavitha: గతంలో కవిత చేసిన వ్యాఖ్యలకు గతంలో బీఆర్ఎస్ నేతలు సీరియస్‌గా స్పందించలేదు. కేసీఆర్ నుంచి ఆదేశాలు రావడంతో కౌంటర్ ఎటాక్ మోడ్‌తో వెళ్తున్నారు.
Kavitha
కల్వకుంట్ల కవిత(Kavitha) విషయంలో బీఆర్ఎస్ అధినేత కీలక నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కవిత చేసే ప్రతి అంశాన్ని అదే స్థాయిలో తిప్పికొట్టాలని అధిష్టానం నుంచి నేతలకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కొంచెం సమన్వయం వ్యవహరించినా ఇక నుంచి వెనక్కి తగ్గకూడదంటూ గులాబీ బాస్ కేసీఆర్ డిసైడైనట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది.
గతంలో కవిత చేసిన వ్యాఖ్యలకు గతంలో బీఆర్ఎస్ నేతలు సీరియస్‌గా స్పందించలేదు. కేసీఆర్ నుంచి ఆదేశాలు రావడంతో కౌంటర్ ఎటాక్ మోడ్‌తో వెళ్తున్నారు. నేతలు వరుసపెట్టి కవితకు కౌంటర్లు ఇస్తున్నారు.
ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై కవిత(Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ వాళ్లు సోషల్ మీడియాలో ఉద్యమం చేస్తున్నారు తప్ప గ్రౌండ్‌లో చేయలేదన్నారు. అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటేనేప్రతిపక్ష పార్టీ ఏ స్థాయిలో పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు.
కృష్ణార్జునుల్లా…కేటీఆర్ – హరీశ్ రావు సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ లేదని విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో కుట్రలు కూడా జరిగాయన్న ఆమె సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్ని చెబుతానంటూ బాంబు పేల్చారు.

బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో పని చేయలేదనేది ఈ ఓటమితోనే స్పష్టంగా కనిపించిందన్నారు. క్షేత్రస్థాయిలో పెద్దగా పని చేయలేదని,ప్రజల కోరిక మేరకు బీఆర్ఎస్ పోరాడితే… ఫలితం మరోలా ఉండేందని అభిప్రాయపడ్డారు. రెడ్డిపల్లిలో 400 ఎకరాల ఫాంహౌస్ కట్టారన్న కవిత దీని కోసం రీజినల్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్చారని ఆరోపించారు. దీంతో కవిత చేస్తున్న ఆరోపణలు, విమర్శలు, బీఆర్ఎస్ పార్టీని, ఆ నేతలను.
ఇరుకున పడేస్తున్నాయి. ఇటీవల విద్యావ్యవస్థపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో డైరెక్టుగానే గులాబీ పార్టీని టార్గెట్ చేశారు. కేసీఆర్ పాలనను మెచ్చుకుంటూనే మంత్రులను టార్గెట్ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో కవితపై బీఆర్ఎస్ నేతలకు కొత్త అనుమానాలు వస్తున్నాయి. కవితకు రేవంతరెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఫండింగ్ చేస్తోందని డౌట్ పడుతున్నారు.
కాంగ్రెస్ డైరెక్షన్‌లోనే బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తున్నారని భావిస్తున్నారు. దీంతో కవిత వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతలు అదే స్థాయిలో తిప్పికొడుతున్నారు. కేసీఆర్ కూడా కీలక సూచనలు ఇవ్వడంతోనే గులాబీ పార్టీ నేతలు ఒక్కసారిగా కవితపై స్వరం పెంచారు. పార్టీ నుంచి వెళ్లిపోయినా నిన్నటి వరకూ గులాబీ బాస్ కుమార్తెగా కాస్త గౌరవం ఇచ్చిన నేతలంతా ఇప్పుడు ప్రతివిమర్శలకు దిగిపోయారు. దీంతో కవిత(Kavitha)పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.



