Just LifestyleLatest News

Coriander and Mint Rice:టైమ్ లేనప్పుడు ఈ రైస్ ట్రై చేయండి.. ఒక్కసారి టేస్ట్ చేస్తే వదిలిపెట్టకుండా తింటారు..

Coriander and Mint Rice: ఈజీగా రెడీ అయిపోయే కొత్తిమీర, పుదీనా రైస్ (Coriander and Mint Rice)చేసుకుంటే ఇంట్లో ఉన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ ఇష్టంగా తింటారు.

Coriander and Mint Rice

ఒక్కోసారి టైమ్ లేనప్పుడు బాబోయ్ ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయాలా అని అన్పిస్తుంటుంది. అలాగే కాస్త డిఫరెంట్‌గా ఫాస్టుగా అయిపోయే ఐటెమ్ టేస్ట్ చేసుకుంటే బాగుణ్ణు కదా అన్పిస్తూ ఉంటుంది. అటువంటపుడు ఈజీగా రెడీ అయిపోయే కొత్తిమీర, పుదీనా రైస్ (Coriander and Mint Rice)చేసుకుంటే ఇంట్లో ఉన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ ఇష్టంగా తింటారు.

ఈ పేస్టును ఒకేసారి రెడీ చేసి పెట్టుకుంటే 15,20 రోజుల వరకూ నిల్వ ఉంటుంది. ఎప్పుడైనా ఈ రైస్ తినాలని అనుకున్నప్పుడు ఈ పేస్ట్ వేసి రైస్ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్‌, హెల్త్‌తో పాటు కిచెన్‌లో ఎక్కువ సమయం ఉండాల్సిన పనే ఉండదు. మరి ఇది ఎలా చేయాలో ఏమేం కావాలో ఒకసారి చూద్దామా?

కొత్తిమీర , పుదీనా రైస్ తయారు చేసే విధానం

కొత్తిమీర- 5 కట్టలు
పుదీనా- 3 కట్టలు
పచ్చిమిర్చి – కారాన్ని బట్టి వేసుకోవాలి ( 10 వరకూ వేసుకోవచ్చు)
అల్లం ముక్క- పెద్దది
వెల్లుల్లి పాయలు- 2
జీలకర్ర
ఉప్పు
ఆయిల్
చింతపండు
రైస్
జీడిపప్పు, శనగపలుకులు
ఉల్లిపాయ -1
మసాలా పొడి – హాఫ్ స్పూన్

Coriander and Mint Rice
Coriander and Mint Rice

కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. పుదీనా ఆకులను కడిగి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగాక పచ్చిమిర్చి వేయాలి . అది కూడా వేగాక కొత్తిమీర, పుదీనా వేసి , సాల్ట్ వేసి నీరు ఇగిరిపోయే వరకూ వేపాలి. వేగాక చల్లార్చి అందులో కాస్త చింతపండు వేసి మిక్సీ పట్టి పచ్చడిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీనిని అన్నంతో తిన్నా కూడా బాగానే ఉంటుంది.

రైస్ చేసుకోవడానికి ముందుగా కడాయిలో ఆయిల్ వేసి జీడిపప్పు, శనగపలుకులు వేపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లి ముక్కలు వేసి వేగాక కొత్తిమీర పచ్చడి వేసి బాగా వేపి అందులో వేయించిన జీడిపప్పులు, శనగపలుకులు, అన్నం , సాల్ట్, కొంచెం మసాలా పొడి వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. కొంచెం కొత్తి మీర వేసి స్టౌ ఆఫ్ చేసి ఈ కొత్తిమీర , పుదీనా రైస్ (Coriander and Mint Rice)ను వేడివేడిగా తింటే బాగుంటుంది.

Caste Census:తేలిన కులగణన లెక్కలు.. ఎవరి జనాభా ఎక్కువ?

Related Articles

Back to top button