Just TelanganaJust PoliticalLatest News

Kavitha: జనం బాట..కానీ జనం ఏరి ? అయోమయంలో కవిత ప్రయాణం

Kavitha: కవిత జనం బాటలో ఆమె అనుచరులు, జాగృతి సంస్థ కార్యకర్తలే ఎక్కువగా కనిపిస్తున్నారు.అసలు కవిత జనం బాట లక్ష్యం ఏమిటన్నది ఆమె వెంట వెళ్లేవారికి కూడా తెలియదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

Kavitha

తెలంగాణ మాజీ సీఎం, తన తండ్రి కేసీఆర్ మీద తిరుగుబావుటా ఎగరవేసి సొంతంగా పొలిటికల్ ప్రయాణం మొదలుపెట్టిన కల్వకుంట్ల కవిత(Kavitha)కు జనం స్పందన కరువువుతోంది. ఏదేదో ఊహించుకుని భారీ అంచనాలతో జనం బాటకు శ్రీకారం చుట్టిన ఆమెకు పలు చోట్ల ప్రజల నుంచి పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. త్వరలో పొలిటికల్ పార్టీ కూడా పెట్టబోతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్న వేళ తాజా పరిస్థితి ఆమెకు ఇబ్బందికరమనే చెప్పాలి.

నిజానికి బీఆర్ఎస్ లో ఉన్నన్ని రోజులు కవితకు ఫాలోయింగ్ మామూలుగా ఉండేది కాదు. కేసీఆర్ కుమార్తె(Kavitha)గా కావొచ్చు.. కేటీఆర్ చెల్లిగా కావొచ్చు.. తాను సొంతంగా జాగృతి సంస్థతో తెచ్చుకున్న గుర్తింపు కావొచ్చు కీలక నేతగా వ్యవహరించేవారు. ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు వచ్చాయో కవిత(Kavitha)కు ఇబ్బందులు మొదలయ్యాయి.

ఆ స్కామ్ లో ఆమెను కీలక నిందితురాలిగా దర్యాప్తు సంస్థలు పేర్కొన్న తర్వాత ఆ ఎఫెక్ట్ బీఆర్ఎస్ పై కూడా పడింది. బెయిల్ వచ్చిన తర్వాత తండ్రితో సత్సంబంధాలు చెడిపోవడం, కొందరు నేతలను తనను పార్టీ నుంచి పంపించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ లేఖ రాయడం వంటి పరిణామాలు తీవ్ర కలకలం రేపాయి.

Kavitha
Kavitha

ఫలితంగా పార్టీపైనా, కేటీఆర్, హరీశ్ రావుతో పాటు మరికొందరు నేతలపైనా ప్రెస్ మీట్  పెట్టి మరీ  తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం.. తానే రాజీనామా చేస్తున్నట్టు కవిత ప్రకటించడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తర్వాత జనం జాగృతి సంస్థను చూసుకుంటూ పొలిటికల్ జర్నీని కొనసాగిస్తున్నారు.

దీనిలో భాగంగానే కవిత జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభించి జిల్లాల పర్యటన చేస్తున్నారు. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే జనంలో ఉండాలనే ప్రయత్నమే ఈ జనం బాట. అయితే కవిత పర్యటనకు జనం నుంచి అనుకున్నంత స్పందన లేదు. మహిళలు, రైతుల సమస్యలు ప్రస్తావిస్తూ ముందుకెళ్ళాలనుకుంటున్న ఆమె పర్యటనలకు క్షేత్రస్థాయిలో స్పందన మాత్రం రావడం లేదు.

Kavitha
Kavitha

కవిత జనం బాటలో ఆమె అనుచరులు, జాగృతి సంస్థ కార్యకర్తలే ఎక్కువగా కనిపిస్తున్నారు.అసలు కవిత జనం బాట లక్ష్యం ఏమిటన్నది ఆమె వెంట వెళ్లేవారిని కూడా అయోమయానికి గురి చేస్తున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కవిత ఈ మధ్య చేస్తున్న ప్రసంగాల్లో బీఆర్ఎస్ నేతలపై విమర్శలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

కాంగ్రెస్ పాలనపై పెద్దగా విమర్శలు చేయకపోవడంతో ఆమె వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారన్న కామెంట్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. మరోవైపు కవిత (Kavitha)విమర్శలకు బీఆర్ఎస్ నేతలు  గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.దీంతో మొన్నటి వరకూ కేసీఆర్ కుమార్తె అని గౌరవమిచ్చినా ఇప్పుడు పూర్తిగా సీన్ మారినట్టు అర్థమవుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button