Just LifestyleLatest News

Face Wrinkles : ముఖంపై ముడతలు మాయమవ్వాలా? ఈ 5 పదార్థాలతోనే నిత్య యవ్వనం మీ సొంతం..

Face Wrinkles : డైలీ సిట్రస్ ఫ్రూట్స్, సరిపడా వాటర్ తాగడం వల్ల బాడీ హైడ్రేటెడ్‌గా ఉండి స్కిన్ సాఫ్ట్‌గా మారుతుంది.

Face Wrinkles

ఏజ్ పెరుగుతున్న కొద్దీ ముఖంపై గీతలు, ముడతలు రావడం ఎవరికైనా కామన్. కానీ ఈ రోజుల్లో మారిన లైఫ్‌స్టైల్, పెరుగుతున్న పొల్యూషన్ వల్ల చిన్న వయసులోనే ఫేస్‌లో గ్లో తగ్గిపోవడమే కాకుండా.. త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి.

దీనికోసం వేలకు వేలు డబ్బులు తగలేసి యాంటీ ఏజింగ్ క్రీములు రాస్తూ ఉండటం, బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగడం వంటివి చేస్తారు. కానీ మనం తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే, పెద్ద ఖర్చు లేకుండానే స్కిన్‌ను యంగ్ అండ్ గ్లోయింగ్‌గా మార్చుకోవచ్చని సౌందర్య నిపుణులు అంటున్నారు.

మన స్కిన్‌ను రీఛార్జ్ చేసే అద్భుతమైన ఫుడ్స్‌లో మొదటగా చెప్పుకోవాల్సింది ఉసిరికాయ గురించి. విటమిన్ సి ఖజానాగా పిలవబడే ఉసిరి..స్కిన్‌కు అవసరమైన మినరల్స్‌ను అందిస్తుంది. రక్తప్రసరణను సూపర్ ఫాస్ట్‌గా మార్చి చర్మానికి నేచురల్ గ్లో తీసుకువస్తుంది. అంతేకాదు రోజూ ఉసిరి తింటే హెయిర్ ఫాల్ ప్రాబ్లెమ్‌కు కూడా గుడ్‌బై చెప్పొచ్చు.

అలాగే మనం తినే ఆహారంలోసాల్మన్ ఫిష్‌ ఉండేలా చూసుకోవాలి. సాల్మన్ ఫిష్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రొటీన్లు చర్మ కణాలకు స్ట్రాంగ్ షీల్డ్‌లా నిలిచి, డ్యామేజ్ కాకుండా కాపాడతాయి.

ఇక వంటల్లో ఆలివ్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఆయిల్‌ ఉండే పాలీఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి ముడతలు(Face Wrinkles) రానివ్వవు. వీక్లీ ఒకసారి ఆలివ్ ఆయిల్‌తో ఫేస్, హ్యాండ్స్ మసాజ్ చేసుకున్నా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది.

అంతేకాకుండా సూర్యుని హానికరమైన యూవీ కిరణాల వల్ల స్కిన్ పాడవ్వకుండా డార్క్ చాక్లెట్ బెస్ట్ ఆప్షన్‌గా పని చేస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్‌లో తేమను కాపాడి యవ్వనంగా కనిపింపచేస్తాయి.

Face Wrinkles
Face Wrinkles

దీంతో పాటు బాదం, జీడిపప్పు, పిస్తా వంటి నట్స్ వంటివి డైలీ తినడం వల్ల శరీరానికి అన్‌శాచురేటెడ్ కొవ్వులు, విటమిన్లు అందుతాయి. కాకపోతే ఇవి ఎక్కువ తింటే బరువు పెరుగుతారు కాబట్టి లిమిట్‌గా తీసుకోవాలి.

అలాగే మరీ ముఖ్యంగా డైలీ సిట్రస్ ఫ్రూట్స్, సరిపడా వాటర్ తాగడం వల్ల బాడీ హైడ్రేటెడ్‌గా ఉండి స్కిన్ సాఫ్ట్‌గా మారుతుంది. ఆర్టిఫిషియల్ క్రీముల కంటే ఈ నేచురల్ ఫుడ్స్‌తోనే చర్మాన్ని యంగ్‌గా ఉంచుకోవడమే చాలా ఈజీ.

Isabgol : ఇసబ్‌గోల్ గురించి ఎప్పుడైనా విన్నారా? చిన్న టీస్పూన్ పొడితో ఎన్నో అద్భుతాలు

Related Articles

Back to top button