Just TelanganaLatest News

School fee: నర్సరీ ఫీజు రూ. 2.51 లక్షలేనట.. చదువు‘కొందాం’ రండి

School fee: ఇది కేవలం ఒక స్కూలుకు సంబంధించిన ఫీజు మాత్రమే కాదు, విద్య అనేది ఒక వ్యాపారంగా ఎలా మారిపోయిందో చెప్పే చేదు నిజం

School fee

భారతీయ మధ్యతరగతి తల్లిదండ్రుల కలలన్నీ కల్లలవుతున్నాయి. ఒకప్పుడు పిల్లలకు మంచి చదువు కోసం ఆస్తులు అమ్ముకోవాలనేది ఒక డైలాగ్‌ మాత్రమే. కానీ, ఇప్పుడు అది నిజం కాబోతోంది. హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ప్రైవేట్ స్కూల్ అడ్మిషన్ ఫీజు ఏకంగా రూ. 2.51 లక్షలుగా ప్రకటించడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఇది కేవలం ఒక స్కూలుకు సంబంధించిన ఫీజు మాత్రమే కాదు, విద్య అనేది ఒక వ్యాపారంగా ఎలా మారిపోయిందో చెప్పే చేదు నిజం.

ఈ వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. ఒక పేరెంట్ నాసర్ స్కూలులో తమ పిల్లవాడి అడ్మిషన్ కోసం చెల్లించాల్సిన ఫీజు(School fee) స్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఫీజులో అడ్మిషన్ ఫీజు(School fee), ట్యూషన్ చార్జీలు, లైబ్రరీ ఫీజుల పేరిట కళ్లెం వేసిన వసూళ్లు ఉన్నాయి. ఈ ఫీజు స్లిప్ చూసి నెటిజన్లు తల్లిదండ్రులు షాక్ అవుతున్నారు. ఒకప్పుడు చదువుకోవడం హక్కు అయితే.. ఇప్పుడు అది వ్యాపారంగా మారిపోయిందని కామెంట్లు పెడుతున్నారు.

మధ్యతరగతి కుటుంబాలు ఇంత పెద్ద మొత్తాన్ని ఎలా భరించగలవని ప్రశ్నిస్తున్నారు. పిల్లల చదువు కోసం ఇప్పుడు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు వచ్చాయా? అని కొందరు ఆవేదన చెందుతున్నారు. ఇది కేవలం ఒక స్కూలుకు సంబంధించిన విషయం కాదు, ఇది మన సమాజంలో విద్య యొక్క విలువను తెలియజేస్తున్నాయి.

School fees
School fees

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రైవేట్ పాఠశాలలు తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేస్తున్నా, ప్రభుత్వాలు మాత్రం చోద్యం చూస్తున్నాయి. ఫీజు(school fee) నియంత్రణ బిల్లులు ఉన్నా, వాటిని విజయవంతంగా అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. నాసర్ స్కూల్ లాంటి ఘటనలు ఈ లోపాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. విద్య అనేది ఒక సామాజిక బాధ్యతగా కాకుండా, ఒక వ్యాపారంగా మారిపోయింది. స్కూళ్ళు వేల కోట్లు సంపాదిస్తున్నా, తల్లిదండ్రులపై ఆర్థిక భారం మాత్రం తగ్గడం లేదు.

ఈ సంఘటన కేవలం ఒక స్కూల్ ఫీజు వివాదం కాదు, ఇది భారత విద్యా వ్యవస్థలోని లోపాలను, ప్రజల ఆర్థిక భారాన్ని ప్రతిబింబించే ఒక సామాజిక ప్రశ్న. ప్రభుత్వం, విద్యా సంస్థలు కలిసిపనిచేసి, పిల్లలకు న్యాయమైన, అందుబాటులో ఉన్న ఫీజు విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ప్రస్తుతం అత్యవసరంగా మారింది. లేకపోతే చదువు అనేది కేవలం డబ్బు ఉన్నవారి హక్కుగా మారిపోతుంది.

Also Read: Voter list: ఓటర్ల జాబితాపై రాజకీయ తుఫాన్..అసలు బీహార్‌లో ఏం జరుగుతుంది?

Related Articles

Back to top button