Just LifestyleLatest News

Relationship Secrets : ప్రేమ ఉంటే సరిపోదా? గోల్స్ డిఫరెంట్‌గా ఉంటే రిలేషన్‌షిప్ సక్సెస్ అవడం కష్టమా?

Relationship Secrets : ఫ్యూచర్‌లో ఎవరి కెరీర్‌కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి? రేపు ఫ్యామిలీ బాధ్యతలు వస్తే ఎలా షేర్ చేసుకోవాలి? ఎవరు ఎలాంటి త్యాగానికి సిద్ధపడాలి ? అనే విషయాలే అసలైన పరీక్షలకు పునాదులు వేస్తాయి.

Relationship Secrets

ప్రేమ పెళ్లి అయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా ముందు అంతా హ్యాపీగానే ఉంటుంది. కానీ రానురాను అదే జీవితాన్ని..తమ లైఫ్ లాంగ్ హ్యాపీగా నడిపించాలంటేనే అసలైన టాస్క్‌గా మారుతుంది. మనసుకు నచ్చిన వ్యక్తి దొరికినా, ఇద్దరి మధ్య ప్రేమ ఎంత బలంగా ఉన్నా.. ఫ్యూచర్‌పై ఉండే ఆలోచనలు, లైఫ్ గోల్స్, కెరీర్ ఇంపార్టెన్స్ వంటివి వేరుగా ఉన్నప్పుడు ఆ రిలేషన్‌షిప్ సక్సెస్(Relationship Secrets) అవుతుందా అనేది చాలామందిని వేధించే ప్రశ్న.

ఈ మోడరన్ యుగంలో కేవలం ఒకరిపై ఒకరికి ఇష్టం ఉంటే మాత్రమే సరిపోదు..లైఫ్ గోల్ కాంపాటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన అంశంగా మారింది. ఫ్యూచర్‌ ఆశయాలు కలవనప్పుడు రిలేషన్‌షిప్‌లో నిశ్శబ్ద యుద్ధాలు మొదలవుతాయి. అయితే వాటిని స్మార్ట్‌గా డీల్ చేయొచ్చని సైకాలజిస్టులు చెబుతున్నారు.

ముఖ్యంగా లేట్ ట్వంటీస్ లేదా ఎర్లీ థర్టీస్‌కు వచ్చేసరికి ఒకేసారి కెరీర్‌లో పీక్స్‌కి వెళ్లాలనే తపన, మరోవైపు పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనే ఇంట్లో వాళ్ల ఒత్తిడులు ఒకేసారి అటాక్ చేస్తాయి. ఒకరు జాబ్ రెస్పాన్సిబిలిటీల్లో మునిగి తేలాలని చూస్తుంటే, ఇంకొకరు వెంటనే పర్సనల్ లైఫ్‌ను ఒక గాడిలో పెట్టడానికి ఆరాటపడుతుంటారు.

మహిళల విషయంలోనైతే ఈ ఊగిసలాట మరింత కాంప్లికేటెడ్ అనే చెప్పాలి. ఒకవైపు డ్రీమ్ జాబ్ కోసం ఎక్కువ గంటలు కేటాయించడం కానీ వేరే ప్రాంతాలకు మారాల్సిన పరిస్థితి రావడం కానీ జరుగుతుంది. అదే సమయంలో ఇంకోవైపు పెళ్లి తర్వాత ఫ్యామిలీ బాధ్యతలు చూసుకోవాలనే ప్రెజర్ వీరిని వెంటాడుతుంది.

అలాగే పార్ట్‌నర్స్‌లో ఒకరు మెట్రో సిటీ కల్చర్‌కు అలవాటు పడటంతో.. అక్కడే లైఫ్ బిల్డ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే.. మరొకరు పేరెంట్స్‌కు దగ్గరగా ఉంటూ ప్రశాంతంగా బతకాలనుకుంటారు. ఇవి వినటానికి చిన్నగానే ఉన్నా.. ఆచరణలో ఇవి చిన్నపాటి అభిప్రాయ భేదాలు మాత్రం కావు. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఎవరి కెరీర్‌కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి? రేపు ఫ్యామిలీ బాధ్యతలు వస్తే ఎలా షేర్ చేసుకోవాలి? ఎవరు ఎలాంటి త్యాగానికి సిద్ధపడాలి ? అనే విషయాలే అసలైన పరీక్షలకు పునాదులు వేస్తాయి.

Relationship Secrets
Relationship Secrets

అయితే ఇద్దరి ఆశయాలు, కలలు వేరుగా ఉన్నంత మాత్రాన వారి బాండ్ ఎండ్ అయిపోయినట్లు కాదు. ఐదేళ్ల ప్లాన్ ఏ ఇద్దరికీ ఒకేలా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ అసలైన రిలేషన్‌షిప్ మ్యాజిక్(Relationship Secrets) ఏంటంటే.. ఒక పార్ట్‌నర్ సెలక్ట్ చేసుకున్న గోల్‌కు, తమకు సంబంధం లేకపోయినా ఇవతలి వ్యక్తి వారికి మనస్ఫూర్తిగా ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతున్నారనేదే ముఖ్యం.

పార్ట్‌నర్ డ్రీమ్స్‌ను త్యాగం చేయమని అడగకుండా, డెస్టినేషన్స్ వేరైనా కూడా వారి పక్కన నడవడానికి సిద్ధంగా ఉండే వ్యక్తిగా ఇవతలి వ్యక్తి ఉండాలి. కేవలం ఒకే రకమైన డ్రీమ్స్, గోల్స్ ఉండటం వల్ల బంధాలు నిలబడవు. ఎప్పుడైతే ఇద్దరి కలలకు ఒకరికి ఒకరు సమానమైన గౌరవాన్ని, ఎదిగే స్పేస్‌ను ఇచ్చుకున్నప్పుడే ఆ బంధం పర్ఫెక్ట్‌గా ముందుకు సాగిపోతుంది.

Perfect Tea : పర్‌ఫెక్ట్ చాయ్ కావాలా? అయితే ఇలా తయారు చేయండి..

Related Articles

Back to top button