Olive Oil : ఆలివ్ ఆయిల్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు..ఖర్చు తగ్గించే హోమ్మేడ్ చిట్కా..
Olive Oil : ఇంట్లో చేసే ఆలివ్ ఆయిల్‌ను మార్కెట్లో లభించే సర్టిఫైడ్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్‌తో కంపేర్ చేయకూడదు.
Olive Oil
హెల్త్ అండ్ ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టే ప్రతి ఒక్కరి కిచెన్‌లోనూ ఆలివ్ ఆయిల్ తప్పకుండా ఉంటుంది. అయితే మార్కెట్లో దొరికే క్వాలిటీ ఆలివ్ ఆయిల్(Olive Oil) రేట్లు చూస్తే సామాన్యుడి జేబుకు పెద్ద తూటే పడుతుంది. అటువంటిది ఇంట్లోనే ఫ్రెష్ ఆలివ్ ఫ్రూట్స్‌తో ఆయిల్‌ను తయారు చేసుకోవచ్చు.
కాకపోతే ఇంట్లో చేసే ఈ ఆయిల్‌ను మార్కెట్లో లభించే సర్టిఫైడ్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్‌తో కంపేర్ చేయకూడదు. అయితే చిన్న మొత్తంలో ఇంట్లోనే ఎక్స్ట్రాక్ట్ చేసే సింపుల్ టెక్నిక్ ఏంటో తెలుసుకుందాం.
దీనికోసం హాఫ్ కేజీ తాజా ఆలివ్‌లు, 2-3 స్పూన్ల గోరువెచ్చని నీళ్లు, శుభ్రమైన కాటన్ లేదంటే మస్లిన్ క్లాత్ తీసుకోవాలి. అలాగే ఒక క్లీన్ గాజు సీసా రెడీగా ఉంచుకోవాలి.
ముందుగా ఆలివ్ ఫ్రూట్స్‌ను వాటర్‌తో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆరాక వాటిలోని గింజలను తీసేసి కేవలం గుజ్జును మాత్రమే మిక్సీ జార్లో వేసుకుని.. పల్స్ మోడ్‌లో మెల్లగా గ్రైండ్ చేయాలి. మిక్సీ ఎక్కువగా వేడెక్కకుండా మధ్యమధ్యలో ఆపుతూ దానిని మెత్తటి పేస్ట్ అయ్యేలా చూడాలి.
తర్వాత ఈ ఆలివ్ పేస్ట్‌ను ఒక గిన్నెలోకి తీసుకుని, కొద్దిగా గోరువెచ్చని వాటర్ కలిపి ఓ 10 నుంచి 15 నిమిషాల పాటు చేత్తో మెల్లగా కలుపుతూ రుద్దాలి. ఇలా చేయడం వల్ల పేస్ట్‌లో ఉన్న ఆయిల్ చుక్కలన్నీ ఒకదానితో ఒకటి కలుస్తాయి.

ఇప్పుడు ఈ పేస్ట్‌ను శుభ్రమైన కాటన్ గుడ్డలో కానీ మస్లిన్ క్లాత్‌లో కానీ వేసి గట్టిగా పిండితే నీటితో కూడిన నూనె బయటకు వస్తుంది. ఈ లిక్విడ్‌ను కొద్దిసేపు కదపకుండా పక్కన పెడితే చాలు నీళ్లన్నీ కిందకి వెళ్లి, నూనె పైపొరలా తేలుతుంది.
ఆ పైన తేలిన ఆయిల్‌ను స్పూన్ లేదా డ్రాపర్‌తో వేరు చేసుకుని గాజు సీసాలో పోసి స్టోర్ చేసుకోవాలి. దీన్ని ఎండ, వేడి తగలని చోట పెట్టాలి. ఇంట్లో చేసిన ఆయిల్ కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా త్వరగా వాడేయడం మంచిది.





