Konda Surekha: నాగార్జునతో సురేఖ వివాదం.. క్షమాపణతో డ్యామేజ్ రిపేర్ అవుతుందా?
Konda Surekha: సినీ నటుడు నాగార్జున కుటుంబం గురించి, నటి సమంత గురించి గతంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో, సినీ పరిశ్రమలో పెద్ద దుమారాన్నే రేపాయి.
Konda Surekha
ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులుగా నాగార్జున, కొండా సురేఖ(Konda Surekha) ఇష్యూ హాట్ టాపిక్‌గా నడుస్తోంది. చివరకు ఇద్దరి మధ్య రాజీ కుదిరినందుకు చాలామంది సంతోషం వ్యక్తం చేశారు. నిజానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ(Konda Surekha) సినీ నటుడు నాగార్జున కుటుంబం గురించి, నటి సమంత గురించి గతంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో, సినీ పరిశ్రమలో పెద్ద దుమారాన్నే రేపాయి. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకురాలు(Konda Surekha) వ్యక్తిగత జీవితాల గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.
దీనిని సీరియస్‌గా తీసుకున్న నాగార్జున, తమ కుటుంబ పరువుకు భంగం కలిగించినందుకు గానూ న్యాయస్థానాన్ని (Court) ఆశ్రయించారు. అయితే, కోర్టు తీర్పునకు ముందే కొండా సురేఖ క్షమాపణ (Apology) చెప్పడం, దాని తర్వాత నాగార్జున ఆ కేసును ఉపసంహరించుకోడం (Withdrawal) అంతా కూల్‌గానే జరిగిపోయాయి . అయితే
ఇదంతా ఓకే కానీ.. అనాల్సిన మాటలు అనేసి వారి పరువు మొత్తం తీసి ఇప్పుడు సారీ చెబితే డ్యామేజ్ కవర్ అయిపోతుందా అన్న ప్రశ్నలు మాత్రం ఓ రేంజ్‌లో వినిపిస్తున్నాయి. నాగార్జున పెద్ద మనసుతో వదిలేసినా.. పవర్ ఉన్న నాయకులు తమ మాట విషయంలో ఎంతగా బాధ్యత వహించాలి ఈ విషయాన్ని మరిచిపోతే ఎలా అన్నఅంశం మరోసారి తెరపైకి వస్తోంది.
నోరు జారడం – రాజకీయాల్లో ప్రమాదకరమైన ట్రెండ్…కొండా సురేఖ వంటి ప్రముఖ రాజకీయ నాయకులకు, బహిరంగ వేదికల ముందు తమ మాటలపై పూర్తి నియంత్రణ (Self-control)తో పాటు బాధ్యత కూడా ఉండాలి. అయినా కూడా, రాజకీయ ఒత్తిడి, భావోద్వేగపూరితమైన వాతావరణం, లేదా పబ్లిసిటీ కోసం అతి ఉత్సాహంగా మాట్లాడటం అనేది ఇటీవలి రాజకీయాల్లో ఒక నెగెటివ్ ట్రెండ్‌గా మారింది.
నాయకులు ‘నోరు జారడానికి’ ప్రధాన కారణాలు..పార్టీలో అంతర్గత పోటీ, తమ నాయకత్వ హోదాను బలంగా నిలబెట్టుకోవాలనే ప్రయత్నం, ప్రత్యర్థులపై ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనే తాపత్రయం.
నిత్యం మీడియా రష్, వార్తా ఛానెల్స్, ప్రజల మధ్య ఉండే నాయకులు కొన్నిసార్లు తమ అసహనాన్ని, అగ్రహాన్ని నియంత్రించుకోలేకపోవడం దీనికి కారణాలవుతున్నాయి
సోషల్ మీడియా యుగంలో, తమ వ్యాఖ్యలు త్వరగా వైరల్ అవ్వడానికి, వార్తల్లో ఉండటానికి కొన్నిసార్లు అసంబద్ధమైన, లేదా అవమానకరమైన పదాలను ఉపయోగించడం కూడా దీనికి కారణమే.
పార్లమెంటరీ డిసిప్లిన్ లోపం క్లియర్ గా కనిపిస్తోంది. స్పందించేటప్పుడు ఉపయోగించాల్సిన పదజాలం , నియమాలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన బాధ్యతను మరచిపోతున్నారు.

ఇక అసలు విషయంలోకి వస్తే..నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యల తర్వాత విమర్శలు తీవ్రం కావడంతో, కొండా సురేఖ(Konda Surekha) క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత నాగార్జున కోర్టులో కేసును ఉపసంహరించుకోవడం ద్వారా ఈ వివాదానికి తెరపడింది. కానీ, కేవలం ‘సారీ’ చెప్పడం, కేసు వెనక్కి తీసుకోవడం వల్ల జరిగిన డ్యామేజ్ పూర్తిగా రిపేర్ అవుతుందా అనేది ముఖ్యమైన ప్రశ్న.
విమర్శలు వైరల్ అవడంతో..నాగార్జున కుటుంబానికి, సమంతకు జరిగిన వ్యక్తిగత అవమానం, సామాజిక ఇమేజ్ డ్యామేజ్ ఈజీగా పోదు .
అలాగే పదేపదే ఇలాంటి వివాదాల్లో ఇరుక్కుంటే, ప్రజల్లో నాయకుడి యొక్క మానసిక నాణ్యత , విశ్వసనీయత దెబ్బతింటుంది. మాటలపై నియంత్రణ లేని నాయకుడిపై ప్రజలు విశ్వాసం కోల్పోతారు.
ముందుగా ఇష్టమొచ్చినట్లు మాట్లాడి, ఆ తర్వాత ‘సారీ’ చెప్పి తప్పించుకునే ఈ ‘అపాలజీ కల్చర్’ (Apology Culture) ను ప్రజలు తేలికగా తీసుకోరు. డ్యామేజ్ అయిన పరువును పూర్తిగా తిరిగి పొందడం నేటి మీడియా హంగామా రాజకీయాల్లో చాలా కష్టమైన విషయం.
ఈ నెగెటివ్ ట్రెండ్ ఎందుకు ఆగడం లేదు అంటే..రాజకీయ నాయకులు తమ మాటల విలువ మరియు వాటి పర్యవసానాలను (Repercussions) తెలుసుకోకపోవడమే ఈ బాధ్యతారాహిత్యానికి కారణం. రాజకీయ సామర్థ్యం, వ్యక్తిగత పౌష్టికత (Integrity) , బాధ్యత అనేవి పదవికి అత్యంత కీలకమని మర్చిపోవడమే.
రాజకీయ నాయకులు మాట్లాడే మాటలే సమాజంలో ఒక ప్రామాణికతను (Standard) నిర్దేశిస్తాయి. భవిష్యత్తులో విశ్వసనీయత , నాయకత్వ పరువు కాపాడుకోవాలంటే, నాయకులు తమ భావోద్వేగాలను నియంత్రించుకుని, తాము మాట్లాడుతున్న ప్రతి మాటపై బాధ్యత వహించాలి. ఈ ట్రెండ్‌ను ఆపగల చివరి జడ్జ్ ప్రజలు, మీడియా , పార్టీ వ్యవస్థ .. అన్నిటికి మించి వారి పూర్తి విజ్ఞత మాత్రమే .



