IBomma: పోలీసులకే వార్నింగ్ ఐబొమ్మ తెగింపుకు కారణమేంటి ?
IBomma: ప్రస్తుతం ఐబొమ్మ చేసిన ప్రకటన తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఇంత తెగింపుగా ఐబొమ్మ పోలీసులకే వార్నింగ్ ఇవ్వడం అందరినీ షాక్ గురిచేస్తోంది.

IBomma
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పైరసీ అంశం హాట్ టాపిక్ గా మారింది. థియేటర్లోకి కొత్త సినిమా రిలీజయిన రోజే నెట్టింట ఫుల్ మూవీ పైరసీ రూపంలో వచ్చేస్తోంది. రెండు, మూడురోజులు ఆగితే హెచ్ డీ క్వాలిటీతో పలు వెబ్ సైట్లలో దర్శనమిస్తోంది. చాలా కాలంగా ఈ తంతు జరుగుతున్నా ఇటీవల కాలంలోనే సినిమాపెద్దలు పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేస్తూ ఒత్తిడి పెంచారు. ఫలితంగా తెలంగాణ పోలీసులు కొన్ని పైరసీ ముఠాలను పట్టుకున్నాయి. వీటి వెనుక పెద్ద నెట్ వర్కే ఉందని గుర్తించాయి.
త్వరలోనే అసలు సూత్రధారులను పట్టుకుంటామంటూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటన చేసిన మరుసటి రోజే పైరసీ మూవీలను అందించే ఐబొమ్మ (IBomma)వెబ్ సైట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ పోలీసులకే వార్నింగ్ ఇచ్చింది.
ఎంతమంది వచ్చినా తమను ఏమీ పీకలేరంటూ డైరెక్ట్ గా ప్రకటించింది. తన అధికార వెబ్ సైట్ లో ఈ వార్నింగ్ ప్రకటన పోస్ట్ చేసింది. గతంలో ఫిల్మ్ ఛాంబర్ కు కూడా వార్నింగ్ ఇచ్చిన చరిత్ర ఐబొమ్మ(IBomma)కు ఉంది. ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ ను, పోలీసులకు డైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపుతోంది. ఐబొమ్మ ఇచ్చిన ప్రకటన చూస్తే మీరు మా మీద ఫోకస్ చేస్తే… మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తామని పేర్కొంది.

నిర్మాతలు సినిమాను డిస్ట్రిబ్యూటర్స్ కు అమ్మిన తర్వాత, టికెట్ రేట్లు పెంచేసి దోచుకుంటున్నారని, ఓటీటీకి భారీ మొత్తం అమ్మేసి సొమ్ముచేసుకుంటున్నారంటూ విమర్శించింది. అసలు హీరోలకు భారీ పారితోషకాలు ఇవ్వడాన్ని ప్రశ్నించింది. విదేశాల్లో షూటింగ్స్ చేస్తూ బడ్జెట్ ను పెంచుకోవడం దేనికంటూ ప్రశ్నించింది. బడ్జెట్ పెంచేసి, తర్వాత దానిని రికవరీ చేసుకోవడానికి సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళపై టికెట్ ధరలు పెంచేస్తూ దోచుకుంటున్నారంటూ వార్నింగ్ ప్రకటనలో పేర్కొంది. మొదల కెమెరా ప్రింట్స్ తో వెబ్ సైట్ లో రిలీజ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీరు అనుకున్నంత మంచివాళ్ళం తాము కాదంటూ, సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. మీ యాక్షన్ మా రియాక్షన్ కూడా ఉంటుందంటూ వార్నింగ్ ఇచ్చింది. 5 కోట్ల మంది యూజర్ల డేటా తమ దగ్గర ఉందని కూడా చెప్పింది. అలాగే ప్రముఖులకు సంబంధించి సంచలన విషయాలు కూడా బయటపెడతామంటూ బెదిరించింది.
ప్రస్తుతం ఐబొమ్మ చేసిన ప్రకటన తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఇంత తెగింపుగా ఐబొమ్మ పోలీసులకే వార్నింగ్ ఇవ్వడం అందరినీ షాక్ గురిచేస్తోంది. అసలు వారి ప్రకటన వెనుక అసలు సంగతి ఏంటా అని పలువురు చర్చించుకుంటున్నారు. యూజర్ల డేటా, ప్రముఖుల విషయాలు తెలుసు అంటూ బెదిరిస్తున్న ఐబొమ్మ నిర్వాహకుల కోసం పోలీసులు తీవ్రంగానే గాలిస్తున్నారు. అయితే ఐబొమ్మ వార్నింగ్ ప్రకటనపై తెలంగాణ పోలీసులు ఇప్పటి వరకూ స్పందించలేదు.