Just NationalJust PoliticalLatest News

Narendra Modi : బ్యాలెట్ పేపర్ పెట్టినా రిజల్ట్ జీరో.. ఎక్స్ వేదికగా కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ పంచ్‌లు

Narendra Modi : దేశవ్యాప్తంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్‌పై ప్రధాని మోదీ ఘాటుగా స్పందించారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిపినా సరే కాంగ్రెస్‌కు మాత్రం నిరాశే మిగిలిందని ఎక్స్ వేదికగా సెటైర్ వేశారు.

Narendra Modi

దేశవ్యాప్తంగా కొన్ని కీలక రాష్ట్రాల్లో ఇటీవల నిర్వహించిన శాసనమండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల రిజల్ట్ తీవ్ర ఉత్కంఠను రేకెత్తించగా, ఈ ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) సోషల్ మీడియా వేదికగా విపక్ష కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో వ్యంగ్యాస్త్రాలను సంధించారు. కాంగ్రెస్ పార్టీ అసలు ఎన్ని ఎమ్మెల్సీ స్థానాల్లో విజయాన్ని సాధించిందో ఒకసారి చూసుకోవాలంటూ ఎక్స్ వేదికగా వేసిన పంచ్‌లు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక వంటి 4 పెద్ద రాష్ట్రాల్లో మొత్తం 28 శాసనమండలి స్థానాలకు ఈ ఎన్నికలు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. సాధారణంగా ప్రతీ ఎలక్షన్స్ తర్వాత ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, బ్యాలెట్ పేపర్ల వైపే మొగ్గు చూపించే ప్రతిపక్షాలు కోరుకున్నట్లే.. ఈసారి పోలింగ్ అంతా పక్కాగా పాత పద్ధతిలోనే, అంటే బ్యాలెట్ పేపర్ విధానంలోనే జరిగిందని మోదీ పాయింట్ అవుట్ చేశారు.

అయితే ప్రతిపక్షాలు అనుకున్నట్లుగా బ్యాలెట్ పద్ధతిలోనే ఎలక్షన్స్ నిర్వహించినా కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయమే ఎదురైందని మోదీ(Narendra Modi) ఎత్తి చూపారు. ఈ ఎన్నికల రిజల్ట్స్ విపక్షాల వైఫల్యానికి అద్దం పడుతున్నాయని, ఇకనైనా ఈవీఎంల మీద సాకులు చెప్పడం ఆపేసి.. ప్రజల తీర్పును అంగీకరించాలని హితవు పలికారు.

ప్రజల మద్దతు పూర్తిగా కోల్పోయినప్పుడు బ్యాలెట్ పేపర్లు కూడా ఎవరినీ కాపాడలేవనే విషయాన్ని ఈ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా విమర్శించారు. ప్రస్తుతం ప్రధాని చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ దేశ రాజకీయాల్లో నయా చర్చకు దారి తీసింది.

Atlataddi : మొదలైన అట్లతద్ది సందడి..పెరుగన్నం నుంచి 11 అట్ల వాయనం వెనుక ఉన్న అసలు రహస్యం

Related Articles

Back to top button