EL NINO Effect : శీతాకాలంలోనూ ఎండలు.. 40 ఏళ్లలో లేని వాతావరణ ముప్పు..
EL NINO Effect : ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ఎల్‌నినో ప్రభావంపై సీరియస్‌గా హెచ్చరిక జారీ చేసింది. పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు 3.8 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని చెప్పింది. ఈ నివేదిక వివరాలు, భారత్‌పై దాని ప్రభావం ఇక్కడ తెలుసుకోండి.
EL NINO Effect
మన వాతావరణంలో గతంలో ఎప్పుడూ చూడని విపరీతమైన మార్పులు రాబోతున్నాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు . పసిఫిక్ మహాసముద్రంలో పుట్టుకొచ్చే ఎల్‌నినో ఈసారి ఊహకందని స్థాయిలో విధ్వంసం సృష్టించడానికి రెడీ అవుతోందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) సంచలన నివేదికను రిలీజ్ చేసింది.
ఈ ఏడాది నవంబరు నుంచి 2027 జనవరి మధ్య కాలంలో పసిఫిక్ మహాసముద్ర ఉపరితల టెంపరేచర్ సగటు కంటే ఏకంగా 3.8 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే ప్రమాదం ఉంటుందని అంచనా వేశారు.
సాధారణంగా సముద్రపు టెంపరేచర్ కేవలం 0.5 డిగ్రీలు పెరిగితేనే దానిని ఎల్‌నినో(EL NINO Effect అని పిలుస్తారు. కానీ ఈసారి ఏకంగా 3.8 డిగ్రీల మార్కును టచ్ అవుతుందన్న న్యూస్ గ్లోబల్ సైంటిస్టుల మైండ్ బ్లాక్ చేస్తోంది. రాబోయే డిసెంబరు నెలకి ఇది పీక్ స్టేజ్‌కి చేరుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు 4 దశాబ్దాల వాతావరణ చార్ట్‌ల అంచనాలను కూడా పూర్తిగా తలకిందులు చేసేలా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయని డబ్ల్యూఎంవో సెక్రటరీ జనరల్ సెలెస్టే సౌలో ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఎల్‌నినో ఎఫెక్ట్(EL NINO Effect) వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో ఊహించని మార్పులు వస్తాయి. ముఖ్యంగా భారతదేశంతో పాటు దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల్లో చలికాలంలో కూడా చలి అన్న మాట ఉండదు. సాధారణం కంటే కూడా చాలా ఎక్కువ ఎండలు మండిపోతాయి. దీనికి తోడు వర్షపాతం దారుణంగా తగ్గిపోవడంతో వ్యవసాయ రంగంతో పాటు తాగునీటి వనరులకు పెద్ద గండం పొంచి ఉందనే సంకేతాలు ఇస్తున్నారు.
అలాగే తూర్పు ఆఫ్రికా, అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎడ తెరిపి లేని భారీ వర్షాలు, భయంకరమైన వరదలు వచ్చే ఛాన్స్ ఉంది. అదే సమయంలో దక్షిణాఫ్రికా, మధ్య అమెరికా, అమెజాన్ అడవుల్లో తీవ్రమైన ఎండలతో కరవు పరిస్థితులు దాపురిస్తాయని తేల్చేశారు. 2026 చివరలో ఇది పీక్స్‌కి వెళ్లడంతో.. దీని సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం చాలా కాలం పాటు కొనసాగుతాయని, ప్రపంచ దేశాలన్నీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేసుకుని జాగ్రత్త పడాలని డబ్ల్యూఎంవో స్పష్టం చేసింది.





