Megastar Chiranjeevi:బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి మ్యాజిక్..ఆరు రోజుల్లోనే మన శంకరవరప్రసాద్ గారు రికార్డ్
Megastar Chiranjeevi: చిరంజీవి డ్యాన్స్ స్టెప్పులు, డైలాగ్ డెలివరీ , విక్టరీ వెంకటేష్‌తో మెగాస్టార్ కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచాయి.
Megastar Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) అంటే బాక్సాఫీస్ వద్ద ఒక సునామీ అని మన శంకరవరప్రసాద్ గారు మూవీ మరోసారి ప్రూవ్ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ రోజురోజుకీ తన వసూళ్ల జోరును పెంచుకుంటూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మెగాస్టార్‌లోని వింటేజ్ కామెడీ టైమింగ్‌ను , మాస్ ఎనర్జీని అద్భుతంగా వెలికి తీయడంతో ఆడియన్స్ థియేటర్లకు బ్రహ్మరథం పడుతున్నారు.
కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా కాలం తర్వాత ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ అంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 261 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది.
ఫస్ట్ డే నుంచే రికార్డు వసూళ్లతో మొదలైన ఈ మూవీ ప్రస్థానం, కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరి టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. 6 రోజుల కలెక్షన్ల వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శనివారం వీకెండ్ కావడంతో అన్ని ఏరియాల్లో థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది.
ఆదివారం కూడా ఇదే జోరు కొనసాగితే, కేవలం వారం రోజుల్లోనే రూ. 300 కోట్ల మార్కును అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సంక్రాంతికి విడుదలైన రవితేజ, శర్వానంద్, నవీన్ పోలిశెట్టి మూవీల కంటే ఈ చిరు మూవీ అత్యధిక వసూళ్లతో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతోంది. అనిల్ రావిపూడికి ఇది వరుసగా రెండో సంక్రాంతి బ్లాక్ బస్టర్ కావడం మరో విశేషం.

ఈ సినిమాలో చిరంజీవి డ్యాన్స్ స్టెప్పులు, డైలాగ్ డెలివరీ , విక్టరీ వెంకటేష్‌తో మెగాస్టార్ కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచాయి. చిరంజీవిని మళ్లీ పాత రోజుల్లో లాగా ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్‌లో చూడటం ఆడియన్స్‌కు కనువిందుగా ఉంది. థియేటర్లలో ఈలలు, గోలలతో పండుగ వాతావరణం నెలకొంది. నయనతార నటన , భీమ్స్ సిసిరోలియో సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.
సోషల్ మీడియాలో కూడా ఈ మూవీ రికార్డులపై భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. తన స్టామినా ఏంటో ఈ వయసులో కూడా నిరూపిస్తూ మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. బాక్సాఫీస్ రికార్డుల వేటలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తారో చూడాలి మరి.
Thank you AUDIENCE ❤️🙏🏻🙏🏻🙏🏻#ManaShankaraVaraPrasadGaru #MegaSankranthiBlockbusterMSG pic.twitter.com/0QIEI5qgaR
— Anil Ravipudi (@AnilRavipudi) January 18, 2026



