Graveyard Dating : ఏంటీ గ్రేవ్‌యార్డ్ డేటింగ్? స్మశానాల్లో జెన్ జీ జంటల ఏకాంతం దేనికి దారి తీస్తుంది?
Graveyard Dating : వినడానికి చాలా విచిత్రంగా అనిపిస్తున్నా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో, సామాజిక వర్గాల్లో కూడా గ్రేవ్‌యార్డ్ డేటింగ్ కాన్సెప్ట్‌పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది
Graveyard Dating
ప్రేమ జంటలు అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేవి కాఫీ షాపులు, మల్టీప్లెక్స్ థియేటర్లు, కలర్‌ఫుల్ మాల్స్ , ఆహ్లాదకరమైన పార్కులు. కానీ, ఇప్పటి ‘జెన్ జీ’ (Gen Z) తరం మాత్రం ఇదంతా ఓల్డ్ డేటింగ్ ఐడియాలు అంటూ వాటికి గుడ్ బై చెప్పేస్తున్నారు.
చాలామంది అడుగు పెట్టడానికి కూడా భయపడే శ్మశాన వాటికలను, సమాధుల ప్రాంగణాలను తమ రొమాంటిక్ డేటింగ్ స్పాట్స్‌గా మార్చేసుకుంటున్నారు. వినడానికి చాలా విచిత్రంగా అనిపిస్తున్నా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో, సామాజిక వర్గాల్లో కూడా గ్రేవ్‌యార్డ్ డేటింగ్ (Graveyard Dating) కాన్సెప్ట్‌పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్న జంటలు చెబుతున్నదాని ప్రకారం.. ఇప్పుడు డేటింగ్ అనేది పెద్ద బిజినెస్ అయిపోయింది. ఒక కేఫ్‌కు వెళ్లాలన్నా, చివరకు మంచి రెస్టారెంట్లో కూర్చోవాలన్నా కూడా వేలల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. పైగా ఎక్కడికి వెళ్లినా ఫుల్ క్రౌడ్, సోషల్ మీడియా కోసం ఫోటోలు దిగాలనే తపన, షో-ఆఫ్ కల్చర్ ఎక్కువైపోయి ప్రైవసీ ఉండటం లేదు.
వీటన్నింటికీ డిఫరెంట్‌గా ఎలాంటి హడావుడి, ఆడంబరాలు లేకుండా, రూపాయి ఖర్చు లేని ఒక ప్రశాంతమైన వాతావరణం కేవలం శ్మశానాల్లో మాత్రమే దొరుకుతుందని ఈ తరం నమ్ముతోంది. అక్కడ కేవలం సైలెన్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, లైఫ్ గురించి, ఫ్యూచర్ గురించి చర్చించుకోవడానికి ఇది బెస్ట్ ప్లేస్ అని కొందరు యువతీ యువకులు చెప్పుకొస్తున్నారు.
అయితే, ఈ వింత కల్చర్‌పై విమర్శకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎందుకంటే శ్మశాన వాటికలు అనేవి ఎంటర్టైన్మెంట్ కోసం, రొమాన్స్ కోసం, టైం పాస్ చేయడానికి ఏర్పడినవి కావు. అవి అంతులేని దుఃఖానికి, ఎన్నో జ్ఞాపకాలకు, మరణించిన వ్యక్తులకు ఇచ్చే గౌరవానికి చిహ్నాలు.అక్కడికి వచ్చిన వాళ్లు, తమ నుంచి దూరమైన తమ ప్రియమైన వారిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ నివాళులు అర్పిస్తుంటారు.
అలాంటి అత్యంత భావోద్వేగ భరితమైన, పవిత్రమైన ప్రదేశాన్ని తమ పర్సనల్ హ్యాపీనెస్ కోసం, డేటింగ్ కోసం వాడుకోవడం అనాగరిక చర్య అని విమర్శకులు మండిపడుతున్నారు. ఇది చనిపోయినవారిని అవమానించడమే కాకుండా, సొసైటీలోని నైతిక విలువలను కాలరాయడమే అవుతుందని హెచ్చరిస్తున్నారు.

దీనిని భౌగోళిక, మానసిక కోణంలో విశ్లేషిస్తే.. ఈ గ్రేవ్‌యార్డ్ డేటింగ్(Graveyard Dating) ఇప్పటి యువత మానసిక స్థితిలో వస్తున్న ఒక పెద్ద మార్పుకు సంకేతం అంటున్నారు. డిజిటల్ స్ట్రెస్, పైపై మెరుగుల బంధాలతో విసిగిపోయిన కొంతమంది.. భౌతికంగా నిజమైన, సహజమైన రిలేషన్‌షిప్‌ను కోరుకుంటున్నారు.దీనిలో భాగంగానే దానికోసం వారు ఎంచుకున్న ఈ మార్గం మాత్రం వివాదాస్పదంగా మారుతోంది.
ప్రస్తుతం గ్రేవ్ యార్డ్ డేటింగ్(Graveyard Dating) ట్రెండ్‌కు అంతగా ఆదరణ లేకపోయినా.. వచ్చే జనరేషన్ ఆలోచనలు ఏ వైపుగా ప్రయాణిస్తున్నాయో చెప్పడానికి ఇదొక చక్కని ఉదాహరణగా నిలుస్తోంది.వారి ప్రశాంతత కోసం ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్‌లో పరిమితులను దాటడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నను అందరి ముందు ఉంచుతోంది.
Pisces : అతిగా నమ్మే బలహీనత..మీనరాశి వారికి ఏ నెంబర్, ఏ దేవుడి పూజ కలిసి వస్తుంది?





