Vijay : హీట్ పెంచుతున్న విజయ్ విడాకుల వ్యవహారం.. జూన్ 15న కోర్టులో ఏం జరగబోతోంది?
Vijay : విజయ్ డైవోర్స్ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం, విజయ్‌తో పాటు సంగీత కూడా వ్యక్తిగతంగా హాజరుకాకపోవడంపై స్పందించింది.
Vijay
కోలీవుడ్ దళపతి, తమిళ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్ పర్సనల్ లైఫ్ కొద్దిరోజులుగా తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. కొంతకాలంగా విజయ్ వైవాహిక బంధంపై వస్తున్న ఊహాగానాలకు బలం చేకూరుస్తూ, విజయ్ భార్య సంగీత ఇటీవల దాఖలు చేసిన విడాకుల పిటిషన్ న్యాయస్థానం మెట్లెక్కిన విషయం తెలిసిందే. అయితే.. చెంగల్పట్టు ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో సోమవారం అంటే ఏప్రిల్ 20న జరిగిన విచారణలో ఈ కేసు ఒక కీలక మలుపు తిరిగింది.
ఫిబ్రవరిలో దాఖలైన విజయ్ (Vijay ) డైవోర్స్ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం, విజయ్‌తో పాటు సంగీత కూడా వ్యక్తిగతంగా హాజరుకాకపోవడంపై స్పందించింది. వారి తరపు న్యాయవాదులు మాత్రమే కోర్టుకు హాజరై తమతమ వాదనలు వినిపించారు.
ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో విజయ్ (Vijay ) బిజీగా ఉండటంతో.. ఆయనకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యే అవకాశాన్ని కల్పించాలని విజయ్ న్యాయవాదులు కోరారు. అయితే, ఈ అభ్యర్థనను తోసిపుచ్చిన ధర్మాసనం, తదుపరి విచారణ తేదీ అయిన జూన్ 15న విజయ్, సంగీత కూడా కచ్చితంగా కోర్టుకు స్వయంగా హాజరుకావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
1999లో వివాహం చేసుకున్న విజయ్, సంగీత జంటకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే, 2021 నుంచి తామిద్దరి మధ్య దూరం పెరిగిందని సంగీత తన పిటిషన్లో తెలిపారు. నాలుగేళ్లుగా ఒకే ఇంట్లో ఉంటున్నా కూడా, మానసిక ఒత్తిడి వల్ల విడివిడిగానే జీవిస్తున్నామని సంగీత వివరించారు.
సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల వార్తలు తన పిల్లల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని చెబుతూ అందుకే ఈ బంధాన్ని చట్టబద్ధంగా రద్దు చేయాలని కోరారు. అంతేకాకుండా, ఈ కేసు విచారణను గోప్యంగా అంటే ఇన్-కెమెరాగా జరపాలని కూడా ఆమె అభ్యర్థించారు.
కాగా మరోవైపు ఈ విడాకుల వ్యవహారంలో విజయ్, సంగీతకు ఇవ్వబోయే భరణం అంశం ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో చర్చనీయాంశమైంది. విజయ్ ఆస్తుల విలువను బట్టి సంగీత సుమారు 250 కోట్ల రూపాయల వరకు భరణం కోరినట్లు తెలుస్తోంది.

అయితే, విజయ్ 35 కోట్ల రూపాయల వరకు ఆఫర్ ఇచ్చినట్లు, పిల్లల సంరక్షణ బాధ్యతను విజయ్ తీసుకుంటానని ప్రతిపాదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాకపోతే, ఈ ఆర్థిక లావాదేవీలపై ఎటువంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు.
ఇక ఇటు ప్రస్తుతం సినిమాలకు బై చెప్పి..పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్, రాబోయే అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇలాంటి ఇంపార్టెంట్ సమయంలో వ్యక్తిగత జీవితంలోని వివాదాలు కోర్టు వరకు వెళ్లడం విజయ్ రాజకీయ ఇమేజ్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
ప్రత్యర్థి పార్టీలు దీనిని ఒక అస్త్రంగా మార్చుకునే ప్రమాదం కూడా లేకపోలేదు. అయితే, విజయ్ తన వ్యక్తిగత సమస్యలను , రాజకీయ ప్రచారాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
CM Chandrababu:మెగా బర్త్ డే సర్ప్రైజ్.. భార్య భువనేశ్వరిపై సీఎం చంద్రబాబు ఎమోషనల్ పోస్ట్ వైరల్





