Just LifestyleLatest News

No Marriage : సోలో బతుకే సో బెటర్ .. పెళ్లికి నో అంటున్న యూత్

No Marriage : పెళ్లి చేసుకోవడం కంటే ఒంటరి బతుకే బెటర్ అనుకుంటున్నారు. యువత పెళ్లి ఆలోచనను వద్దనడానికి, ఒంటరి జీవితాన్ని ఎంచుకోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి.

No Marriage

భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ.. భర్తగా మారకు బ్యాచిలరూ..సోలో బ్రతుకే సో బెటరూ అంటూ మనీ సినిమాలో పాట ఎంతగా హిట్‌ అయిందో తెలిసిందే. చాలా మంది దీనిని ఫన్నీగానే తీసుకున్నా ప్రస్తుత యువత మాత్రం దీనికే ఓటేస్తోంది. పెళ్లి ఎందుకు.. ఒంటరిగా ఉండడమే బాగుందంటున్నారు.

ఇది కేవలం యువకులకే పరిమితం కావడం లేదు.. అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకోవడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఒకప్పుడు సగటున పెళ్లి చేసుకునే వారి వయసు 24-26 ఉంటే తర్వాతి కాలంలో అది 28-30కి ఇంకా పైకి వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రేమ పెళ్లిళ్లు, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు ఇలా ఏ మ్యారేజ్ అయినా కూడా యువత నో అంటోంది. దాని కంటే సహజీవనమే బెటర్ అనుకునే పరిస్థితి కనిపిస్తోంది.

పెళ్లి చేసుకోవడం కంటే(No Marriage) ఒంటరి బతుకే బెటర్ అనుకుంటున్నారు. యువత పెళ్లి ఆలోచనను వద్దనడానికి, ఒంటరి జీవితాన్ని ఎంచుకోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. పెరుగుతున్న జీవన వ్యయం, స్వేచ్ఛకు ప్రాధాన్యత, కెరీర్ లక్ష్యాలు, బాధ్యతలను తీసుకోవడానికి ఇష్టపడకపోవడం వంటివి దీనికి ప్రధాన కారణాలుగా విశ్లేషిస్తున్నారు.

పెళ్లి చేసుకుంటే తమకున్న స్వేచ్ఛ తగ్గిపోతుందనే భయం చాలా మందిలో ఉంది. ఒంటరిగా తమకంటూ ఒక ప్రపంచాన్ని ఏర్పరుచుకుని, తమ ఇష్టప్రకారం జీవితం గడపడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. పెళ్లి వద్దనడానికి మరో ప్రధాన కారణం ఆర్థిక సమస్యలు. ఈ రోజుల్లో జీవన ప్రమాణాలు, ఖర్చులు బాగా పెరిగిపోయాయి. వివాహం , తర్వాత పిల్లల బాధ్యతలను మోయడానికి తగినంత ఆర్థిక స్థిరత్వం లేకపోవడం కూడా ఒక పెద్ద సమస్యగా మారింది.

అలాగే సరైన భాగస్వామి దొరక్కపోవడం ఒక కారణం. తమ ఆలోచనలకు, అభిరుచులకు సరిపోయే భాగస్వామి దొరకడం లేదన్నది చాలా మంది చెబుతున్న మాట. పరస్పర అభిప్రాయాలు కలవని పరిస్థితుల్లో రాజీపడేకంటే ఒంటరిగా ఉండటమే మేలని భావిస్తున్నారు. అన్నింటికీ మించి చుట్టూ జరుగుతున్న చాలా సంఘటనలు కూడా కొంత ప్రభావం చూపిస్తున్నాయి.

No Marriage
No Marriage

సెలబ్రిటీలలోనూ అలాగే సన్నిహితుల్లోనూ విడాకులు, కుటుంబ వివాదాలు చూసి పెళ్లి బంధంపై నమ్మకం తగ్గిపోతోంది. చాలా మంది వైవాహిక బంధాలు ఎక్కువ రోజులు కొనసాగలేకపోతుండడంతో ఆ ఎఫెక్ట్ పెళ్లి కాని యువతపై బాగానే పడుతోంది. ఇదిలా ఉంటే మరికొందరు ఉద్యోగంలో స్థిరపడటం, ఉన్నత చదువులు ,విదేశాలలో స్థిరపడాలనే లక్ష్యాలతో పెళ్లిని వాయిదా వేస్తున్నారు. అయితే ఈ పరిస్థితులతో కుటుంబ బంధాలు ఇకపై కనిపించవన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.

Coconut Water : వర్షాకాలంలో కొబ్బరి నీళ్లు తాగొచ్చా? తాగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Related Articles

Back to top button