Online Betting:సంక్రాంతి కోడి పందాలు.. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్‌పై పోలీసుల నిఘా
Online Betting: పోలీసులు కేవలం కోడిపందాల శిబిరాల దగ్గరే కాకుండా సోషల్ మీడియా , ఆన్ లైన్ బెట్టింగ్)(Online Betting యాప్స్ పై కూడా గట్టి నిఘా పెట్టారు.
Online Betting
సంక్రాంతి పండుగ అనగానే ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాల్లో కోడి పందాల సందడి మొదలవుతుంది. అయితే కోడి పందాలు చట్టరీత్యా నిషేధించబడినా.. సంప్రదాయం పేరుతో చాలా చోట్ల ఇవి జరుగుతూనే ఉంటున్నాయి. అయితే ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పోలీసులు కేవలం కోడిపందాల శిబిరాల దగ్గరే కాకుండా సోషల్ మీడియా , ఆన్ లైన్ బెట్టింగ్ (Online Betting) యాప్స్ పై కూడా గట్టి నిఘా పెట్టారు.
గతంలో జూదగాళ్లు నేరుగా వెళ్లి పందాలు కాసేవారు, ఇప్పుడు టెక్నాలజీని వాడుతూ రహస్యంగా వాట్సాప్ గ్రూపులు , కొన్ని ప్రత్యేకమైన బెట్టింగ్ యాప్స్ ద్వారా లక్షలాది రూపాయలు చేతులు మారుస్తున్నారు.

దీంతో అలర్ట్ అయిన పోలీసు యంత్రాంగం ఈసారి మరింత ఎక్కువగా సైబర్ సెల్ సాయంతో ఇలాంటి ఆన్ లైన్ బెట్టింగ్ (Online Betting)యాప్స్ ను , గ్రూపులను ట్రాక్ చేస్తోంది. ఎవరైనా కోడి పందాల మీద బెట్టింగ్ కాసినా , ప్రోత్సహించినా వారి బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా యువత కోడిపందాల బెట్టింగ్ (Online Betting) ఊబిలో పడి తమ కష్టార్జితాన్ని పోగొట్టుకోకూడదని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. కోడి పందాల నిర్వహణ కోసం వాడే స్థలాల యజమానులపై కూడా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయనున్నారు.
పండుగను సరదాగా జరుపుకోవాలే తప్ప ఇలాంటి జూదాలకు బానిస కాకూడదని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా పందాలు జరిగే ప్రాంతాలను గుర్తించి వాటిపై వెంటనే దాడులు చేయడానికి ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు.
సంప్రదాయం అనేది మూగజీవాల ప్రాణాలను తీసేదిగా లేదా చట్టవిరుద్ధంగా ఉండకూడదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు జూదం పేరుతో ఎంతోమంది తమ డబ్బులు పోగొట్టుకుని రోడ్డు పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అందుకే ఈ ఏడాది పండుగను కోడి పందాల రక్తం లేకుండా, ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




One Comment