Just LifestyleLatest News

Teenage Love:టీనేజ్ లవ్.. ఇది పెళ్లి వరకూ ఎందుకు వెళ్లదు?

Teenage Love: పెళ్లి అనేది కేవలం ఆ ఇద్దరు వ్యక్తుల కలయిక ఒక్కటే కాదు. ప్రేమ పెళ్లిగా మారడానికి సామాజిక ,ఆర్థిక బాధ్యతలతో ముడిపడి ఉన్న పెద్ద నిర్ణయం అని సైకాలజీ వివరిస్తుంది.

Teenage Love

ప్రతీ ఒక్కరి లైఫ్‌లో టీనేజ్ అనేది ఒక మధురమైన అధ్యాయమే. అయితే కొంతమందికి ఆ వయసులో మనసు పొరల్లో ఎదుటివ్యక్తిని చూసినప్పుడు ఏదో తెలియని అలజడి, తెలియని పులకింత మొలకెత్తుతుంది. అదే మొదటి ప్రేమగా సైకాలజీ వివరిస్తుంది.

క్లాస్ రూమ్ బెంచీల మీద ఒకరి పేర్లు ఒకరు రాసుకోవడం, ఎదురుపడినప్పుడు కలిగే ఆ చిన్నపాటి వణుకు, మాట కలపడానికి ఎదుటవారుపడే తపన.. ఇలా చాలామందికి తమ టీనేజ్ లవ్ అనగానే ఇలాంటి ఒక తీపి జ్ఞాపకం మెదులుతుంది.

అయితే టీనేజ్‌(Teenage Love)లో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్న వారిద్దరూ పెళ్లి పీటల వరకు ఎందుకు చేరరన్నది చాలామందిని వేధించే ప్రశ్న. సైకాలజీ చెబుతున్న దాని ప్రకారం చూస్తే.. మనిషి మెదడులోని నిర్ణయాలు తీసుకునే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనే భాగం టీనేజ్‌లో పూర్తిగా డెవలప్ చెందదట.

అందుకే ఆ వయసులో కలిగే ప్రేమ, ఇష్టం, ఆవేశం వంటి భావోద్వేగాలు వారిని నిజాలకు దూరం చేస్తాయి. తాను ప్రేమించిన ఆ వ్యక్తే ప్రపంచం మొత్తం అని, ఆ ప్రేమ దొరకకపోతే జీవితమే లేదని అనుకుంటారు. కానీ పెళ్లి అనేది కేవలం ఆ ఇద్దరు వ్యక్తుల కలయిక ఒక్కటే కాదు. ప్రేమ పెళ్లిగా మారడానికి సామాజిక ,ఆర్థిక బాధ్యతలతో ముడిపడి ఉన్న పెద్ద నిర్ణయం అని సైకాలజీ వివరిస్తుంది.

చాలామంది పేరెంట్స్ వారి పిల్లల టీనేజ్ ప్రేమ(Teenage Love)ను వ్యతిరేకించడానికి కారణం కులం, మతం, ఆస్తులు, అంతస్తులు మాత్రమే కాదు. ముఖ్యంగా సేఫ్టీనే చూస్తారు. స్థిరమైన ఉద్యోగం, రేపటి మీద నమ్మకం లేని ఒక అబ్బాయి చేతిలో తమ కూతురిని పెట్టడానికి ఏ తల్లిదండ్రులు కూడా సాహసం చేయరు.

ఆవేశంలో తీసుకునే ఇలాంటి నిర్ణయాలు మొదట్లో బాగానే ఉన్నా, జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు ఆ జీవితాలు కుప్పకూలిపోతాయి. అందుకే మెచ్యూరిటీ ఉన్న ప్రేమికులు ముందు తమ ప్రేమను ఒక లక్ష్యంగా మార్చుకుంటారు.

Teenage Love
Teenage Love

జీవితంలో ఒక స్థాయికి చేరుకున్నాక, ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాత పెద్దల ముందుకు వెళ్లడం వల్ల ఆ ప్రేమకు ఒక గౌరవం లభిస్తుందని అర్ధం చేసుకుంటారు. ఎందుకంటే ఉద్యోగాల్లో స్థిరపడ్డాక చేసుకునే పెళ్లిళ్లలో ఒక రకమైన రెస్పాన్సిబిలిటీ, ఒకరినొకరు అర్ధం చేసుకోవడం, పనుల్లో చేదోడువాదోడుగా ఉండటం వంటివి కనిపిస్తుంటాయి. ఎందుకంటే వారిద్దరూ టీనేజ్(Teenage Love) ఆకర్షణను దాటుకుని, జీవిత పాఠాలను నేర్చుకుని, ఆ తర్వాత ఏకమవుతారు కాబట్టి వారి బంధం స్ట్రాంగ్‌గా ఉంటుంది.

అయితే కాలచక్రం ఏ ఒక్కరికీ ఒకేలా తిరగదన్న విషయం తెలిసిందే. పరిస్థితుల వల్ల ఆ ప్రేమికులు వేరే వేరే దారిలో వెళ్లాల్సి రావొచ్చు, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి రావొచ్చు. కానీ కొన్నేళ్ల తర్వాత, ఇద్దరికీ వేర్వేరు కుటుంబాలు ఏర్పడ్డాక మళ్లీ ఆ పాత ప్రేమ ఎదురుపడుతుంది. ఇలాంటపుడు మనసు కాస్త చలించడం సహజమే. కానీ ఆ సమయంలో ఆవేశపడటం కానీ, మళ్లీ పాత బంధాన్ని కొనసాగించాలని అనుకోవడం సైకాలజీ ప్రకారం పలాయనవాదం మాత్రమే అవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button