Latest News

Vijay: విజయ్ కు మలేషియా పోలీసుల షాక్

Vijay: విజయ్ సినిమా కెరీర్ కు ఈ మూవీతోనే ఫుల్ స్టాప్ పడుతుందన్న అంచనాల మధ్య దళపతి ఏం మాట్లాడతాడో అన్న ఆసక్తి అటు అభిమానుల్లో, ఇటు తమిళ రాజకీయ వర్గాల్లో ఉంది.

Vijay

సినిమా నుంచి పొలిటీషియన్ గా మారిన హీరోలు ఎక్కడకు వెళ్లినా రాజకీయాల గురించి కూడా మాట్లాడాల్సిందే.. ఎందుకంటే వారి ఫ్యూచర్ అదే కాబట్టి… సినిమాల ద్వారానే అభిమానులను సంపాదించుకున్న అలాంటి హీరోలు భవిష్యత్తులో పొలిటికల్ లీడర్ గా ఎదిగేందుకు అన్ని విషయాలు మాట్లాడతారు. ప్రస్తుతం తమిళ హీరో విజయ్ కూడా ఇదే కోవలోకి వస్తాడు. చివరి సినిమాతో బిజీగా ఉన్న విజయ్ వచ్చే ఏడాది నుంచి పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించనున్నాడు.

ఈ క్రమంలో విజయ్(Vijay) చివరి సినిమాగా భావిస్తున్న జన నాయగన్ మూవీకి రానురానూ హైప్ పెరిగిపోతోంది. పైగా ఈ మూవీ ఆడియా రిలీజ్ ఫంక్షన్ మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. దీని కోసం ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. అయితే మలేషియా పోలీసులు విజయ్ కు ఊహించని షాక్ ఇచ్చారు. విజయ్ కు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, పొలిటికల్ ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని కఠిన ఆంక్షలు విధించారు. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయకూడదని కండీషన్ పెట్టినట్టు సమాచారం. సహజంగానే విజయ్ స్పీచ్ లు పవర్ ఫుల్ గా ఉంటాయి.

Vijay
Vijay

పైగా పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత కీలక విషయాలు మాట్లాడుతూనే ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో విజయ్ కు మలేషియా పోలీసులు ఇలాంటి కండీషన్ పెట్టడం ఒక విధంగా షాకే. భారీ ఎత్తున జరగబోతున్న ఈ కార్యక్రమానికి దాదాపు 70 వేల మందికి పైగా విజయ్(Vijay) అభిమానులు తరలి రానున్నట్టు అంచనా వేస్తున్నారు. కేవలం సినిమా గురించే మాట్లాడాలని కండీషన్ పెట్టడం అటు విజయ్ అభిమానులకు సైతం నిరాశను కలిగిస్తోంది.

విజయ్ (Vijay)సినిమా కెరీర్ కు ఈ మూవీతోనే ఫుల్ స్టాప్ పడుతుందన్న అంచనాల మధ్య దళపతి ఏం మాట్లాడతాడో అన్న ఆసక్తి అటు అభిమానుల్లో, ఇటు తమిళ రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో విజయ్ సినిమా ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ మ్యూజికల్ కన్సర్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు, తమిళ గాయనీ గాయకులు ఈ వేడుకలో సందడి చేయబోతున్నారు. ఇదిలా ఉంటే హెచ్ వినోద్ డైరెక్షన్ రూపొందిన జన నాయగన్ లో పూజా హెగ్దే హీరోయిన్ గా నటించింది. బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపిస్తుండగా..ప్రియమణి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్ , మమత బైజు వంటి వారు నటిస్తున్నారు. జనవరి 9న అభిమానుల ముందుకు జన నాయగన్ రాబోతోంది.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button