Holidays: స్కూల్స్‌కు భారీగా శెలవులు..ఈ వారంలోనే మూడు రోజులు
Holidays: తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు అంటే మొత్తం 13 రోజుల పాటు దసరా సెలవులను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 2 వ తేదీ వరకు శెలవులు ఇవ్వడంతో ..ఏపీలో దసరా సెలవుల కన్నా తెలంగాణలో ఈసారి సెలవులు ఎక్కువగా ఉన్నాయి.

Holidays
సెప్టెంబర్ నెల అంటే పరీక్షల సందడి, పాఠాల హడావిడి మాత్రమే కాదు, ఈసారి తెలంగాణ విద్యార్థులకు వరుస సెలవులతో పండుగ వాతావరణం కనిపించనుంది. తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, ఈ నెలలో ఏకంగా 13 రోజులు పాఠశాలలకు సెలవులు (Holidays)ఉన్నాయి. దసరా, బతుకమ్మ పండుగలతో పాటు, వారాంతపు సెలవులు కూడా కలసి రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఈ నెలలో నాలుగు ఆదివారాలు (సెప్టెంబర్ 7, 14, 21, 28) సహా, రెండో శనివారం కూడా సెలవు దినం(Holidays)గా ఉండనుంది. దీంతో విద్యార్థులకు మొత్తం ఐదు రోజులు వారాంతపు సెలవులు లభించనున్నాయి.
Brahmotsavam: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. అంగరంగ వైభవంగా సాలకట్ల ఉత్సవాలు
వారాంతపు సెలవుల(Holidays)తో పాటు, కొన్ని ముఖ్యమైన పండుగలకు కూడా సెలవులు ఉన్నాయి. సెప్టెంబర్ 5 న “ఈద్ మిలాద్ ఉన్ నబీ” పండుగను పురస్కరించుకుని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు సెలవు ప్రకటించాయి. కేరళలో ఇదే రోజున ఓనమ్ పండుగ కూడా జరుగుతుంది. సెప్టెంబర్ 6న వినాయక చవితి తర్వాత వచ్చే వినాయక నిమజ్జనం రోజున తెలంగాణవ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ఉంటుంది. కానీ ఏపీలో ఉండకపోవచ్చు. ఇక ఆదివారం ఎలాగూ శెలవు కాబట్టి తెలంగాణలో వరుసగా మూడు రోజుల శెలవులు వచ్చినట్లు అవుతుంది.

సెప్టెంబర్ నెలలో అత్యంత ముఖ్యమైన సెలవులు బతుకమ్మ , దసరా పండుగలకు ఉన్నాయి. పాఠశాలలకుసెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు అంటే మొత్తం 13 రోజుల పాటు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 2 వ తేదీ వరకు శెలవులు ఇవ్వడంతో ..ఏపీలో దసరా సెలవుల కన్నా తెలంగాణలో ఈసారి సెలవులు ఎక్కువగా ఉన్నాయి. అయితే దసరా సెలవుల్లోనే అక్టోబర్ 2న వచ్చే గాంధీ జయంతి కూడా కలసిపోతుంది.
ఈ వరుస సెలవులు విద్యార్థులకు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా, పండుగలను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తాయి.